Daniel Balaji: డేనియల్ బాలాజీ చివరి కోరిక తీర్చిన డాక్టర్లు - నువ్వు విలన్ కాదు రియల్ హీరో
Daniel Balaji: తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాల్లో విలన్‌గా నటించిన డేనియల్ బాలాజీ.. తాజాగా గుండెపోటుతో మరణించారు. ఆయన మరణించిన తర్వాత ఆయన కోరికను తీర్చాడు చెన్నై డాక్టర్లు.
Daniel Balaji Death: కొన్నిరోజుల క్రితం సినీ పరిశ్రమలో ఒక విషాదం చోటుచేసుకుంది. ఎన్నో తెలుగు, తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటించిన డేనియల్ బాలాజీ కన్నుమూశారు. 48 ఏళ్ల డేనియల్.. హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. దీంతో కోలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. అయితే డేనియల్ బాలాజీకి ఉన్న చివరి కోరికను డాక్టర్లు తీర్చినట్టు కోలీవుడ్‌లో వార్తలు బయటికొచ్చాయి. తన మరణం తర్వాత తన కళ్లను డొనేట్ చేయాలని డేనియల్ ఎప్పుడో నిర్ణయించుకున్నారు. దీంతో చెన్నైలోని కొట్టివాకమ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు.. ఆ బాధ్యతను స్వీకరించారు.
చాలామందికి ఆదర్శం..
చాలామంది సినీ సెలబ్రిటీలు.. తాము మరణించిన తర్వాత అవయవాలను, కళ్లను దానం చేయాలని నిర్ణయించుకుంటారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు అలా చేశారు కూడా. అందులో ఇప్పుడు డేనియల్ బాలాజీ కూడా యాడ్ అయ్యారు. 2021లో కూడా కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం తర్వాత తన కళ్లను దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మార్చి 29న తన ఇంట్లో పడుకున్న తర్వాత డేనియల్ బాలాజీకి ఛాతి నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అలర్ట్ అయ్యి తనను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ దారిలోనే ఆయన గుండెపోటుతో మరణించారు. తమిళ చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పలువురు సెలబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో సినిమాల్లో విలన్‌గా చేసిన డానియల్.. చనిపోయిన తర్వాత తన కళ్లను దానమివ్వాలనే నిర్ణయంతో హీరో అయిపోయారు. ఈ విషయం తెలిసి.. ‘‘నువ్వు విలన్ కాదన్నా.. రియల్ హీరో’’ అని డానియల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. డానియల్ చనిపోయినా.. ఆయన కళ్లు మరొకరికి చూపును ప్రసాదిస్తాయని, ఈ లోకాన్ని చూస్తాయని అంటున్నారు.
కోలీవుడ్‌లోనే ఫేమ్..
‘కాకా కాకా’ అనే తమిళ సినిమాలో సూర్య హీరోగా నటించగా.. అందులో శ్రీకాంత్ ఐపీఎస్ అనే కీలక పాత్రలో డేనియల్ బాలాజీ కనిపించారు. ఇది తన కెరీర్‌నే మలుపు తిప్పింది. అదే మూవీని ‘ఘర్షణ’ పేరుతో తెలుగులో రీమేక్ చేయగా.. ఇక్కడ విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించారు. అందులో కూడా మళ్లీ అదే పాత్రను పోషించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన దాదాపు ప్రతీ సినిమాలో డేనియల్ బాలాజీకి చిన్న రోల్ అయినా ఉంటుంది. తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళ భాషల్లోని సినిమాల్లో కూడా డేనియల్ బాలాజీ నటించినా.. తనకు ఎక్కువగా గుర్తింపు మాత్రం కోలీవుడ్ నుండే దక్కింది.
50 సినిమాలకు పైగా..
డేనియల్ బాలాజీ అన్ని సౌత్ భాషల్లో కలిపి దాదాపు 50 సినిమాల్లో నటించగా.. అందులో ఎక్కువగా నెగిటివ్ రోల్స్‌లోనే కనిపించారు. తన నటనతో, వాయిస్‌తో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ముందుగా ఎన్‌టీఆర్ హీరోగా నటించిన ‘సాంబ’లో చిన్న పాత్రలో కనిపించి టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. రామ్ చరణ్ హీరోగా పరిచయమయిన ‘చిరుత’లో విలన్ కొడుకు పాత్రను పోషించారు. చివరిగా 2021లో నాని హీరోగా తెరకెక్కిన ‘టక్ జగదీష్’తో చివరిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆయన వాయిస్ చాలా డిఫరెంట్‌గా ఉండడంతో తెలుగులో అయినా తమిళంలో అయినా ఆయన పోషించిన పాత్రకు ఆయనే డబ్బింగ్ చెప్పుకునేవారు డేనియల్ బాలాజీ.