(Source: ECI/ABP News/ABP Majha)
Maadhavi Latha: రౌడీయిజం చేసేవాడిని అసెంబ్లీలో కూర్చోబెట్టారు, బూతులు తప్పా చేసిందేమీ లేదు - వైసీపీ మంత్రులపై నటి మాధవీలత కామెంట్స్
వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులపై నటి మాధవీ లత తీవ్ర విమర్శలు చేశారు. మంత్రులుగా తమ బాధ్యతలు నిర్వహించకుండా ఎప్పుడూ ప్రతిపక్షాల మీద బురదజల్లమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
Maadhavi Latha Comments On Ap Ministers: ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ మంత్రులు తమ పదవీ కాలంలో చేసిన ఒక్క మంచి పని లేదని నటి, బీజీపీ నాయకురాలు మాధవీ లత విమర్శించారు. ప్రతిపక్షాలను తిట్టడం మీద ఉన్న శ్రద్ధ, మంత్రులుగా నిర్వహించాల్సిన పనుల మీద లేదని ఆరోపించారు. కొడాలినాని, అంబటి రాంబాబు, రోజా, అమర్ నాథ్ రెడ్డి లాంటి వాళ్లను చూస్తేనే ఏపీ ప్రజలు ఛీదరించుకునే పరిస్థితి నెలకొన్నది వెల్లడించారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
కొడాలి నాని కాదు, బూతుల నాని!
కొడాలి నాని లాంటి వ్యక్తులను చూసి ప్రజలు రాజకీయాలంటే బురద అని భావించే అవకాశం వచ్చిందన్నారు మాధవీ లత. “కొడాలి నాని అంటే బూతుల నాని. భయంకరమైన బూతులు మాట్లాడుతాడు. రోడ్డు మీద రౌడీయిజం చేసే వాడిని పట్టుకొచ్చి, అసెంబ్లీలో కూర్చొబెట్టారంటే అక్కడి జనాలను ఏమనాలో అర్థం కావట్లేదు. ఇలాంటి వారి వల్లే రాజకీయాలంటే దర్టీ అనే భావన జనాల్లో కలుగుతుంది. ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీ అంటే బ్యాడ్ అనే ఒపీనియన్ ఉంది. ఎందుకంటే, అక్కడ కమిట్మెంట్స్ ఉంటాయి. పొద్దున లేస్తే ఇదే పని ఉంటుంది అనుకుంటారు. నాని లాంటి వాళ్లను చూసి కూడా రాజకీయాలంటే ఛీ ఛీ అంటున్నారు. అలాంటి వాళ్లను ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్న ప్రజలది అసలు తప్పు” అన్నారు.
అంబటి రాంబాబు అనగానే ఆ పేర్లే గుర్తుకు వస్తాయి!
“ఇరిగేషన్ మినిస్టర్ అంబటి రాంబాబు అనగానే, సంజన, సుకన్య అనే పేర్లే గుర్తుకు వస్తాయి. ఆయనకు వ్యామోహాలు ఉండటం తప్పు అని నేను అనడం లేదు. అది ఆయన వ్యక్తిగత విషయం. దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన ప్రజలకు చేసే సేవల గురించి చెప్తే బాగుండేది. రైతులకు నీళ్లు ఇచ్చేందుకు చేపట్టిన చర్యలు గురించి మాట్లాడితే బాగుండేది” అని మాధవీ లత అన్నారు.
రోజా చేసిన టూరిజం డెవలప్మెంట్ ఏంటి?
పర్యాటకశాఖ మంత్రి రోజా గురించి ఇప్పటి వరకు తాను ఎలాంటి కామెంట్ చేయాలని చెప్పారు మాధవీ లత. “పర్యాటక శాఖ మంత్రి రోజా గురించి నేను ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయలేదు. కారణం తను ఓ మహిళ. రాజకీయాల్లో మహిళలు మంత్రిగా ఎదగాలంటే అంత ఈజీ కాదు. మగవాళ్లు ఎదగనివ్వరు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో పర్యాటక ప్రదేశాలున్నాయి. బాగా డెవలప్ చేయవచ్చు. రిషికొండను తవ్వి గ్రీన్ మాట్ వేస్తే, హైకోర్టు ఇచ్చిన తీర్పును చదవకుండా ఆమె కామెంట్ చేయడం చూస్తే నవ్వు వస్తుంది. పదవుల కోసం తానా అంటే తందానా అనకూడదు. ఆమె మంత్రి అయ్యాక, టూరిజం ఎంత డెవలప్ అయ్యింది? అనేది చెప్తే బాగుటుంది. కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్నాయి కదా, టూరిజం బాగా డెవలప్ చేయవచ్చు కదా?” అన్నారు.
ఇక ఐటీ మంత్రి అమర్నాథ్ కొడిగుడ్డు మంత్రిగా గుర్తుండిపోతారని మాధవీ లత ఎద్దేవా చేశారు. “జగన్ అలా మంత్రి పదవి అనే బిస్కెట్ వేస్తే అమర్నాథ్ మంత్రి అయ్యారు. కానీ, ఆ పదవిని ఎంత మేర ఉపయోగించుకున్నారు? చెయ్యాల్సిన పనులను వదిలేసి విమర్శలను చేయడం మంచిది కాదు. ఆయన హయాంలో ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయి?” అని ప్రశ్నించారు.