Laila OTT Release Date: 'లైలా'ను థియేటర్లలో మిస్ అయ్యారా... డోంట్ వర్రీ, మార్చిలోనే ఓటీటీ రిలీజ్... ఎప్పుడో తెలుసా?
Laila Movie OTT Platform: విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'లైలా' ప్రేమికుల దినోత్సవం కానుకగా థియేటర్లలో విడుదలైంది. డిజాస్టర్ రిజల్ట్ వచ్చింది. దాంతో ఆ సినిమాను త్వరగా ఓటీటీలోకి తీసుకొస్తున్నారు.

యువ కథానాయకుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన తాజా సినిమా 'లైలా' (Laila Movie). ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల అయింది. మొదటి రోజు మొదటి ఆట నుంచి సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో చెప్పుకోదగ్గ వసూళ్లు రాలేదు. ఇక చేసేది ఏమీ లేక వీలైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకు రావడానికి రెడీ అయ్యారు.
మార్చి 7వ తేదీ నుంచి ఓటీటీలోకి 'లైలా'
Laila OTT Release Date: 'లైలా' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. మార్చి ఏడవ తేదీన తమ ఓటీటీలో విడుదల చేయడానికి రెడీ అయింది. థియేటర్లలో విడుదలైన మూడు వారాలకు విశ్వక్ సేన్ సినిమా డిజిటల్ రిలీజ్ కాబోతోంది. ఇలా జరగడం ఆయనకు కొత్త ఏమీ కాదు. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా కూడా మూడు వారాల్లో ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు మరొక సినిమా ఆ జాబితాలో చేరుతోందంతే!
థియేటర్లలో వసూళ్లు... ఎంతో తెలుసా?
'లైలా'కు మొదటి ఆట నుంచి నెగిటివ్ టాక్ రావడంతో థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు ఆలోచించారు. దాంతో సినిమాకు మరీ తక్కువ వసూళ్లు వచ్చాయి. జస్ట్ కోటిన్నర మాత్రమే కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. విడుదలకు ముందే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అమ్మేయడం వల్ల నిర్మాతలు కొంత సేవ్ అయ్యారు అని చెప్పాలి. డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమాలను తీసుకోవడానికి ఓటీటీ సంస్థలో అంతగా ఆసక్తి చూపించవు. ముందు డీల్ క్లోజ్ చేయడం వల్ల కొంత సేవ్ అయ్యారు.
ఓటీటీలోకు వచ్చిన తర్వాత ట్రోలింగ్ తప్పదా?
'లైలా' సినిమా కోసం విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేశారు. ప్రతి రోజు మేకప్ వేసుకోవడం కోసం రెండు గంటలు కేటాయించి, ఎంతో కష్టపడి సినిమా చేశారు. అయితే థియేటర్లలో ఆయన కష్టానికి తగ్గ ఫలితం రాలేదు. పైగా కొంత మంది నుంచి విమర్శలు ఎదుర్కొంది. అయితే థియేటర్లలో ఎక్కువ మంది సినిమా చూడలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆడియన్స్ ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది. విశ్వక్ సేన్ చెప్పిన కొన్ని డబుల్ మీనింగ్ డైలాగుల నుంచి సీన్స్ వరకు ట్రోలింగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది.
విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అభిమన్యు సింగ్, బబ్లు పృథ్వీరాజ్, రఘు బాబు, 'వెన్నెల' కిషోర్, నాగినీడు తదితరులు ఇతర కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించారు. షైన్ స్క్రీన్స్ సంస్థ మీద సాహు గారపాటి సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా విడుదల తర్వాత వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని మరొకసారి అటువంటివి రిపీట్ కాకుండా చూసుకుంటానని విశ్వక్ సేన్ ఒక లేఖ విడుదల చేశారు.
Also Read: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాలో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

