అన్వేషించండి

OTT: స్కూల్లో పిల్లలను సీలింగ్‌లోకి లాగేసే దెయ్యం - వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన ఇండోనేషియన్ మూవీ ఇది

Movie Suggestions: వరదల వల్ల ఆ గ్రామ రూపురేఖలు మారిపోతాయి. దెయ్యాలు తిరిగే ఆ గ్రామంలోకి వెళ్లి.. ఆ భార్యాభర్తలు ఇరుక్కుపోతారు. భార్య కడుపులోని బిడ్డను దెయ్యం బలి తీసుకోవాలనుకుంటుంది.

Best Horror Movies On OTT: నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన హారర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఏ భాషలో అయినా ఇలాంటి హారర్ సినిమాలు చూస్తామని సిద్ధంగా ఉండేవారి కోసం ‘కుయాంగ్’ (Kuyang) మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఇది ఒక ఇండోనేషినయన్ హారర్ మూవీ. ఇండోనేషియాలో ఒక గ్రామంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమానే ‘కుయాంగ్’. కుయాంగ్ అంటే దెయ్యం. అసలు సరిగ్గా రోడ్డు సదుపాయం కూడా లేని ఒక ఊరికి వెళ్లి భార్యాభర్తలు ఎలా ఇరుక్కుపోతారు అనేది ఈ సినిమా కథ.

కథ..

‘కుయాంగ్’ కథ విషయానికొస్తే.. బీమో (దిమాస్ ఆదిత్య), శ్రీ (అలీస్సా అబిదిన్) భార్యాభర్తలు. వారు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంటారు. అప్పుడే రోడ్డు కూడా లేని ఒక ఊరిలో టీచర్‌గా పనిచేయడానికి బీమోకు అవకాశం వస్తుంది. జీతం ఎక్కువగా ఉండడంతో తమ ఆర్థిక సమస్యలు తీరిపోతాయని బీమో.. ఆ ఉద్యోగానికి ఒప్పుకుంటాడు. కానీ తనను ఒంటరిగా వెళ్లనివ్వడం శ్రీకు నచ్చదు. అందుకే తను కూడా భర్తతో పాటు ఆ గ్రామానికి బయల్దేరుతుంది. వారిని గ్రామంలోకి తీసుకెళ్లడం కోసం ఒక ట్రావెల్ ఏజెంట్‌తో పాటు డ్రైవర్ వస్తాడు. దారిమధ్యలో శ్రీకు కారు కిటికీలో నుంచి ఒక ఎగురుతున్న తల కనిపిస్తుంది. అది చూసి భయపడిన శ్రీ గట్టిగా అరుస్తుంది. దీంతో డ్రైవర్ కారు ఆపేస్తాడు. ఆ కారు మళ్లీ స్టార్ట్ అవ్వదు. అదే సమయంలో దూరం నుంచి ఒక వెలుగు కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి చూస్తే ఒక శవపేటిక చెట్టుకు వేలాడుతూ కనిపిస్తుంది. అది వారిని వెంటాడుతుంది. అందరూ మళ్లీ కారు ఎక్కేసి అక్కడి నుంచి తప్పించుకుంటారు.

చెట్టుకు శవపేటిక వేలాడడం చూసిన బీమో, శ్రీ భయపడతారు. అయితే అది ఆ ఊరిలో ఆచారమని, చనిపోయిన వ్యక్తులను శవపేటికల్లో పెట్టి చెట్లకు వేలాడదీస్తారని డ్రైవర్.. వారికి వివరిస్తాడు. అంతే కాకుండా ఆ ఊరిలో చాలామంది చేతబడి చేస్తారని చెప్తాడు. శ్రీకు కనిపించిన తలను ఆ ఊరిలో కుయాంగ్ అని పిలుస్తారని అంటాడు. ఇదంతా తెలిసినా కూడా బీమో, శ్రీ.. అక్కడికి వెళ్లడానికి సిద్ధమవుతారు. ఆ ఊరికి వెళ్లడానికి కేవలం ఒక్క పడవ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే బయటవారు ఎవ్వరూ ఆ ఊరిలోకి రారు. అలా వచ్చిన బీమో, శ్రీను చూసి అక్కడవారంతా ఆశ్చర్యపోతారు. ఆ ఊరిలోకి ఎంటర్ అయినప్పటి నుంచి తంబి (ఎల్లీ డీ లూథన్).. బీమో, శ్రీలను గమనిస్తూ ఉంటుంది. తను చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. అయితే తనే కుయాంగ్ అని ప్రజలంతా అనుకుంటూ ఉంటారు.

మరుసటి రోజు బీమోతో పాటు శ్రీ కూడా ఆ గ్రామంలోని పిల్లలకు టీచర్‌గా వెళ్తుంది. ఒక పెద్ద వరద వల్ల ఆ గ్రామంలోని స్కూల్ మొత్తం మునిగిపోయి చాలామంది స్టూడెంట్స్ చనిపోతారు. ఇప్పటికీ ఆ స్టూడెంట్స్ ఆత్మలు అక్కడే ఉన్నాయని చాలామంది నమ్ముతారు. అందరూ చెప్పినట్టుగానే శ్రీ క్లాస్‌లో ఉండే మయంగ్ (మెస్సీ గస్తీ) అనే అమ్మాయికి దెయ్యం పడుతుంది. దానిని బీమో కూడా చూస్తాడు. దాని గురించి ఆ స్కూల్ ప్రిన్సిపల్‌కు, గ్రామ సెక్రటరీకి చెప్తారు. దీంతో వారు మీనా (పుత్రీ అయుధ్య) అనే మంత్రగత్తెను తీసుకొస్తారు. ఆ మంత్రగత్తె శ్రీను చూసి తను ప్రెగ్నెంట్‌గా ఉందని, తన కడుపులోని బిడ్డను కుయాంగ్ ఎత్తికెళ్లిపోయి బలిచ్చి శక్తి పొందాలనుకుంటుందని చెప్తుంది. దీంతో తంబినే కుయాంగ్ అని నమ్మిన బీమో.. తనను చంపడానికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరుగుంది? శ్రీను బీమో కాపాడుకోగలడా? వారిద్దరూ ఆ ఊరి నుంచి పారిపోగలరా? అనేది తెరపై చూడాల్సిన కథ.

ఉలిక్కిపడే అంశాలు తక్కువే..

‘కుయాంగ్’ సినిమాలో చాలా తక్కువ పాత్రలు ఉంటాయి. కాబట్టి నటీనటులు ఎవరో తెలియకపోయినా.. ఆ పాత్రలు మాత్రం ప్రేక్షకులు రిజిస్టర్ అయిపోతాయి. అందులో అందరి నటన బాగుంటుంది. హారర్ మూవీ అయినా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడే అంశాలు ఇందులో చాలా తక్కువగానే ఉంటాయి. కానీ చివర్లో ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించలేరు. ఒక డీసెంట్ అండ్ డిఫరెంట్ హారర్ మూవీ ట్రై చేయాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ‘కుయాంగ్’ను ట్రై చేయవచ్చు.

Also Read: శవాలతో తల్లీకూతుళ్ల సావాసం - ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హారర్ మూవీ గురించి తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన, నిర్మాణ బాధ్యతలు ఎవరికంటే
అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన, నిర్మాణ బాధ్యతలు ఎవరికంటే
Repo Rate Cut: బ్రేకింగ్‌ న్యూస్‌ - ప్రజలకు 'రెండో' లడ్డూ, రెపో రేట్‌ తగ్గించినట్లు ఆర్బీఐ ప్రకటన
బ్రేకింగ్‌ న్యూస్‌ - ప్రజలకు 'రెండో' లడ్డూ, రెపో రేట్‌ తగ్గించినట్లు ఆర్బీఐ ప్రకటన
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు
Mark Shankar Health Update: మూడు రోజులపాటు హాస్పిటల్‌లోనే మార్క్ శంకర్.. కొడుకును చూసిన పవన్ కళ్యాణ్, హెల్త్ అప్‌డేట్ ఇదే
మూడు రోజులపాటు హాస్పిటల్‌లోనే మార్క్ శంకర్.. కొడుకును చూసిన పవన్ కళ్యాణ్, హెల్త్ అప్‌డేట్ ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR Batting Strategy IPL 2025 | లక్నో మీద గెలవాల్సిన మ్యాచ్ ను కేకేఆర్ చేజార్చుకుంది | ABP DesamNicholas Pooran 87 vs KKR | లక్నోకు వరంలా మారుతున్న పూరన్ బ్యాటింగ్Priyansh Arya Biography IPL 2025 | PBKS vs CSK మ్యాచ్ లో సెంచరీ బాదిన ప్రియాంశ్ ఆర్య ఎంత తోపంటేDevon Conway Retired Out Controversy | కాన్వే రిటైర్డ్ అవుట్ అవ్వటం సీఎస్కే కొంప ముంచిందా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన, నిర్మాణ బాధ్యతలు ఎవరికంటే
అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన, నిర్మాణ బాధ్యతలు ఎవరికంటే
Repo Rate Cut: బ్రేకింగ్‌ న్యూస్‌ - ప్రజలకు 'రెండో' లడ్డూ, రెపో రేట్‌ తగ్గించినట్లు ఆర్బీఐ ప్రకటన
బ్రేకింగ్‌ న్యూస్‌ - ప్రజలకు 'రెండో' లడ్డూ, రెపో రేట్‌ తగ్గించినట్లు ఆర్బీఐ ప్రకటన
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు
Mark Shankar Health Update: మూడు రోజులపాటు హాస్పిటల్‌లోనే మార్క్ శంకర్.. కొడుకును చూసిన పవన్ కళ్యాణ్, హెల్త్ అప్‌డేట్ ఇదే
మూడు రోజులపాటు హాస్పిటల్‌లోనే మార్క్ శంకర్.. కొడుకును చూసిన పవన్ కళ్యాణ్, హెల్త్ అప్‌డేట్ ఇదే
Sai Abhyankkar: ఎవరీ సాయి అభ్యంకర్? అల్లు అర్జున్ సినిమాకు మ్యూజిక్ చేసే ఛాన్స్ కొట్టేసిన 20 ఏళ్ల కుర్రాడు ఎవరో తెలుసా?
ఎవరీ సాయి అభ్యంకర్? అల్లు అర్జున్ సినిమాకు మ్యూజిక్ చేసే ఛాన్స్ కొట్టేసిన 20 ఏళ్ల కుర్రాడు ఎవరో తెలుసా?
టీడీపీ, బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఆ ఘనత ఉంది- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
టీడీపీ, బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఆ ఘనత ఉంది- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
IPL 2025 Glenn Maxwell Reprimanded:   మ్యాక్స్ వెల్ కు జ‌రిమానా.. మ్యాచ్ ఫీజులో కోత‌.. అత‌ను చేసిన త‌ప్పేమిటంటే..?
మ్యాక్స్ వెల్ కు జ‌రిమానా.. మ్యాచ్ ఫీజులో కోత‌.. అత‌ను చేసిన త‌ప్పేమిటంటే..?
Sapthagiri: టాలీవుడ్‌లో విషాదం... అనారోగ్యంతో కన్ను మూసిన తల్లి... సప్తగిరి ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్‌లో విషాదం... అనారోగ్యంతో కన్ను మూసిన తల్లి... సప్తగిరి ఎమోషనల్ పోస్ట్
Embed widget