అన్వేషించండి

Horror Movies On OTT: శవాలతో తల్లీకూతుళ్ల సావాసం - ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హారర్ మూవీ గురించి తెలుసా?

OTT Horror Movies: ఓటీటీలో వెతికితే ఎన్నో భయంకరమైన హారర్ చిత్రాలు దొరుకుతాయి. అలాంటి ఒక హారర్ చిత్రం.. తాజాగా ఇంగ్లీష్‌లో డబ్ అయ్యి.. ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది.

Best Horror Movies On OTT: కేవలం హాలీవుడ్‌లోనే కాదు.. మరెన్నో ఫారిన్ భాషల్లో కూడా భయంకరమైన హారర్ సినిమాలు తెరకెక్కుతుంటాయి. కానీ అవి ఇంగ్లీష్‌లో డబ్ అయినప్పుడు మాత్రమే ఎక్కువమందికి ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. అలా ఇండోనేషియర్ హార్ మూవీ ఒకటి.. తాజాగా ఇంగ్లీష్‌లోకి డబ్ అయ్యి ఓటీటీలో విడుదలయ్యింది. ఓటీటీలో విడుదలయిన తర్వాత ఈ మూవీని చూసిన చాలావరకు ప్రేక్షకులు దీని గురించి ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో రివ్యూలు పోస్ట్ చేస్తున్నారు. ఇది అసలైన హారర్ సినిమా అని అంటున్నారు. ఇంతకీ ఏంటా సినిమా? ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది?

శవాలను శుభ్రం చేసే పని..

‘పెమండి జెనాజా’ అనేది ఒక ఇండోనేషియన్ హారర్ మూవీ. ఆ భాషలో హిట్ అందుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూవీ ఇంగ్లీష్‌లో ‘కార్ప్స్ వాషర్’ పేరుతో డబ్ అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ హారర్ సీన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టింది ఈ మూవీ. ఇక టైటిల్‌లో ఉన్నట్టుగానే ఈ సినిమాలో హీరోయిన్ లేలా (అఘ్నిని హాక్), సితీ (డెనార్ మెసా ఆయు).. కార్ప్స్ వాషర్స్‌గా పనిచేస్తుంటారు. అసలు ఇలాంటి ఒక వృత్తి ఉంటుందని ఈ మూవీ చూసేవరకు చాలామందికి తెలియదు. కార్ప్స్ వాషర్స్ అంటే శవాలను కడిగేవారు. ఏ పరిస్థితిలో చనిపోయిన శవాలను అయినా శుభ్రం చేసి వారి కుటుంబాలకు అప్పగిస్తారు లేలా, సితీ. చివరికి ఆ వృత్తే వారికి ప్రమాదంగా మారుతుంది.

శవం చేతిలో చావు..

శవాలతో సావాసం చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. కానీ సితీ కుటుంబం ఎప్పటినుండో ఇదే వృత్తిలో ఉంది కాబట్టి తను కార్ప్స్ వాషర్‌గా చాలా ఎక్స్‌పీరియన్స్ సంపాదించుకుంది. ఇక తన కూతురు లేలాను కూడా కార్ప్స్ వాషర్‌గా తయారు చేసింది. శవాలను శుభ్రం చేస్తున్న సమయంలో అప్పుడప్పుడు అవి కళ్లు తెరిచి చూసినట్టుగా వారికి అనిపిస్తూ ఉంటుంది. కానీ సితీ, లేలా దానిని పెద్దగా పట్టించుకోకుండా వారి పని పూర్తి చేస్తుంటారు. ఈ వృత్తిలో ఉండడం వల్ల వారికి దెయ్యాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. వాటికి కూడా వాళ్లిద్దరూ భయపడరు. కానీ ఒకరోజు ఒక శవం.. సితీపై దాడిచేస్తుంది. ఆ సమయంలో లేలా తన పక్కన ఉండదు. దీంతో సితీ.. ఆ శవం చేతిలో చనిపోతుంది.

మహిళల మరణాలు..

తల్లి చనిపోయిన తర్వాత లేలా ఒంటరి అయిపోతుంది. సితీ తర్వాత అదే కాలనీలో జీవిస్తున్న పలువురు మహిళలు అనుమానస్పద స్థితిలో మరణించి ఉంటారు. వారందరికీ లేలానే కార్ప్స్ వాషర్‌గా పనిచేస్తుంది. కానీ అందరి మరణాల వెనుక మరో మహిళ ఉందేమో అని లేలాకు అనుమానం వస్తుంది. ఇంతకు ఎవరు ఆ మహిళ? ఆ ఏరియాలో మహిళలు అందరూ ఎందుకలా చనిపోతున్నారు? వీటికి కారణాలను లేలా కనుక్కోగలదా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘కార్ప్స్ వాషర్’ మూవీ చూడాల్సిందే. భయంకరమైన హారర్ సీన్స్ ఉండడం వల్ల ఇది చిన్నపిల్లలు చూడడం మంచిది కాదని ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు.

Also Read: కాబోయే భార్య.. అంతా చూస్తుండగానే స్వామిజీతో శారీరకంగా కలిస్తే? ఆమె చివరి కోరికను హీరో ఎలా తీరుస్తాడు?

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
Kattalan OTT : ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Casting Couch: డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
Jio Hotstar August Movies : జియో హాట్ స్టార్‌లో ఆగస్ట్ ఫెస్టివల్ - ఈ నెలలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ / వెబ్ సిరీస్‌లు
జియో హాట్ స్టార్‌లో ఆగస్ట్ ఫెస్టివల్ - ఈ నెలలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ / వెబ్ సిరీస్‌లు

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Nithiin Nani : హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Embed widget