అన్వేషించండి

Kuberaa OTT Release Date: నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోన్న బ్లాక్ బస్టర్ 'కుబేర' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

Kuberaa OTT Release: ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ 'కుబేర' త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ విషయాన్ని 'అమెజాన్ ప్రైమ్' సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన ఇచ్చింది.

Dhanush's Kuberaa OTT Release Date: కోలీవుడ్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'కుబేర' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గత నెల 20న మూవీ రిలీజ్ కాగా... నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' సొంతం చేసుకోగా ఈ నెల 18 నుంచి సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. 'ఓ సామాన్యుడు... సులభం కాని ప్రయాణం.' అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రైమ్ వీడియో అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. 

ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా... నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. సినిమాలో బిచ్చగాడి రోల్‌లో ధనుష్, సీబీఐ ఆఫీసర్‌గా నాగార్జున, అమాయక యువతిగా రష్మిక నటించారు. వీరితో పాటే జిమ్ సర్బ్, దలీప్ తాహిల్, ప్రియాంశు ఛటర్జీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సినిమాను భారీ బడ్జెట్‌తో  శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మించారు. విడుదలైన 5 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరింది.

Also Read: ఓటీటీలోకి వచ్చేసిన ఆర్జీవీ 'శారీ' మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

స్టోరీ ఏంటంటే?

దేశంలోనే అత్యంత సంపన్నుడు నీరజ్ మిత్రా (జిమ్ సర్బ్) ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు కావాలని కలలు కంటాడు. ఇదే టైంలో బంగాళాఖాతంలో భారీ ఆయిల్ రిగ్ బయటపడుతుంది. తన డబ్బు, పలుకుబడితో దాన్ని సొంతం చేసుకునేందుకు రూ.లక్ష కోట్లతో ప్రభుత్వంతో డీల్ మాట్లాడుకుంటాడు నీరజ్. అయితే, రూ.50 వేల కోట్లు బ్లాక్, రూ.50 వేల కోట్లు వైట్‌గా ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు కండిషన్ పెడతారు. తన చేతికి మట్టి అంటకుండా ఆ డబ్బును వారి అకౌంట్లలోకి చేర్చేందుకు ప్లాన్ చేస్తాడు నీరజ్. ఇందుకోసం నిజాయతీ పరుడైన దీపక్ సాయం తీసుకుంటాడు. 

ఓ మంత్రి ఇంటిపై రైడ్ చేసినందుకు సిన్సియర్ సీబీఐ ఆఫీసర్ దీపక్‌ను అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తారు. దీంతో దీపక్‌ను తన పలుకుబడితో బయటకు తీసుకొచ్చి ఆ డబ్బును వారి అకౌంట్లలోకి చేరేలా ప్లాన్ చేస్తాడు నీరజ్. ఇందుకు దీపక్  దేవా (దనుష్)తో పాటు మరో ముగ్గురు అనాథలను సెలక్ట్ చేసుకుంటాడు. వారి పేరు మీద విదేశాల్లో బినామీ కంపెనీలు సృష్టించి వారి అకౌంట్లలోకి డబ్బులు చేరవేస్తాడు. అలా చేరిన వెంటనే ఒక్కొక్కరినీ దీపక్‌కు తెలీకుండా చంపేస్తుంటాడు నీరజ్. అయితే, నీరజ్ గ్యాంగ్ నుంచి తప్పించుకుంటాడు దేవా. ఆ తర్వాత ఏం జరిగింది? రూ.10 వేల కోట్ల కోసం నీరజ్ బిచ్చగాడిలా ఎందుకు మారాల్సి వచ్చింది? ఆ రూ.10 వేల కోట్లను దేవా ఏం చేశాడు? తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget