Saaree OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన ఆర్జీవీ 'శారీ' మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Saaree OTT Platform: ఆర్జీవీ డెన్ నుంచి వచ్చిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ 'శారీ' ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీతో పాటే మరో సైన్స్ ఫిక్షన్ మూవీ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Aaradhya devi's Saaree Movie OTT Streaming On Aha: సంచలన దర్శకుడు ఆర్జీవీ డెన్ నుంచి వచ్చిన రొమాంటిక్ క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. రియల్ లైఫ్ ఘటనల ఆధారంగా తెరకెక్కిన 'శారీ' మూవీ ఏప్రిల్‌లో రిలీజై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు తాజాగా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా'లో 'శారీ' మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు రచనా సహకారంతో పాటు నిర్మాణంలోనూ రామ్ గోపాల్ వర్మ భాగమయ్యారు. ఆయన శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించగా... ఆరాధ్య దేవి, సత్య యాదు, సాహిల్ సంభ్యాల్, కల్పలత కీలక పాత్రలు పోషించారు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ మూవీని నిర్మించారు. యూపీలోని అమాయక మహిళలను దారుణంగా హతమార్చిన ఓ శారీ కిల్లర్ స్టోరీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.
Also Read: మనల్ని ఎవడ్రా ఆపేది - 'జబర్దస్త్'లోకి నాగబాబు రీ ఎంట్రీ?... ఈసారి మోత మోగిపోద్ది అంతే...
స్టోరీ ఏంటంటే?
ఆరాధ్య దేవికి చీరలంటే మహా ఇష్టం. చీరలోనే రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ పోస్ట్ చేస్తుంటుంది. ఓసారి ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లగా... ఆమెను చూసి ఇష్టపడిన ఫోటో గ్రాఫర్ కిట్టు (సత్య యాదు) దొంగచాటుగా ఫోటోలు తీస్తుంటాడు. ఆరాధ్యతో పరిచయం పెంచుకోవాలని భావించి ఇన్ స్టాలో ఆమెతో చాట్ చేస్తుంటాడు. అలా ఆమెను ఫోటో షూట్‌కు ఒప్పిస్తాడు. ఆరాధ్యను కిట్టు ప్రేమిస్తున్నా... అతన్ని మాత్రం ఆమె ఓ ఫ్రెండ్‌లానే భావిస్తుంది.
ఫోటో షూట్ టైంలోనే కిట్టుతో ఆరాధ్య అన్నయ్య రాజు (సాహిల్ సంభ్యాల్) గొడవకు దిగుతాడు. ఫోటో షూట్ తర్వాత కిట్టును ఆరాధ్య దూరం పెడుతుంది. ఇది సహించలేని కిట్టు ఆమె వెంటపడుతూ వేధిస్తుంటాడు. దీంతో అతనిపై కేసు పెట్టగా... సైకోలా మారతాడు. చివరకు ఈ సైకో బారి నుంచి ఆరాధ్య ఎలా బయటపడింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
మరో మూవీ కూడా...
ఇక ఇదే ఓటీటీలోకి మరో లేటెస్ట్ మూవీ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. శ్రద్ధా శ్రీనాథ్, కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'కలియుగం 2064' కూడా సడెన్‌గా 'ఆహా'లో అందుబాటులోకి వచ్చింది. తమిళ, తెలుగు భాషల్లో ప్రమోద్ సుందర్ ఈ మూవీని తెరకెక్కించగా మే 9న రిలీజై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. 2064లో ప్రపంచం ఎలా ఉండబోతుంది అనేదే బ్యాక్ డ్రాప్‌గా మూవీని రూపొందించారు.
స్టోరీ ఏంటంటే?
ప్రపంచం అంతమైన తర్వాత ఏం జరుగుతుంది? అనేదే సినిమాలో చూపించారు. ధనవంతులు 2064లో ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారు. మానవాళి పూర్తిగా అంతమైన తర్వాత అందులోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. అయితే, ఆహారం, నీళ్లు దొరకని పరిస్థితుల్లో ఆ కొత్త ప్రపంచానికి వెళ్లేందుకు సామాన్యులు కూడా చూస్తారు. అలా వెళ్లిన శక్తి, భూమి అనే ఇద్దరికీ ఎలాంటి పరిస్థితి ఎదురైంది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















