అన్వేషించండి

Sopathulu OTT: కల్లు కుండలో పాలసుక్క లాంటి సినిమా - ఈటీవీ విన్ ఓటీటీలో కామెడీ డ్రామా ‘సోపతులు’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Sopathulu OTT release date: తెలంగాణ గ్రామీణ కథాంశంతో తెరకెక్కిన తాజా చిత్రం ‘సోపతులు’. బాల్యపు గుర్తులను, చిన్ననాటి స్నేహాలను గుర్తు చేసే ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది.

ETV Win Sopathulu OTT release date: పల్లెటూరు కథలతో తెరకెక్కి సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ దక్కించుకుంటాయి. రీసెంట్ గా వచ్చిన ‘90'స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ లాంటి వెబ్ సిరీస్, ‘మేమ్ ఫేమస్’ లాంటి సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘సోపతులు’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా నేరుగా ఈటీవీ విన్ లో విడుదలకాబోతోంది. ఈ సినిమాకు అనంత్ వర్దన్ దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. ఈ ట్రైలర్ చివరలో మేకర్స్ స్ట్రీమింగ్ డేట్ ను ఖరారు చేశారు.  

ఆకట్టుకున్న ‘సోపతులు’ ట్రైలర్

‘సోపతులు’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల అయింది. తెలంగాణలోని ఓ పల్లెటూరులో ఈ సినిమా కథ కొనసాగుతుంది. స్కూల్ పిల్లల చిలిపి గొడవతో మొదలు అయిన ట్రైలర్... తర్వాత ఆ పిల్లల ఆట పాటలతో హ్యాపీగా జాలీగా సాగింది. ఈ సినిమా కథ కరోనా కాలంలో నడుస్తుంది. కరోనా లాక్ డౌన్ విధించడంతో స్నేహితులు విడిపోతారు. ఆన్ లైన్ క్లాసుల కోసం స్మార్ట్ ఫోన్లు కొనేందుకు తల్లిదండ్రులు పడ్డ ఇబ్బందులు సహా, కరోనా కష్టకాలంలో ప్రజలు పడ్డ అవస్థలను ఇందులో ప్రస్తావించారు. ఈ సినిమా ట్రైలర్ చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేస్తూ ఆకట్టుకుంది. పిల్లల కామెడీ, స్నేహం, అమాయకత్వం, భావోద్వేగాలను ఇందులో చక్కగా చూపించారు. ఈ సినిమాలోని సంభాషణలు అన్నీ తెలంగాణ మాండ‌లికంలో ఆకట్టుకుంటున్నాయి. అందరినీ న‌వ్విస్తూనే హృద‌యాల్ని క‌దిలించే భావోద్వేగాల‌తో ఈ మూవీ కథ కొనసాగుతోంది. కల్లు కుండలో పాలసుక్క లాంటి సినిమా అంటూ ట్రైలర్ చివరలో చిత్రబృందం ప్రకటించింది.   

ఇక సోపతులు సినిమాలో భాను ప్రకాశ్, శృజన్, మోహన్ భగత్, మణి అయిగుర్ల, అనూష రమేశ్, అంజయ్య మిల్కూరి, సురభి లలిత, నిమ్మనగోటి పద్మ కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్న మోహ‌న్ భ‌గ‌త్  శ్రీకేరాఫ్ కంచెర‌పాలెం’, ‘ఆరంభం’తో పాటు పలు సినిమాల్లో నటించాడు. మ‌ణి అగుర్ల ‘మేమ్ ఫేమ‌స్‌’, ‘మెయిల్’ లాంటి సినిమాల్లో కనిపించి ఆకట్టుకున్నాడు. ‘సోప‌తులు’ సినిమాకు సింజీత్ ఎర్ర‌మ‌ల్లి మ్యూజిక్ అందిస్తున్నారు.

రీసెంట్ గా ఈటీవీ విన్ లో విడుదలైన ‘వీరాంజ‌నేయులు విహార యాత్ర’ సినిమా మంచి ఆదరణ దక్కించుకుంది. ఎమోషనల్ కథాశంతో కొనసాగిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా అలరించింది. ఇప్పుడు ‘సోపతులు’ సినిమా కూడా ప్రేక్షకుల చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఆకట్టుకుంటుందని మేకర్స్ వెల్లడించారు. సెప్టెంబ‌ర్ 19 నుంచి ఈ మూవీ ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ మేరకు ఈటీవీ విన్ రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

Also Read: జానీ మాస్టర్‌ కేసులో బయటపడ్డ సంచలన విషయాలు - ఆయన భార్య కూడా వేధించిందంటూ బాధితురాలు ఆరోపణలు

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Embed widget