Dacoit OTT : అడివి శేష్ డెకాయిట్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Dacoit OTT Platform : అడివి శేష్, మృణాల్ జంటగా నటించిన డెకాయిట్ ఓటీటీ రిలీజ్‌పై ఇంట్రెస్ట్ నెలకొంది. థియేట్రికల్ రన్ అయిన 4 - 6 వారాల తర్వాత ఓటీటీలోకి రానుంది.

Adivi Sesh's Dacoit OTT Release Platform Locked : యంగ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ లవ్ రొమాంటిక్ థ్రిల్లర్ డెకాయిట్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడివి శేష్ యాక్టింగ్, మాస్ లుక్‌కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' సొంతం చేసుకోగా... థియేట్రికల్ రన్ పూర్తైన 4 - 6 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. షానిల్ డియో దర్శకత్వం వహించగా... శేష్, మృణాల్‌లతో పాటు ప్రకాష్ రాజ్, జైన్ మేరీ ఖాన్, సునీల్, అనురాగ్ కశ్యప్, అతుల్ కులకర్ణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ సంస్థలపై కింగ్ నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మించారు.
Also Read : మోనాలిసా భర్త ఫర్మాన్‌పై పోక్సో కేసు - కుంభమేళా వైరల్ గర్ల్ పెళ్లి ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్
స్టోరీ ఏంటంటే?
హరిదాస్ (అడివి శేష్) ఓ మర్డర్ కేసులో 13 ఏళ్లుగా జైలులో ఉంటాడు. తన ప్రియురాలి మోసం వల్లే అతను జైలు జీవితం గడపాల్సి వస్తుంది. ఓ రోజు తనను కడప జైలు నుంచి మారుస్తుండగా... ఇషాద్ భాయ్ (అతుల్ కులకర్ణి) సాయంతో పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత అతన్ని దుబాయ్ పంపేందుకు ఏర్పాటు జరుగుతుంటాయి. ఇందుకు రూ.60 లక్షలు అవసరం కాగా... ఆ డబ్బు సంపాదించడం సహా మరో పని కూడా చేయాలనుకుంటాడు హరిదాస్.
ఈ క్రమంలోనే తన మాజీ ప్రేయసి సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్)పై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. ఆమెను వెతుక్కుంటూ వెళ్లగా తన ఆరేళ్ల పాపతో కనిపిస్తుంది. ఆమె భర్త భాస్కర్ (వైభవ్) తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలవుతాడు. అతని ప్రాణాలు కాపాడాలంటే కోటి రూపాయలు కావాలి. ఆమె పరిస్థితిని చూసి డబ్బు అవసరంతో ఆమె దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తాడు హరిదాస్. దీని కోసం అతను వేసిన ప్లాన్ ఏంటి? అసలు భార్యాభర్తలు కావాల్సిన వాళ్లు ఎందుకు శత్రువులుగా మారారు? హరిదాస్‌ను సరస్వతి ఎందుకు మోసం చేయాల్సి వచ్చింది? దీనికి ఆమె భర్త భాస్కర్‌కు ఉన్న లింకేంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















