Killer Soup Trailer : మనోజ్ బాజ్ పేయి ‘కిల్లర్ సూప్’ ట్రైలర్ - ఇదో డార్క్ క్రైమ్ స్టోరీ
Killer Soup : బాలీవుడ్ సీనియర్ యాక్టర్ మనోజ్ బాజ్ పాయ్ నటిస్తున్న 'కిల్లర్ సూప్' వెబ్ సిరీస్ ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.
Bollywood Senior Actor Manoj Bajpayee's Killer Soup Trailer : బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నార్త్ తో పాటూ సౌత్ లోనూ విభిన్న పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నాడు. ఇటీవల కాలంలో వచ్చిన 'ఫ్యామిలీ మెన్' వెబ్ సిరీస్ తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ అన్ని భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటికే రెండు సీజన్స్ రిలీజ్ అవ్వగా త్వరలోనే మూడో సీజన్ కూడా రాబోతోంది. ఫ్యామిలీ మెన్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో మనోజ్ బాజ్ పాయ్ కి అవకాశాలు క్యూ కట్టాయి.
ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సిరీస్ తో రాబోతున్నాడు ఈ సీనియర్ నటుడు. మనోజ్ బాజ్ పాయ్ నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ 'కిల్లర్ సూప్'. ఉడ్తా పంజాబ్', 'సోంచిరియా' వంటి సినిమాలను తెరకెక్కించిన అభిషేక్ చౌబే దర్శకత్వం వహిస్తున్నాడు. సీనియర్ నటుడు నాజర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కొంకణ్ సెన్‌శర్మ కథనాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అందుకని సిరీస్ పై మరింత క్యూరియాసిటీ పెంచింది. ఈ క్రమంలోనే ఈరోజు 'కిల్లర్ సూప్' ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానున్నఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
సుమారు 2 నిమిషాల 22 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో వెబ్ సిరీస్ అసలు కథ గురించి ఏమాత్రం రివీల్ చేయకుండా ఆసక్తికరమైన విజువల్స్‌తో సాగింది. ముఖ్యంగా ట్రైలర్ మధ్యలో వచ్చే బాంబే సినిమాలోని తూహీ రే సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్ లో మనోజ్ బాజ్ పాయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని డార్క్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ని తెరకెక్కించారు. హిందీతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
మనోజ్ బాజ్‌పాయ్ కిల్లర్ సూప్ ట్రైలర్ :
జనవరి 11 న ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్‌లో ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక రీసెంట్ గా మనోజ్ బాజ్ పాయ్ 'జోరామ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్మితా తాంబే, జీషన్ అయ్యూబ్ కూడా కీలక పాత్రల్లో నటించగా డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా ఈ సినిమాకి డర్బన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DIFF) లో పలు పురస్కారాలు దక్కాయి. ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పేయి ప్రతిభకు 'ఉత్తమ నటుడు' బిరుదును అందుకున్నారు.
Also Read : RGVకి షాక్ ఇచ్చిన హైకోర్టు - 'వ్యూహం' సినిమాపై అక్కడే తేల్చుకోమంటూ?