Vyooham Movie Release: RGVకి షాక్ ఇచ్చిన హైకోర్టు - 'వ్యూహం' సినిమాపై అక్కడే తేల్చుకోమంటూ?
Vyooham : వ్యూహం సినిమా విడుదల విషయంలో హైకోర్టు చిత్ర యూనిట్ కి భారీ షాక్ ఇచ్చింది.
Vyooham Movie Release: టాలీవుడ్ లో కాంట్రవర్సీ కి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే అందరూ చెప్పేది RGV పేరే. ఒకప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ గత కొంతకాలంగా పొలిటికల్ జోనర్‌లో సినిమాలు తెరకెక్కిస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు, రాజకీయ నాయకుల పరిస్థితి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈయన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంపై 'వ్యూహం' అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా పాదయాత్ర మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు? అనే అంశాలను ప్రధానంగా చేసుకుని ‘వ్యూహం’ సినిమాని తీశాడు రామ్ గోపాల్ వర్మ. రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమాకి సెన్సార్ చేయలేము అని చెప్పినా కూడా ఆర్జీవి సెంట్రల్ సెన్సార్ బోర్డు వరకు వెళ్లి రివిజన్ పిటిషన్ వేయడంతో రీసెంట్ గానే సెన్సార్ పూర్తి చేసుకుంది.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 29వ తేదీన సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవ్వగా అంతలోనే మేకర్స్ కి హైకోర్టు షాక్ ఇచ్చింది. వ్యూహం సినిమాని జనవరి 11వ తేదీ వరకు రిలీజ్ చేయకూడదని స్టే విధించింది. రామ్ గోపాల్ వర్మ తెచ్చుకున్న సెన్సార్ సర్టిఫికెట్ మీద ఈ స్టే విధించింది దీంతో సినిమాపై హైకోర్టులో విచారణ చేపట్టారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ సవాలు చేస్తూ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. సినిమా విడుదల ఆగిపోవడం వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని నిర్మాత తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణను సింగిల్ బెంచ్ ఈనెల 11 కు వాయిదా వేసిందని తెలిపారు. ఇక దీనిపై స్పందించిన హైకోర్టు సింగిల్ బెంచ్ లోనే తెలుసుకోవాలని పిటిషనర్ కు స్పష్టం చేసింది.
మరోవైపు వ్యూహం సినిమాలో TDP అధినేత చంద్రబాబును కించపరిచేలా చూపించారని ఇటీవల నారా లోకేశ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ‘వ్యూహం’ చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదల కూడా నిలిపివేయాలని ఆయన కోరారు. ఇక వ్యూహం సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు అజ్మల్ అమీర్ నటిస్తుండగా.. జగన్ భార్య వైఎస్ భారతి పాత్రలో మానసా రాధాకృష్ణన్ కనిపించనుంది. ధనుంజయ్ ప్రభూనే, సురభి ప్రభావతి, రేఖా నిరోషా, వాసు ఇంటూరి, కోటా జయరామ్, ఎలినా ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. రామధూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Read : 2023లో బెస్ట్ ఫిల్మ్ 'యానిమల్' - రణ్ బీర్ సినిమాపై కరణ్ జోహార్ ప్రశంసలు!