అన్వేషించండి

Indian 2 OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘భారతీయుడు 2’ - ఎప్పుడు, ఎక్కడంటే?

Indian 2 OTT Release: క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన భార‌తీయుడు - 2 ఓటీటీ అప్ డేట్ వ‌చ్చేసింది. మ‌రి ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతుంది. స్ట్రీమింగ్ ఎప్పుడు?

Kamal Hassan’s Indian 2 OTT release date movie Update: ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన 'భార‌తీయుడు - 2'. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా.. జులై 12న ప్రేక్ష‌కుల ముందుక వ‌చ్చింది. ఎన్నో భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజైన ఈ సినిమాపై మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. అయితే, సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం మాత్రం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి ఓటీటీ అప్ డేట్ వ‌చ్చేసింది. మ‌రి స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్క‌డ స్ట్రీమ్ అవుతుందో చూద్దాం. 

స్ట్రీమింగ్ ఎక్క‌డంటే? 

'భారతీయుడు - 2' ఓటీటీ రిలీజ్ అప్ డేట్ పై వార్త ఫిలిమ్ న‌గ‌ర్ లో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ ద‌క్కించుకుంది. ఇక ఈ సినిమా ఆగ‌స్టులో స్ట్రీమ్ అవుతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా మంచి డీల్ కే అమ్ముడుపోయిన‌ట్లు కూడా తెలుస్తోంది. అయితే, డేట్ పై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. 

భారీ అంచ‌నాలు.. 

'భార‌తీయుడు - 2' సినిమా 1996లో రిలీజైన 'భార‌తీయుడు'కి కొన‌సాగింపుగా వ‌చ్చింది. దాదాపు 30 ఏళ్ల త‌ర్వాత దీనికి సీక్వెల్ తీశారు. భార‌తీయుడు సూప‌ర్ హిట్ కావ‌డంతో పార్ట్ - 2 పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే, సినిమా అనుకున్న‌ట్లు ఆక‌ట్టుకోలేద‌నే రివ్యూలు వ‌చ్చాయి. కానీ, సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ యాక్టింగ్‌కు మాత్రం ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఆయ‌న యాక్టింగ్ అద్భుతంగా ఉంది అంటూ.. ప్ర‌శంసించారు. 

రూ.150 కోట్లు.. 

'భార‌తీయుడు - 2' సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు రూ.150 కోట్లు వ‌సూలు చేసింది. పాన్ ఇండియా సినిమాగా రిలీజైన 'భార‌తీయుడు - 2' తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో రిలీజ్ అయ్యింది. ఇది 2డీ, ఐమాక్స్, 4డీఎక్స్ ఫార్మెట్స్ లో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.6.88 కోట్లు వ‌సూళ్లు సాధించింది. ఇక మొద‌టిరోజు 3.88 ల‌క్ష‌ల టికెట్లు అమ్ముడై పోయాయి. 

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్, కాజ‌ల్ అగ‌ర్వాల్, సిదార్ధ‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, శివ భ‌వాని శంక‌ర్ త‌దిత‌రులు న‌టించారు. ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ అందించారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సుభ‌క‌ర‌ణ్ అల్లీరాజ్, ఉద‌య్ నిధి స్టాలిన్ కి చెందిన జియాంట్ మూవీస్ సంయుక్తంగా సినిమాని నిర్మించారు. 

'భార‌తీయుడు - 3'

ఇక ఇప్పుడు 'భార‌తీయుడు - 2' సినిమాకి కొన‌సాగింపుగా 'భార‌తీయుడు - 3' సినిమా ఉంటుంద‌ని గ‌తంలో ప్ర‌క‌టించారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా అనుకున్నంత‌గా రానించ‌క‌పోవ‌డంతో 'భార‌తీయుడు - 3' ఉండ‌క‌పోవ‌చ్చు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. ‘భార‌తీయుడు’ సినిమాలో అవినీతిపై, స్వాతంత్య్రం రాక‌ముందు ఉన్న ప‌రిస్థితుల‌పై తెర‌కెక్కించారు. ఇక ‘భార‌తీయుడు - 2' లో కూడా అవీనీతిపై పోరాటం గురించే చూపించారు. ఇక ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు శంక‌ర్ 'గేమ్ ఛేంజ‌ర్' షూట్ లో బీజీగా ఉన్నారు. అయితే, ‘భారతీయుడు 2’ ప్రభావం ఆ మూవీపై పడుతుందేమో అని చెర్రీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Also Read: నాలాంటివాడు వీధుల్లోనే చావాలా? తనపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించిన ధనుష్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Latest News:ఏపీ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొత్త విధానం- పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి
ఏపీ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొత్త విధానం- పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి
Arcelormittal Nippon Steel India: 2029 నాటికి ఆర్సెలర్‌మిట్టల్ స్టీల్ తొలి దశ పూర్తి - ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే?
2029 నాటికి ఆర్సెలర్‌మిట్టల్ స్టీల్ తొలి దశ పూర్తి - ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే?
Telangana Weather: తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ వడగళ్ల వాన- అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ వడగళ్ల వాన- అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
AP Latest Weather: ఓవైపు ఉక్కపోత, మరోవైపు పిడుగుల మోత-ఏపీలో భిన్న వాతావరణం
ఓవైపు ఉక్కపోత, మరోవైపు పిడుగుల మోత-ఏపీలో భిన్న వాతావరణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Angkrish Raghuvanshi 50 vs SRH | ఐపీఎల్ చరిత్రలో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసిన రఘువంశీKamindu Mendis Ambidextrous Bowling vs KKR | IPL 2025 లో చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్ ప్లేయర్Sunrisers Flat Pitches Fantasy | IPL 2025 లో టర్నింగ్ పిచ్ లపై సన్ రైజర్స్ బోర్లాSunrisers Hyderabad Failures IPL 2025 | KKR vs SRH లోనూ అదే రిపీట్ అయ్యింది

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Latest News:ఏపీ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొత్త విధానం- పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి
ఏపీ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొత్త విధానం- పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి
Arcelormittal Nippon Steel India: 2029 నాటికి ఆర్సెలర్‌మిట్టల్ స్టీల్ తొలి దశ పూర్తి - ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే?
2029 నాటికి ఆర్సెలర్‌మిట్టల్ స్టీల్ తొలి దశ పూర్తి - ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే?
Telangana Weather: తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ వడగళ్ల వాన- అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ వడగళ్ల వాన- అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
AP Latest Weather: ఓవైపు ఉక్కపోత, మరోవైపు పిడుగుల మోత-ఏపీలో భిన్న వాతావరణం
ఓవైపు ఉక్కపోత, మరోవైపు పిడుగుల మోత-ఏపీలో భిన్న వాతావరణం
Trump Tariffs Impact: మేక్ ఇన్ ఇండియాతో మ్యాజిక్ చేయొచ్చా! అమెరికా చర్యలతో  భారత్‌కు అవకాశం వచ్చినట్టేనా!
మేక్ ఇన్ ఇండియాతో మ్యాజిక్ చేయొచ్చా! అమెరికా చర్యలతో భారత్‌కు అవకాశం వచ్చినట్టేనా!
Alekhya Chitti Pickles: రేప్, మర్డర్ చేస్తారా? నాతో పాటు మా ఆయన్ను... ఏంటిది? అలేఖ్య చిట్టి పికిల్స్‌ కాంట్రవర్సీపై పెద్దక్క రియాక్షన్
రేప్, మర్డర్ చేస్తారా? నాతో పాటు మా ఆయన్ను... ఏంటిది? అలేఖ్య చిట్టి పికిల్స్‌ కాంట్రవర్సీపై పెద్దక్క రియాక్షన్
Ram Charan: బుచ్చిబాబుకు మెగా సర్ప్రైజ్... స్పెషల్ గిఫ్ట్ పంపిన రామ్ చరణ్, ఉపాసన... అవి ఏమిటో తెల్సా?
బుచ్చిబాబుకు మెగా సర్ప్రైజ్... స్పెషల్ గిఫ్ట్ పంపిన రామ్ చరణ్, ఉపాసన... అవి ఏమిటో తెల్సా?
Inter Affiliation 2025: ఇంటర్ కాలేజీలకు అలర్ట్, అనుబంధ గుర్తింపునకు నోటిఫికేషన్‌ జారీ-ఈ గడువులోగా పూర్తిచేయాల్సిందే!
ఇంటర్ కాలేజీలకు అలర్ట్, అనుబంధ గుర్తింపునకు నోటిఫికేషన్‌ జారీ-ఈ గడువులోగా పూర్తిచేయాల్సిందే!
Embed widget