Dhanush: నాలాంటివాడు వీధుల్లోనే చావాలా? తనపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించిన ధనుష్
Dhanush: గతేడాది కోలీవుడ్ హీరో ధనుష్ పోస్ గార్డెన్‌లో ఇల్లు కొన్నాడు. ఇప్పటివరకు ఏ యంగ్ హీరో కూడా అక్కడ ఇల్లు కొనలేదు. దీంతో తనపై ట్రోల్స్ మొదలయ్యాయి. వాటిపై తాజాగా స్టేజ్‌పైనే సమాధానమిచ్చాడు ధనుష్.
Dhanush At Raayan Audio Launch: కొంతమంది సినీ సెలబ్రిటీలు పెద్దగా ఎవరితో ఇంటరాక్ట్ అవ్వకుండా వారి పని వారు చేసుకుంటూ పోతున్నా కూడా కొందరు వారిపై నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేస్తుంటారు. చాలామంది నటీనటులు ఇలాంటి ట్రోల్స్‌లో బాధితులు అవుతున్నారు. అందులో తమిళ హీరో ధనుష్ కూడా ఒకడు. ధనుష్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి, తన యాక్టింగ్ గురించి చాలామందికి నెగిటివ్‌గా కామెంట్ చేసే ఛాన్స్ ఉండదు. అందుకే తన పర్సనల్ లైఫ్‌ను తరచుగా టార్గెట్ చేస్తారని ఫ్యాన్స్ అంటుంటారు. అదే విధంగా గతేడాది ధనుష్ ఒక కొత్త ఇల్లు కొనడం, అందులోకి షిఫ్ట్ అవ్వడంపై ట్రోల్స్ ఎదురయ్యాయి. దానిపై ఈ హీరో తాజాగా స్పందించాడు.
ధనుష్ వివరణ..
చెన్నైలోని తెయ్నంపేట ఏరియాలో పోస్ గార్డెన్‌లో ఒక సౌకర్యవంతమైర ఇంటిని కొనుగోలు చేశాడు ధనుష్. ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యేముందు సెలబ్రిటీలను ఆహ్వానించి గ్రాండ్‌గా గృహప్రవేశం చేశాడు. ఈ బంగ్లా విలువ దాదాపు రూ.150 కోట్లు ఉంటుందని అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. పోస్ గార్డెన్‌లో రజినీకాంత్, జయలలిత లాంటి ప్రముఖులు ఇళ్ల మధ్య ధనుష్ ఇల్లు కొనడం అనేది చాలా చర్చలకు కూడా దారితీసింది. తాజాగా ఆ ఇంటి వల్ల తనపై వచ్చిన ట్రోల్స్‌పై ధనుష్ స్పందించాడు. తాను చిన్నప్పుడు ఎదుర్కున్న కష్టాల గురించి గుర్తుచేసుకున్నాడు. అసలు ఆ ఏరియాలో ఇల్లు కొనడం వెనుక కారణాన్ని వివరించాడు.
చిన్న కథ..
తాజాగా ‘రాయన్’ ఆడియో ఫంక్షన్‌లో ధనుష్ మాట్లాడుతూ.. ‘‘పోస్ గార్డెన్‌లో పెద్ద ఇల్లు కొనడం ఇంత పెద్ద చర్చలకు దారితీస్తుందని ముందే తెలిసుంటే నేను చిన్న అపార్ట్‌మెంటే కొనేవాడిని. నాలాంటి మనిషి పోస్ గార్డెన్‌లో ఇల్లు కొనకూడదా? వీధుల్లో పుట్టి పెరిగిన మనిషి వీధుల్లోనే చనిపోవాలా? నేను పోస్ గార్డెన్‌లో ఇల్లు కొనడం వెనుక చిన్న కథ ఉంది. నేను 16 ఏళ్లు ఉన్నప్పుడు, ఫ్రెండ్‌తో బైక్‌పై తిరుగుతున్నప్పుడు రజినీకాంత్ ఇల్లు చూడాలని కోరిక ఉండేది. అక్కడ ఉండే పోలీస్ ఆఫీసర్లను అడిగితే ఆయన ఇల్లు చూపించారు. మేము అది చూసి సంతోషంగా అక్కడ నుండి వెళ్లిపోయాం’’ అని గుర్తుచేసుకున్నాడు ధనుష్.
నాకు నా గిఫ్ట్..
‘‘తిరిగి వెళ్తున్నప్పుడు అదే ఏరియాలో మరో ఇంటి ముందు చాలామంది జనాలను చూశాం. అదేంటి రజినీకాంత్ ఇల్లు ఇటువైపు ఉంది కదా అని అడిగితే అది జయలలిత ఇల్లు అని చెప్పారు. నేను ఆ రెండు ఇళ్లను చూశాను. అప్పుడే నాకంటూ ఒక కోరిక మొదలయ్యింది. పోస్ గార్డెన్‌లో చిన్న ఇల్లు అయినా కొనాలని ఆశపడ్డాను. ఆ సమయంలో మేము చాలా కష్టాల్లో ఉన్నాం. నా మొదటి సినిమా ‘తుల్లువదో ఇలమై’ సక్సెస్ అవ్వకపోతే మేము రోడ్డు మీదకు వచ్చేసేవాళ్లం. 20 ఏళ్ల తర్వాత నేను పోస్ గార్డెన్‌లో కొన్న ఆ ఇల్లు ధనుష్.. 16 ఏళ్ల వెంకటేశ్ ప్రభుకు ఇచ్చిన గిఫ్ట్’’ అని తెలిపారు ధనుష్. వెంకటేశ్ ప్రభు అనేది ధనుష్ అసలైన పేరు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరు మారిపోయింది.
Also Read: 'లవ్ టుడే' హీరోతో నయనతార భర్త సినిమా - ఫస్ట్ లుక్, ఆ టైటిల్ చూశారా?