Pradeep Ranganathan: 'లవ్ టుడే' హీరోతో నయనతార భర్త సినిమా - ఫస్ట్ లుక్, ఆ టైటిల్ చూశారా?
Love Insurance Kompany First Look: 'లవ్ టుడే'తో తెలుగులోనూ పాపులర్ అయిన కోలీవుడ్ హీరో, డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ తో నయన్ భర్త విఘ్నేష్ శివన్ సినిమా తీస్తున్నారు. ఆ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan)... ఈ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులు గుర్తు పట్టడం కాస్త కష్టం ఏమో గానీ... 'లవ్ టుడే' (Love Today Movie) హీరో అంటే ఠక్కున గుర్తు పడతారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఆ సినిమా భారీ విజయం సాధించింది. ముఖ్యంగా యువతను ఎంతో ఆకట్టుకుంది. 'లవ్ టుడే'కు దర్శకుడు, హీరో ప్రదీప్ రంగనాథన్. ఇప్పుడు ఆయన ఇతర దర్శకులతో కూడా సినిమాలు చేస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ (Vignesh Shivan)తో ఓ సినిమా చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ బర్త్ డే కనుక ఈ రోజు ఆ సినిమా ఫస్ట్ లుక్ అనౌన్స్ చేశారు.
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'లో ప్రదీప్ రంగనాథన్ లుక్ చూశారా?
Love Insurance Kompany movie first look released on Pradeep Ranganathan Birthday: ప్రదీప్ రంగనాథన్ హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' టైటిల్ ఖరారు చేశారు. షార్ట్ కట్‌లో లిక్ (LIK) అని వ్యవహరిస్తున్నారు. ప్రదీప్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా ఉంది.
Also Read: బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న తమన్నా సాంగ్ - ఆజ్ కి రాత్... మిల్కీ బ్యూటీ గ్లామర్ హైలైట్!
Presenting the first look of #LoveInsuranceKompany #LIK
— Seven Screen Studio (@7screenstudio) July 25, 2024
@VigneshShivN @pradeeponelife @IamKrithiShetty@iam_SJSuryah @anirudhofficial@iYogiBabu @Gourayy @sathyaDP @PradeepERagav@PraveenRaja_Off @Rowdy_Pictures @proyuvraaj pic.twitter.com/vDRAGlUpDc
విఘ్నేష్ శివన్ 25వ చిత్రమిది... డ్రీమ్ స్క్రిప్ట్ అంటున్నారు!
Vignesh Shivan on Love Insurance Kompany: 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' తన డ్రీమ్ స్క్రిప్ట్ అని విఘ్నేష్ శివన్ తెలిపారు. ఇది తనకు 25వ సినిమా అని ఆయన వివరించారు.
Also Read: ఎన్టీఆర్ 'దేవర'లో 'యానిమల్' విలన్ - బాబీకి మరో పాన్ ఇండియా సినిమా!
View this post on Instagram
ఇంకా విఘ్నేష్ శివన్ మాట్లాడుతూ... ''నా బ్రదర్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan Birthday)కు హ్యాపీ బర్త్ డే. నువ్వు ఈ సినిమాపై చూపించిన ప్రేమ, నమ్మకం ఎంతో విలువైనది. నా కెరీర్, జీవితంలో చాలా కీలకమైన సమయంలో నా కలను నిజం చేసిన 7 స్క్రీన్ స్టూడియో అధినేత, లలిత్ గారికి థాంక్స్. నాకు ఎంతో బలంగా నిలిచిన నా కింగ్ అనిరుధ్ రవిచందర్ అంటే నాకు ఎంతో ప్రేమ. ఇక నాకు అండగా నిలిచిన నా భర్త నయనతారకు ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటా'' అని పేర్కొన్నారు. తెలుగులోనూ ఈ సినిమా విడుదల చేయనున్నారు.