Balakrishna - Indian Idol Telugu: ఒక్కసారి బాలకృష్ణ అడుగుపెడితే? ఆహా, ఎంటర్‌టైన్‌మెంట్ డబులే
నటసింహం నందమూరి బాలకృష్ణ త్వరలో 'ఇండియన్ ఐడల్' షోలో సందడి చేయనున్నారు. ఇటీవల ఆ షో షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)ను మరోసారి వీక్షకుల ముందుకు తీసుకు వస్తోంది 'ఆహా' ఓటీటీ వేదిక (AHA OTT platform). ఆల్రెడీ బాలయ్యతో 'అన్ స్టాపబుల్' షో చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కార్యక్రమానికి ఆయనను అతిథిగా తీసుకు వచ్చింది.
సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్, కథానాయిక నిత్యా మీనన్, గాయకుడు కార్తీక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న సింగింగ్ రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్'. 'ఆహా' ఓటీటీలో ఈ షో వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ కార్యక్రమం చివరి దశకు చేరుకుంటోంది. టాప్ 6 కంటెస్టెంట్లతో సెమీ ఫైనల్స్ నిర్వహిస్తున్నారు. ఆ సెమీ ఫైనల్ ఎపిసోడ్‌కు బాలకృష్ణ అతిథిగా వచ్చారు.
నందమూరి బాలకృష్ణతో ఇటీవల 'ఇండియన్ ఐడల్' ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఆ ఎపిసోడ్ జూన్ 10న టెలికాస్ట్ కానుంది. ''ఏదైనా ఆయన దిగనంత వరకే... ఒక్కసారి ఆయన అగుడుపెడితే ఎంటర్టైన్మెంట్ డబుల్ అవుతుంది'' అని ఆహా ఓటీటీ పేర్కొంది.
Also Read: పాకిస్తానీ సినిమాకు Cannes 2022లో అవార్డులు - 'జాయ్ ల్యాండ్' ప్రత్యేకత ఏంటి?
View this post on Instagram
సినిమాలకు వస్తే... ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నారు. దాని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో డిఫరెంట్ స్టోరీతో సినిమా చేయనున్నారు. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా ఉంటుందని సమాచారం.
Also Read: 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

