అన్వేషించండి

ఆస్కార్ బరిలో భారతీయ చిత్రాలు.. మూడిట్లో ఒకదానికే ఛాన్స్!

ఆస్కార్ నామినేషన్ల తుది జాబితా విడుదలైంది. అయితే, ఉత్తమ చిత్రాల్లో ఒక్కటి కూడా భారతీయ చిత్రం బరిలో నిలవలేదు. కేవలం ఒక డాక్యుమెంటరీ చిత్రానికి మాత్రమే అవకాశం దక్కింది.

సినీ ప్రేమికులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల్లో.. ఈ ఏడాది నామినేషన్ల బరిలోకి నిలిచిన పలు సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల తుది జాబితాను మంగళవారం ప్రకటించారు. ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి ఆస్కార్ పరిశీలనకు వచ్చిన వివిధ కేటగిరీల్లో సినిమాల స్క్రీనింగ్ నిర్వహించి ఈ నామినేషన్లను రూపొందించారు. అయితే, ఈసారి కూడా మన చిత్రాలకు నిరాశ తప్పలేదు. 

ఉత్తమ విదేశీ చిత్రాల విభాగంలో ప్రదర్శించిన 276 చిత్రాల్లో.. భారత సినిమాలైన ‘మరక్కార్’, ‘జై భీమ్’ సినిమాలను ప్రదర్శించారు. కానీ, ఈ రెండు చిత్రాలు కమిటీ సభ్యులను మెప్పించకలేపోయాయి. దీంతో ఆ సినిమాలకు తుది జాబితాలో స్థానం దక్కలేదు. అయితే, ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో  ‘రైటింగ్ విత్ ఫైర్’ చిత్రం ఒక్కటే నామినేట్ అవ్వడం కాస్త ఊరటనిస్తుంది. 

సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం తప్పకుండా నామినేషన్ల జాబితాలో నిలుస్తుందని తొలుతు భావించారు. అలాగే మోహన్‌లాల్ నటించిన చిత్రం ‘మరక్కార్’ కూడా ఆస్కార్ విభాగంలో పోటీకి నిలుస్తుందని అనుకున్నారు. అయితే, అంచనాలను తారుమారు చేస్తూ రింటు థామస్ చిత్రీకరించిన.. ‘రైటింగ్ విత్ ఫైర్’ చిత్రం డాక్యుమెంటరీ విభాగంలో అర్హత సాధిస్తూ ఆశ్చర్యపరిచింది. మరి, ఏయే విభాగాల్లో ఏ చిత్రాలు ఆస్కార్ బరిలో నిలిచాయో చూసేద్దామా. 

ఉత్తమ చిత్రం(Best Movie): 
బెల్ పాస్ట్ (Belfast)
కొడా (CODA)
డోంట్ లుక్ అప్ (Don't Look Up)
డ్రైవ్ మై కార్ (Drive My Car)
డ్యూన్ (Dune)
కింగ్ రిచార్డ్ (King Richard)
లికోరైస్ పిజ్జా (Licorice Pizza)
నైట్‌మేర్ అల్లే (Nightmare Alley)
ది పవర్ ఆఫ్ డాగ్ (The Power of the Dog)
వెస్ట్ సైడ్ స్టోరీ(West Side Story)

బెస్ట్ డైరెక్టర్(Best Director):
పాల్ థామస్ ఆండర్సన్ (లికోరైస్ పిజ్జా) (Paul Thomas Anderson - Licorice Pizza)
కెన్నెత్ బ్రానాగ్ (బెల్ఫాస్ట్) Kenneth Branagh (Belfast)
జేన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ ది డాగ్) Jane Campion (The Power of the Dog)
స్టీవెన్ స్పీల్‌బర్గ్ (వెస్ట్ సైడ్ స్టోరీ) Steven Spielberg (West Side Story)
ర్యూసుకే హమగుచి (డ్రైవ్ మై కార్) Ryusuke Hamaguchi (Drive My Car)

ఉత్తమ నటి (Best Actress):
జెస్సికా చస్టెయిన్ (ది ఐస్ ఆఫ్ టామీ ఫాయే) Jessica Chastain (The Eyes of Tammy Faye)
ఒలివియా కోల్మన్ (ది లాస్ట్ డాటర్) Olivia Colman (The Lost Daughter)
పెనెలోప్ క్రజ్ (ప్యార్‌లల్ మదర్స్) Penélope Cruz (Parallel Mothers)
నికోల్ కిడ్మాన్ (బీయింగ్ ది రికార్డోస్) Nicole Kidman (Being the Ricardos)
క్రిస్టెన్ స్టీవర్ట్ (స్పెన్సర్) Kristen Stewart (Spencer)

ఉత్తమ నటుడు (Best Actor):
జేవియర్ బార్డెమ్ (బీయింగ్ ది రికార్డోస్) Javier Bardem (Being the Ricardos)
బెనెడిక్ట్ కంబర్‌బాచ్ (ది పవర్ ఆఫ్ ది డాగ్) Benedict Cumberbatch (The Power of the Dog)
ఆండ్రూ గార్ఫీల్డ్ (టిక్, టిక్ ... బూమ్!) Andrew Garfield (Tick, Tick ... Boom!)
విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్) Will Smith (King Richard)
డెంజెల్ వాషింగ్టన్ (ది ట్రాజెడీ ఆఫ్ మక్‌బెత్) Denzel Washington (The Tragedy of Macbeth)

ఉత్తమ సహాయ నటి (Best Supporting Actress):
జెస్సీ బక్లీ (ది లాస్ట్ డాటర్) Jesse Buckley (The Lost Daughter)
అరియానా డిబోస్ (వెస్ట్ సైడ్ స్టోరీ) Ariana DeBose (West Side Story)
జుడి డెంచ్ (బెల్ఫాస్ట్) Judi Dench (Belfast)
కిర్స్టన్ డన్స్ట్ (ది పవర్ ఆఫ్ ది డాగ్) Kirsten Dunst (The Power of the Dog)
అంజను ఎల్లిస్ (కింగ్ రిచర్డ్) Aunjanue Ellis (King Richard)

ఉత్తమ సహాయ నటుడు (Best Supporting Actor):
సియారన్ హింద్స్ (బెల్ ఫాస్ట్) Ciaran Hinds (Belfast)
ట్రాయ్ కోట్సూర్ (కొడా) Troy Kotsur (CODA)
జెస్సీ ప్లెమోన్స్ (ది పవర్ ఆఫ్ ది డాగ్) Jesse Plemons (The Power of the Dog)
జె.కె. సిమన్స్ (బీయింగ్ ది రికార్డోస్) J.K. Simmons (Being the Ricardos)
కోడి స్మిట్-మెక్‌ఫీ (ది పవర్ ఆఫ్ ది డాగ్) Kodi Smit-McPhee (The Power of the Dog)

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ (Best Animated Feature):
ఎన్కాంటో (Encanto)
ఫ్లీ (Flee)
లూకా (Luca)
ది మిచెల్స్ వర్సెస్ ది మెషీన్స్ (The Mitchells vs. The Machines)
రయా అండ్ ది లాస్ట్ డ్రాగన్ (Raya and the Last Dragon)
 
Best Documentary Feature:
అసెంన్షన్ (Ascension)
అట్టికా (Attica)
ఫ్లీ (Flee)
సమ్మర్ ఆఫ్ సోల్ (Summer of Soul)
వ్రైటింగ్ విత్ ఫైర్ (Writing With Fire)
 

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ (Best Visual Effects):
డ్యూన్ (Dune)
ఫ్రీ గయ్ (Free Guy)
షాంగ్-చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్ (Shang-Chi and the Legend of the Ten Rings)
నో టైమ్ టు డై (No Time to Die)
స్పైడర్ మాన్: నో వే హోమ్ (Spider-Man: No Way Home)

టాప్ హెడ్ లైన్స్

Lenin Collection Day 1: లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Jagadhatri Serial Today JULY 10th:జగధాత్రి తల్లిని మరోసారి అవమానించిన తాయర్...శ్రీవల్లిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయిన మీనన్‌
జగద్ధాత్రి సీరియల్: జగధాత్రి తల్లిని మరోసారి అవమానించిన తాయర్...శ్రీవల్లిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయిన మీనన్‌
Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Double Occupancy OTT : పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Double Occupancy OTT : పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Roshan Kanakala : సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Embed widget