NTR: ఎన్టీఆర్ 8 కిలోల టార్గెట్, కొత్త లుక్ కోసం స్పెషల్ వర్కవుట్
కొరటాల శివ సినిమా కోసం బరువు తగ్గుతున్నానని.. ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపిస్తానని ఎన్టీఆర్ తెలిపారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నిజానికి ఫిబ్రవరి నెలలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగాల్సి వుంది కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా కనిపించనుందని.. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ తన తదుపరి సినిమా గురించి మాట్లాడారు.
కొరటాల శివ సినిమా కోసం బరువు తగ్గుతున్నానని.. ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపిస్తానని ఎన్టీఆర్ తెలిపారు. జూన్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని వెల్లడించారు. అందుతున్న సమాచారం ప్రకారం.. కొరటాల సినిమాలో ఎన్టీఆర్ లుక్ చాలా స్టైలిష్ గా ఉంటుందట. దీనికోసం ఎన్టీఆర్ ఆరు నుంచి ఎనిమిది కిలోల వరకు బరువు తగ్గాలని టార్గెట్ గా పెట్టుకున్నాడట. స్పెషల్ గా ఓ ట్రైనర్ ని కూడా నియమించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా మొదలవ్వడానికి మరో మూడు నెలల సమయం ఉంది కాబట్టి ఈలోగా ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ తెచ్చుకోవడం ఖాయం. ప్రస్తుతం ఎన్టీఆర్ కొన్ని రోజులు విరామం తీసుకోవాలనుకుంటున్నారు. త్వరలోనే ఓ ఫారెన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాడట. తిరిగొచ్చిన తరువాత వర్కవుట్ మొదలుపెడతాడని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపిస్తాడని టాక్. ఈ సినిమాకు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
కొరటాల శివతో పాటు ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు కూడా ఓ కథ రెడీ చేసిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సినిమా ఉంటుందని సమాచారం. దీంతో పాటు ప్రశాంత్ నీల్, అట్లీ వంటి దర్శకులతో ఎన్టీఆర్ సినిమాలు చేయబోతున్నాడు. ఇప్పుడు కొత్తగా లిస్ట్ లో అనిల్ రావిపూడి పేరు కూడా యాడ్ అయింది. మరి దీనిపై అధికార ప్రకటన వస్తుందేమో చూడాలి!
View this post on Instagram