అన్వేషించండి
Advertisement
Nithiin Birthday Special: ఇది శాంపిలే, థియేటర్లలో అసలైన వేట! - నితిన్ మాస్ వేట చూశారా?
Macherla Niyojakavargam Telugu Movie Update: నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న 'మాచర్ల నియోజకవర్గం' టీజర్ విడుదల చేశారు. అలాగే, సినిమా విడుదల తేదీ కూడా చెప్పేశారు.
Macherla Niyojakavargam First Attack Out Now : 'మీకు నచ్చే, మీరు మెచ్చే మాస్‌తో వస్తున్నా' - 'మాచర్ల నియోజకవర్గం' ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా హీరో నితిన్ (Nithiin) చెప్పిన మాట. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా (Nithiin Birthday Special) విడుదల చేసిన సినిమా ఫస్ట్ అట్టాక్ / టీజర్ (Macherla Niyojakavargam Teaser) చూస్తే... అది నిజమే అనిపిస్తుంది. పులి వేషం వేసిన కొంత మంది హీరో మీద ఎటాక్ చేయడం, ఎంత మంది వచ్చినా... కళ్ళలో ఎటువంటి బెరుకు లేకుండా నితిన్ వాళ్ళను కొట్టడం మాసీగా ఉంది.
'మాచర్ల నియోజకవర్గం' టీజర్ విడుదల చేయడంతో పాటు సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించారు. జూలై 8న సినిమా (Macherla Niyojakavargam Release Date) ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు ఈ రోజు వెల్లడించారు. ఈ సినిమాలో ఐఏఎస్ అధికారి పాత్రలో నితిన్ నటిస్తున్నారు. ఆయన గుంటూరు కలెక్టర్‌గా కనిపించనున్నారు. సినిమాలో హీరో పేరు ఎన్. సిద్దార్థ్ రెడ్డి. "ఇది శాంపిల్ మాత్రమే. అసలైన వేట థియేటర్లలో జూలై 8 నుంచి మొదలవుతుంది" అని టీజర్ విడుదల సందర్భంగా నితిన్ తెలిపారు.
రాజకీయ నేపథ్యంతో 'మాచర్ల నియోజకవర్గం' సినిమా తెరకెక్కుతోంది. ఓ యువ కలెక్టర్ ఎటువంటి సవాళ్లను ఎదుర్కొన్నాడనేది కథాంశంగా తెలుస్తోంది. పక్కా మాస్, కమర్షియల్ అంశాలతో కూడిన కథలో నితిన్ యాక్షన్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి (ఎడిటర్ ఎస్.ఆర్. శేఖర్) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కేథరిన్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ పతాకాలపై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. నితిన్‌తో ఆయనకు మూడో చిత్రమిది. ఇంతకు ముందు 'భీష్మ', 'మాస్ట్రో' చేశారు. ఇంకా ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, డైలాగ్స్: మామిడాల తిరుపతి, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: అనల్ అరసు.
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion