అన్వేషించండి
Rashmika: బాలీవుడ్‌కు షాక్, రష్మిక ఆ సినిమా చేయడం లేదు!
Rashmika Mandanna Bollywood Movies Update: బాలీవుడ్ యంగ్ హీరో సరసన నటించడానికి రష్మిక 'నో' చెప్పారా? క్రేజీ ప్రాజెక్టును వద్దని అనుకున్నారా?
![Rashmika: బాలీవుడ్‌కు షాక్, రష్మిక ఆ సినిమా చేయడం లేదు! Rashmika Mandanna is not part of Ranbir Kapoor Animal Rashmika: బాలీవుడ్‌కు షాక్, రష్మిక ఆ సినిమా చేయడం లేదు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/30/4c2caf4249dd6a129d29afd833d0b408_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రష్మిక
హిందీలో ఒక్క సినిమా కూడా చేయక ముందే రష్మికా మందన్నాకు బోలెడు క్రేజ్ వచ్చింది. ఆమె పేరుకు ముందు నేషనల్ క్రష్ బిరుదు కూడా చేరింది. ఆ తర్వాతే సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా 'మిషన్ మజ్ను' సినిమాలోనూ, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 'గుడ్ బై' సినిమాలోనూ నటించే అవకాశం వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప: ద రైజ్' సినిమాతో ఉత్తరాదిన మాస్ ప్రేక్షకులను సైతం రష్మిక ఆకట్టుకున్నారు. లేటెస్ట్ బాలీవుడ్ టాక్ ఏంటంటే...
రణ్ బీర్ కపూర్ కథానాయకుడిగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న 'యానిమల్' సినిమాలో రష్మిక కథానాయికగా నటించనున్నారట. నిజానికి ఈ సినిమాలో ప్రియాంక చోప్రా చెల్లెలు పరిణితి చోప్రాను కథానాయికగా అనుకున్నారు. ఆమె ఇటీవల సినిమా నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత రష్మిక పేరు వినిపించడం మొదలైంది. ఈ వార్తలను రష్మిక బృందం ఖండించింది.
'మిషన్ మజ్ను', 'గుడ్ బై' మినహా రష్మిక మరో హిందీ సినిమాకు సంతకం చేయలేదని ఆమె అధికార ప్రతినిధి తెలియజేశారు. సో... 'యానిమల్' సినిమాలో రణ్ బీర్ కపూర్ కు జంటగా రష్మిక నటించనున్నారని బాలీవుడ్ అవాస్తవం అన్నమాట! త్వరలో 'పుష్ప: ద రూల్' సినిమా చిత్రీకరణ ప్రారంభించడానికి నేషనల్ క్రష్ రెడీ అవుతున్నారు.
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion