Devara Ayudha Puja: టికెట్లు తెంచే కంటెంట్ ఇప్పుడా వదిలేది! - ‘దేవర’ ఆయుధ పూజ అదుర్స్!
Devara: జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకులను పలకరించనుంది. సినిమాలో ప్రధాన హైలెట్ అని చెప్పుకుంటున్న ‘ఆయుధ పూజ’ ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది.
NTR Devara Ayudha Puja: మాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకులను పలకరించనుంది. సినిమా రిలీజ్‌కు కొద్ది గంటల ముందు ‘దేవర’లో ప్రధాన హైలెట్ అని చెప్పుకుంటున్న ‘ఆయుధ పూజ’ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో ఫ్యాన్స్‌ను ఉర్రూతలు ఊగిస్తుంది. ఇలాంటి కంటెంట్ ముందే రిలీజ్ చేసి ఉంటే అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవల్లో ఉండేవి కదా అని సోషల్ మీడియాలో తమ ఒపీనియన్స్‌ను పోస్ట్ చేస్తున్నారు.
ఇంతకీ ఆయుధ పూజలో ఏం ఉంది?
‘దేవర’లో ఆయుధ పూజ అనేది పాటతో పాటు వచ్చే ఫైట్‌లా కనిపిస్తుంది. ముందుగా పాటకి జూనియర్ ఎన్టీఆర్ ఆట, తర్వాత సైఫ్ అలీ ఖాన్‌తో ఫైట్ ఇలా ఆయుధ పూజ ఎలా ఉండనుందో చిన్నగా టీజ్ చేసి వదిలారు. సాంగ్ బిట్‌లో జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ ఇరగదీశారు. బనియన్ నోట్లో పెట్టుకుని వేసిన స్టెప్స్‌కి ఫ్యాన్స్ థియేటర్లో పిచ్చెక్కిపోవడం ఖాయం. ఇక సైఫ్, ఎన్టీఆర్‌ల మధ్య ఫైట్ కూడా అంతే ఇంటెన్స్‌గా ఉండనున్నట్లు చూపించారు. మరికొద్ది గంటల్లో పూర్తి ఆయుధ పూజను ఫ్యాన్స్ థియేటర్లోనే చూసేయచ్చు.
మరోవైపు మొదటి రోజు వసూళ్లలో ‘దేవర’ దూసుకుపోతుంది. మొదటి రోజు కనీసం రూ.140 కోట్ల వరకు ‘దేవర’ వసూళ్లు ఉండనున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఆ పైన ఫుల్ రన్ ఎలా ఉండనుందనేది టాక్ వస్తే కానీ ఏమీ చెప్పలేం. కానీ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వసూళ్లు ఆకాశమే హద్దుగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ పెట్టే రికార్డులు చాలా కాలం ఉంటాయనేది ట్రేడ్ వర్గాల అభిప్రాయం.
కొన్ని ఏరియాల్లో ‘ఆర్ఆర్ఆర్’ను సైతం తలదన్నే విధంగా ‘దేవర’ వసూళ్లు ఉండనున్నాయని ప్రీ సేల్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు, సీడెడ్ (రాయలసీమ) ప్రాంతాల్లో ‘ఆర్ఆర్ఆర్’ను సైతం భారీ మార్జిన్‌తో ‘దేవర’ బీట్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరో వైపు ఓవర్సీస్‌లో కూడా ‘దేవర’ దూసుకుపోతుంది. కేవలం ప్రీమియర్ ప్రీ సేల్స్ తోనే నార్త్ అమెరికా ప్రాంతంలో ‘బాహుబలి 2’, ‘సలార్’ సినిమాల ప్రీమియర్ కలెక్షన్స్‌ను ‘దేవర’ దాటేసింది. పాజిటివ్ టాక్ వస్తే ‘ఆర్ఆర్ఆర్’, ‘కల్కి’లను సైతం దాటేసి ప్రీమియర్లతోనే నాలుగు మిలియన్లు వసూలు చేసిన తొలి తెలుగు చిత్రంగా నిలవనుంది. దానికి ప్రీ సేల్స్, వాకిన్స్ ముఖ్యం. మొదటి వీకెండ్‌కే ఓవర్సీస్‌లో ‘దేవర’ బ్రేక్ ఈవెన్ అయిపోతుందని అంచనా. సాధారణంగా తెలుగు హీరోలకు సంబంధించిన సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఏరియా మొదట బ్రేక్ ఈవెన్ అవుతుంది. కానీ ఒక స్టార్ హీరో... అందులోనూ మాస్ హీరో సినిమా ఓవర్సీస్‌లో మొదట బ్రేక్ ఈవెన్ అవ్వడం అన్నది మామూలు విషయం కాదు. ‘దేవర’ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టనుందో మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది.
Also Read: బ్లాక్ బస్టర్ కొడుతున్నాం... 'దేవర'కు సంగీత దర్శకుడు అనిరుద్ ఇచ్చిన రివ్యూ