Devara: బ్లాక్ బస్టర్ కొడుతున్నాం... 'దేవర'కు సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ రివ్యూ
Anirudh Ravichander On Devara: 'దేవర'కు తాను మొదటి ప్రేక్షకుడిని అని సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ అంటున్నాడు. మరి, ఆయన ఈ సినిమాకు ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
Anirudh Ravichander reviews Devara: 'దేవర' చూసిన ఫస్ట్ ఆడియన్ ఎవరో తెలుసా? తానే అంటున్నాడు సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్. టీమ్ అందరూ షూటింగ్ చేసేటప్పుడు ఎప్పుడో ఒకప్పుడు చూశారని, తాను మాత్రం సెట్స్‌కు వెళ్ళలేదని, రీ రికార్డింగ్ కోసం వచ్చినప్పుడు చూశానని తెలిపారు. తనకు సినిమా బాగా నచ్చిందంటున్నాడు.
బ్లాక్ బస్టర్ కొడుతున్నాం... కొరటాల శివ ఫుల్ హ్యాపీ!
అనిరుద్ రవిచందర్ కథ విన్నప్పుడు తన కంటే ఎక్కువ కనెక్ట్ అయ్యాడని 'దేవర' దర్శకుడు కొరటాల శివ తెలిపారు. ''నేను కథ నేరేట్ చేసి హోటల్‌కు వచ్చాను. నేరేషన్ కంప్లీట్ అయ్యాక అతను ఏమీ చెప్పలేదు. హోటల్‌కు వచ్చేటప్పటికి అతని నుంచి మెసేజ్ వచ్చింది. ఫైర్ ఇమేజ్ రెడీ చేసి పంపించాడు. 'సార్... మీకు పెన్నుతోరాసినట్టు లేదు. ఫైర్‌తో కథ రాశారు' అన్నాడు. నాకంటే ఎక్కువ కనెక్ట్ అయ్యీడు' అనిపించింది. నాకు మంచిగా ఫీలయ్యా'' అని కొరటాల శివ తెలిపారు.
అనిరుద్ రవిచందర్ సినిమా ఫైనల్ మిక్సింగ్ అయ్యాక 'బ్లాక్ బస్టర్ కొడుతున్నాం' అని చెప్పాడని కొరటాల శివ సంతోషం వ్యక్తం చేశారు. ''నేను హైదరాబాద్, చెన్నై, ముంబై ట్రావెల్ చేస్తున్నాను. లాస్ట్ 15 రోజులు సరిగా నిద్రలేదు. కొంచెం స్ట్రెస్ గా ఉన్నాను. 'ఏంటి సార్... అలా ఉన్నారు. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం' అన్నాడు. అతను నాకంటే ఎక్కువ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నేను హైదరాబాద్ వచ్చాను. మళ్ళీ అతని నుంచి మెసేజ్ ఉంది. 'శివ గారు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. కొంచెం స్ట్రెయిన్ ఫీలైనట్టు కనిపించారు. ఎప్పుడూ అలా ఉండొద్దు. మీరు అలా ఉంటే బావుండరు. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం' అని. మా సినిమాను మా కంటే ఎక్కువ నమ్మింది అనిరుద్'' అని కొరటాల శివ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు.
Also Read: 'దేవర' ఫస్ట్ రివ్యూ: సినిమా చూసిన రాజమౌళి ఫ్రెండ్ - లాస్ట్ అరగంట అదిరిందంతే
తనకు సినిమా నచ్చితే ఏదో tweet పెడతాడంట ట్విట్టర్లో @anirudhofficial చెప్పాడు !! ఈ సినిమాని అందరికంటే ఎక్కువ నమ్మింది తనే
— Team Koratala (@TeamKoratala) September 25, 2024
ఇక చాల్లే ఆపయ్య అంటే !! ~ #KoratalaSiva
లేదు శివ గారు BlockBuster కొడుతున్నాం
మీరు అలా నవ్వుతూ ఉండండి చాలు వీ నవ్వంటే మాకు చాలా ఇష్టం శివ గారు #Devara https://t.co/1YWYk7ohsE pic.twitter.com/gCndsgNx98
హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఫైనల్ మిక్సింగ్ అయ్యాక అనిరుద్ ఓ ట్వీట్ చేశాడు. అది ఎన్టీఆర్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. బ్లాక్ బస్టర్ అంటూ అతను ఇచ్చిన రివ్యూ ఎన్టీఆర్, కొరటాల శివకు ఇంకా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.
'చుట్టమల్లే' పాటలో అది అసలు ఊహించలేదు!
'దేవర'కు అనిరుద్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడని ఇంటర్వ్యూలలో మ్యాన్ ఆఫ్ మాసెస్ (NTR) చెబుతున్నారు. అతని పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ఎంతో బలం అని ఆయన అంటున్నారు. ఏదో ఒక రోజు అనిరుద్ ఇంటర్నేషనల్ సినిమాకు మ్యూజిక్ చేస్తారని, అతడిలో ఆ కెపాసిటీ ఉందని కూడా ఎన్టీఆర్ అంటున్నారు. ఈ సినిమాలోని 'చుట్టమల్లే...' పాటలో అనిరుద్ 'హా' అంటూ చేసిన హమ్ ఎంతో వైరల్ అయ్యింది. అది అంత పాపులర్ అవుతుందని తాను అసలు ఊహించలేదని అనిరుద్ అన్నారు.
Also Read: ప్రతి సినిమా ఫ్లాప్ అనేవాడు... 'దేవర'కు బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చాడు!
🔥🔥#Devara Written It On Fire 🔥🔥 - @anirudhofficial #KoratalaSiva #JrNTR #DevaraStorm #DevaraOnSept27th pic.twitter.com/JgilUcWyDr
— Thyview (@Thyview) September 25, 2024