Prathinidhi 2: ఏ పార్టీని టార్గెట్ చేయలేదు, వ్యవస్థను ప్రశ్నిస్తున్నాం- 'ప్రతినిధి 2' దర్శకుడు మూర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నారా రోహిత్ హీరోగా జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'ప్రతినిధి 2'. త్వరలో ఈ సినిమా థియేటర్లలో విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు మూర్తి కీలక విషయాలు వెల్లడించారు.
Director Murthy Devaguptapa About ‘Prathinidhi 2’: చాలా కాలం తర్వాత మళ్లీ హీరోగా కనిపించబోతున్నారు నారా రోహిత్ (Nara Rohit). జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తాపు దర్శకత్వంలో ‘ప్రతినిధి 2’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల బాగా ఆకట్టుకుంది. ప్రస్తుత ఏపీ రాజకీయాలను ప్రతిబింబించేలా ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు మూర్తి దేవగుప్తా సినిమాకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించింది.
వ్యవస్థను పశ్నించడమే 'ప్రతినిధి 2' కథ
‘ప్రతినిధి’ సినిమా ఎజెండా వ్యవస్థని ప్రశ్నించడమేనని దర్శకుడు మూర్తి తెలిపారు. ఈ సినిమాలోనూ ఏ పార్టీని టార్గెట్ చేయలేదన్నారు. ‘ప్రతినిధి 2’ ఎజెండా కూడా అదే అన్నారు. ‘ప్రతినిధి’ సినిమాలో సిస్టం బయట నుంచి ప్రశ్నిస్తే, ఈ సినిమాలో సిస్టం లోపల ఉండే ప్రశ్నిస్తాడని చెప్పారు. ‘ఠాగూర్’, ‘లూసిఫర్’, ‘ఒకే ఒక్కడు’, ‘భారతీయుడు’, ‘లీడర్’ సినిమాల మాదిరిగానే ఈ సినిమా ఏ పార్టీని టార్గెట్ చేయదని చెప్పారు. వ్యవస్థను ప్రశ్నించడమే 'ప్రతినిధి 2' చేస్తుందన్నారు. ప్రతి జర్నలిస్ట్ కి ప్రతిరూపంగా ఈ సినిమాలో హీరో పాత్ర ఉంటుందన్నారు. “ జర్నలిస్ట్ సమాజంపై బాధ్యతతో ఉద్యోగం చేస్తాడు. ఇందులో హీరో అదే బాధ్యతో పని చేస్తాడు. ఇందులో చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ వుంటాయి. కలం వీరులకు, యోధులకు ఒక ట్రిబ్యుట్ లా వుంటుంది. ఈ సినిమాలో హీరో తను నమ్మిన పాలసీకి కమిట్ అయి వుంటాడు. తను చేసిన స్టొరీలు ప్రసారం కాకపొతే ఛానల్ ని వదిలేస్తాడు. ఎక్కడా ఇదే పరిస్థితి వుందని ఫ్రీలాన్స్ జర్నలిజం చేస్తాడు. ఎలాంటి అధికారం లేకుండా పబ్లిక్ నుంచి ప్రశ్నించే వ్యక్తి జర్నలిస్ట్. చావుకు తెగించి పని చేస్తాడు. అలాంటి జర్నలిస్ట్ ని హీరోగా చూపించాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఇందులో హీరో పాత్ర ఆలోచన రేకెత్తించేలా వుంటుంది” అన్నారు.
నారా రోహిత్ కు కథ ఎలా చెప్పానంటే?
తనకు మొదటి నుంచి సినిమాలపై ఇంట్రెస్ట్ ఉందని మూర్తి చెప్పారు. “నాకు మొదటి నుంచి సినిమాపై ఆసక్తి వుంది. కాలేజ్ డేస్ లో నాటకాలు కూడా వేసేవాళ్ళం. రోహిత్ గారిని ఓ సందర్భంలో కలిశాను. అప్పటికే నా దగ్గర నాలుగైదు కథలు వున్నాయి. ఐతే ఆయన ప్రతినిధి చూశాను. నేను రాసుకున్న ఈ కథలో ఆయన హీరోగా అయితే బావుంటుందనిపించింది. ఆయన వాయిస్ ఈ కథకి మరింత బలం చేకూర్చుతుంది. ఈ కథకు ఆయన పర్ఫెక్ట్. వ్యవస్థని ప్రశ్నించడం నుంచి మొదలుపెడితే దానిని క్లీన్ చేసే పరిస్థితి వరకూ వెళ్తాడు. హ్యుజ్ స్పాన్ వున్న కథ ఇది. ఇది ప్రాపగాండ మూవీ కాదు. ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇది హైలీ లోడెడ్ థ్రిల్లర్” అని వివరించారు.
త్వరలో మరో సినిమా షురూ చేస్తాం!
ప్రస్తుతం తన దగ్గర నాలుగు కథలు ఉన్నాయని చెప్పారు మూర్తి. రెండో సినిమాను తన మిత్రుడే నిర్మిస్తానని చెప్పాడన్నారు. తను పని చేస్తున్న ఛానెల్ చైర్మన్ సపోర్ట్ చేస్తే రెండో సినిమా కూడా వెంటనే మొదలు పెడతానన్నారు. సినిమాల పట్ల తనకున్న ఫ్యాషన్ ను కొనసాగిస్తానని చెప్పారు. ‘ప్రతినిధి 2’ సినిమాను వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్నారు.