అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Neeraja Movie: భర్తను కోల్పోయిన ఆమె రెండో పెళ్లికి ఒప్పుకోదు - కానీ, ఆ ‘కోరిక’ తీర్చాలంటుంది.. గుండె బరువెక్కించే మూవీ ఇది

ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త చనిపోతే ఆ మహిళ పరిస్థితి ఏంటి? తన కోరికలను ఎలా తీర్చుకుంది? చివరకు ఎలా మారిపోయింది? ఆమె ఇష్టపడ్డ మరో వ్యక్తి ఏం చేశాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ‘నీరజ‘ సినిమా.

Neeraja Movie Explanation: 2023లో విడుదలైన మలయాళీ చిత్రం ‘నీరజ‘. రాజేష్ కె రామన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శృతి రామచంద్రన్, గురు సోమసుందరం, గోవింద్ పద్మసూర్య, జిను జోసెఫ్, శ్రీంద కీలక పాత్రలు పోషించారు. ఇది 2018 విడుదలైన కన్నడ చిత్రం ‘నాతిచరామి‘కి రీమేక్. ఈ సినిమాకు శ్రీమతి నిర్మాతగా వ్యవహరించారు. సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్‌ లో తెరకెక్కించింది. జూన్ 2, 2023న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

‘నీరజ’ సినిమా కథ ఏంటంటే?

నీరజ ఐటీ కంపెనీ ఉద్యోగి. చాలా సంతోషంగా ఉంటుంది. తన తోటి ఉద్యోగులతో ఫ్రెండ్లీగా ఉంటుంది. బయట ఎంత హ్యాపీగా ఉన్నా.. లోపల చాలా బాధపడుతుంది. ఆమెకు ఆనంద్ అనే వ్యక్తితో కొంతకాలం క్రితం పెళ్లి అయ్యింది. వాళ్లిద్దరు తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. కుటుంబ సభ్యులకు దూరం జీవిస్తారు. ఇద్దరు ఉద్యోగం చేస్తారు. ఆనందంగా ఉన్న వారి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంటుంది. దురదృష్టవశాత్తు ఆమె భర్త చనిపోతాడు. నీరజ అతడిని మర్చిపోలేకపోతుంది. తన జ్ఞాపకాల్లో జీవిస్తుంది. ప్రతి రోజు ఆమె భర్త ఫోటో దగ్గర పూలు పెడుతుంది. ఇంటిని కూడా చక్కగా సర్దిపెడుతుంది. ఆమె తల్లిదండ్రులు మరో పెళ్లి చేసుకోవాలని చెప్పినా, తను వారి మాట వినదు. అదే సమయంలో మిత్రుల సలహా ప్రకారం ఆమె ఓ సైకియాట్రిస్ట్ కలుస్తుంది. అతడు కూడా చనిపోయిన భర్తను ఆలోచించుకుంటూ ఎంతకాలం ఇలా ఉంటావు? అని ప్రశ్నిస్తాడు. దాంతో నీరజ ఆలోచనలో పడుతుంది.

ఓ రోజు ఎప్పటిలాగే పార్క్ లో కూర్చొని ఉంటుంది. కాసేపు అక్కడ కూర్చొని లేచి వెళ్లిపోతుంది. అయితే, తన భర్త కోసం తీసుకున్న పూల బొకేను అక్కడే మర్చిపోతుంది. దాన్ని గమనించి ఓ వ్యక్తి నీరజను పిలిచి ఆమెకు బొకే ఇస్తాడు. ఆమె తనకు థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నా, అతడు వెంటనే వెళ్లిపోతాడు. కనీసం, అతడు ఎలా ఉన్నాడో కూడా తెలియదు. ఆమెకు బొకే ఇచ్చిన అరుణ్ ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తుంటారు. 5 ఏండ్లక్రితం పెళ్లి అయ్యింది. ఆమె భార్యపేరు లత. ప్రతి రోజు అతడికి కావాల్సిన వంటలు చేసి తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ, అతడు తల్లిదండ్రుల ఒత్తిడితో ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అందుకే, ఆమెను ఇష్టపడడు.

ఇక ఒక రోజు నీరజ వాకింగ్ చేస్తుండగా, అరుణ్ ఆమె వెనుకే జాగింగ్ చేస్తూ వస్తాడు. ఆమె తనను ఫాలో అవుతున్నాడు అనుకుంటుంది. కానీ, అతడు పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. మరోసారి నీరజ బస్ కోసం ఎదురు చూస్తుండగా, అరుణ్ పక్కనే ఉన్న కిరాణా షాపు దగ్గర సిగరెట్ కొనుక్కోని తాగుతూ కనిపిస్తాడు. ఒక రోజు పార్క్ లో జాగింగ్ చేస్తున్న అరుణ్ దగ్గరికి వెళ్లి నీరజ తనను పరిచయం చేసుకుంటుంది. అరుణ్ పూల బొకే ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తుంది. ఆ తర్వాత అరుణ్ మీద ఇష్టం పెంచుకుంటుంది. అదే సమయంలో కొద్ది రోజులుగా తన భర్తకోసం పూలు కొనడాన్ని మర్చిపోయినట్లు గుర్తుకు వస్తుంది. అదే సమయంలో నీరజ మీద అరుణ్ ఇష్టాన్ని పెంచుకుంటాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. మరుసటి రోజు నీరజ అరుణ్ కు ఫోన్ చేసి ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి అంటుంది. కానీ, ఏం అనుకోవద్దు అంటుంది. నా శారీరక కోరిక తీరుస్తావా? అని మెసేజ్ పెడుతుంది. దాన్ని చూసి అరుణ్ షాక్ అవుతాడు. నువ్వు ఇలాంటి దానివి అనుకోలేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

ఆ తర్వాత కొద్ది రోజులు మాట్లాడుకోరు. కానీ, ఓ రోజు సాయంత్రం బస్ స్టాప్ లో నిల్చున్న నీరజను తన బైక్ మీద ఎక్కించుకుంటాడు అరుణ్. ఇద్దరు ఓ పార్క్ లో కూర్చుంటారు. తాను చేసేది మంచిదేనా? అని అడుగుతుంది. ఇద్దరు మాట్లాడుకుంటారు. చాలా చీకటి అవుతుంది. నీరజను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లతాడు. అక్కడే ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత నీరజ ఇల్లు అంతా చూస్తాడు. ఇలాగే తన ఇంట్లోనూ అందంగా ముస్తాబు చేయడాన్ని గమనిస్తుంది. వెంటనే తన ఇల్లు గుర్తుకు వచ్చి వెళ్లిపోతాడు. తన భార్య కూడా ఇలాగే తన కోసం ఎదురు చూస్తుంది కదా అనుకుంటాడు. అప్పటి నుంచి తన భార్యతో ప్రేమగా ఉండటం మొదలు పెడతాడు. అటు నీరజ కూడా భర్త జ్ఞాపకాలను మర్చిపోయి, తనకు సరిపడే వాడిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వస్తుంది. దీంతో సినిమా అయిపోతుంది. ఈ మూవీ యూట్యూబ్, హెచ్ ఆర్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

Read Also: ఇవాళ, రేపు ఓటీటీలో సినిమాల జాతర, థియేటర్లలో అలరించే మూవీస్ ఇవే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pamkuntla Sai Reddy: 'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
CM Chandrababu: 'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Game Changer: ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!ఎలక్ట్రిక్ వెహికిల్స్ పేలిపోకూడదంటే.. జాగ్రత్తలు ఇవే!Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP DesamRishabh Pant Sixer Viral Video | ఊహకు అందని రీతిలో సిక్స్ కొట్టిన పంత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pamkuntla Sai Reddy: 'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
'సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే చనిపోతున్నా' - ముఖ్యమంత్రి సొంతూరిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో..
CM Chandrababu: 'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
'ఏపీలో 2029లోనే ఎన్నికలు' - జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
తెలంగాణ జాగృతితో మళ్లీ రాజకీయ పోరాటం - ఈ సారి బీసీ నినాదం - కవిత ఇక అన్‌స్టాపబుల్ ?
Game Changer: ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఇటువంటి ప్రీ రిలీజ్ వేడుక... రిలీజ్‌కు ముందు 'గేమ్ ఛేంజర్' ఖాతాలో అరుదైన రికార్డు
Rajamundry Rail Bridge: మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!
మన గోదారమ్మపై వంతెన ఎప్పటికీ అపురూపమే - రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జికి 50 ఏళ్లు!
Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?
రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్... ఆ ఒక్క పాట కోసమే 15 కోట్ల ఖర్చు?
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Shraddha Srinath: బాలకృష్ణ సినిమాలో నటించడం నా లక్ కాదు.. శ్రద్ధా శ్రీనాథ్ కామెంట్స్ వైరల్!
బాలకృష్ణ సినిమాలో నటించడం నా లక్ కాదు.. శ్రద్ధా శ్రీనాథ్ కామెంట్స్ వైరల్!
Embed widget