Karthikeya 2: నితిన్ తో పోటీకి దిగిన నిఖిల్ - 'కార్తికేయ2' కొత్త రిలీజ్ డేట్!
'కార్తికేయ2' కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటుంది.

టాలీవుడ్ హీరో నిఖిల్ (Nikhil Siddharth), దర్శకుడు చందు మొండేటి (Chandoo Mondeti) కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ప్రేక్షకుల ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీకృష్ణునికి సంబంధించిన చరిత్ర, ద్వారకా నగరం మీద అన్వేషణ చేసే వైద్యుడిగా నిఖిల్ కనిపించనున్నారు.
ముందుగా ఈ సినిమాను జూలై 22న రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తరువాత ఆగస్టు 5న వస్తుందనే మాటలు వినిపించాయి. ఫైనల్ గా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించింది చిత్రబృందం. ఆగస్టు 12న సినిమాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటుంది.
ఇక ఇదే డేట్ న నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా కూడా రిలీజ్ కానుంది. అంటే నితిన్ తో నిఖిల్ పోటీకి దిగినట్లే. అయితే రెండు వేర్వేరు జోనర్స్ కాబట్టి సమస్య లేదు. కానీ థియేటర్లను షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అదే వారంలో 'లాల్ సింగ్ చద్దా', 'స్వాతిముత్యం' లాంటి సినిమాలు కూడా రాబోతున్నాయి. సమంత 'యశోద', అఖిల్ 'ఏజెంట్' సినిమాలు కూడా రిలీజ్ కావాల్సింది కానీ ప్రస్తుతానికి అవి వాయిదా పడినట్లు టాక్.
ఇక 'కార్తికేయ 2' సినిమా విషయానికొస్తే.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Also Read : 'ఆర్ఆర్ఆర్'లో పులితో ఎన్టీఆర్ ఫైట్ - వీఎఫ్ఎక్స్‌కు ముందు, తర్వాత
Also Read : అది పాస్తా వల్ల వచ్చిన కడుపు, ప్రెగ్నన్సీ కాదు - రూమర్లకు చెక్ పెట్టిన కరీనా కపూర్
View this post on Instagram
Before You Go
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















