18Pages: లవర్స్ డే తర్వాత నాలుగు రోజులకు... నిఖిల్, అనుపమ ప్రేమకథలో 18 పేజీలు
నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా '18 పేజెస్'. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం తర్వాత నాలుగు రోజులకు ఈ ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా '18 పేజెస్'. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై 'బన్నీ' వాసు నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ అందించిన కథతో ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు జీఏ2 పిక్చర్స్ తెలియజేసింది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు. 18న '18 పేజెస్' విడుదల. అంటే... లవర్స్ డే తర్వాత నాలుగు రోజులకు ఈ ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.
What will happen?
— GA2 Pictures (@GA2Official) November 14, 2021
'If a phone fell for a pen.'
Witness the story of #18Pages in cinemas from Feb 18th 2022! 📔📱#Alluaravind @aryasukku @actor_Nikhil @anupamahere @dirsuryapratap #BunnyVas @GopiSundarOffl @NavinNooli @lightsmith83 @raparthysaran @SukumarWritings @adityamusic pic.twitter.com/4BCyIWNjNN
సుకుమార్ కథతో గతంలో పల్నాటి సూర్య ప్రతాప్ 'కుమారి 21ఎఫ్' తీశారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ చేస్తున్న చిత్రమిది. ఇందులో కథలు రాసే యువతి పాత్రలో అనుపమా పరమేశ్వరన్ కనిపించనున్నారు. ఆమెకు ప్రియుడిగా ఎప్పుడూ ఫోనులో ఉండే హుషారైన పాత్రలో నిఖిల్ నటిస్తున్నారు. కథలు రాసే పెన్నుకు, ఫోనుకు ప్రేమ ఎలా కుదిరిందనేది సినిమా కథ. ఇప్పటివరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తి కలిగించాయి. ఈ చిత్రానికి గోపిసుందర్ స్వరాలు సమకూరుస్తున్నారు.
'18 పేజెస్' కాకుండా నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న మరో సినిమా 'కార్తికేయ 2'. అందులో కూడా ఆయన సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వీళ్లిద్దరూ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేస్తున్నారు.
Also Read: కోర్టుకు వెళ్లే ఆలోచన లేదు... ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో మాట్లాడతాం! - 'ఆర్ఆర్ఆర్' నిర్మాత
Aslo Read: పునీత్ రాజ్ కుమార్ కళ్లతో... మరో పది మందికి చూపు!
Also Read: ఈ వారం కాజల్ సేఫ్.. పాపం అతడు ఎలిమినేట్ అవ్వక తప్పడం లేదు..
Also Read: కేటీఆర్ సార్.. ఈ పాపను ఆదుకోండి, కదిలిస్తోన్న బండ్ల గణేష్ ట్వీట్
Also Read: బాలకృష్ణ కాపాడిన ప్రాణం.. ఆ చిన్నారిని బాలయ్య ముందుకు తీసుకొచ్చిన నాని
Also Read: జనవరిలో మహేష్ బాబు రావడం లేదు. కానీ, ఆయన మేనల్లుడు వస్తున్నాడోచ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి