Karthikeya 2 OTT Release: దసరా స్పెషల్ - ఓటీటీ రిలీజ్‌కు 'కార్తికేయ2' రెడీ!
కార్తికేయ2 సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది.
యంగ్ హీరో నిఖిల్(Nikhil) నటించిన 'కార్తికేయ2'(Karthikeya2) సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ సినిమా ఆగస్టు 13న విడుదలై హిట్ టాక్ తో సంపాదించుకుంది. అదే రేంజ్ లో కలెక్షన్స్ ను కూడా సాధించింది. ఇప్పటికీ అక్కడక్కడా థియేటర్లలో ఈ సినిమా ఆడుతుంది. లాంగ్ రన్ లో ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. నిఖిల్ లాంటి యంగ్ హీరో నటించిన సినిమా వంద కోట్లు సాధించడం మాములు విషయం కాదు.
బాలీవుడ్ లో కూడా ఈ సినిమా దూసుకుపోయింది. ఓ రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఫైనల్ గా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అక్టోబర్ 5న దసరా కానుకగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. జీ5లో తెలుగు, తమిళ, హిందీ వెర్షన్ ను అక్టోబర్ 5న రిలీజ్ చేయనున్నారు.
ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి. చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయికగా నటించారు. శ్రీనివాస రెడ్డి (Srinivasa Reddy) 'వైవా' హర్ష చెముడు హీరో హీరోయిన్లతో పాటు ట్రావెల్ చేసే పాత్రలలో కనిపించారు.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై నిఖిల్ ఫోకస్:
'కార్తికేయ2' సినిమా హిందీలో కూడా సూపర్ హిట్ కావడంతో అక్కడ మార్కెట్ పరిధిని పెంచుకోవాలని చూస్తున్నారు నిఖిల్. ఇదివరకు '18 పేజెస్' అనే సినిమాలో నటించారు నిఖిల్. దీన్ని అక్టోబర్ లేదా నవంబర్ లో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నారు.
'స్పై' సినిమా రీషూట్:
'గూఢచారి', 'హిట్', 'ఎవరు' వంటి సినిమాలకు ఎడిటర్ గా పని చేసిన గ్యారీ బిహెచ్ ఇప్పుడు దర్శకుడిగా సినిమా చేస్తున్నారు. ఇందులో నిఖిల్ ను హీరోగా తీసుకున్నారు. ఈ సినిమాకి 'స్పై' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొంతవరకు జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను కూడా చాలా వరకు రీషూట్ చేయబోతున్నారట. కొత్తగా తాను ఒప్పుకునే సినిమాలన్నీ భారీగా ఉండాలని నిఖిల్ కోరుకుంటున్నారు.
ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజ శేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మలయాళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 'స్పై' సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా నిఖిల్ స్థాయిని పెంచుతుందేమో చూడాలి!
Also read: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!
Also read: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి