News
News
X

NC22 Movie Update: ఆకట్టుకుంటున్న NC22 ప్రీ లుక్, టైటిల్ అనౌన్స్, ఫస్ట్ లుక్ రీలీజ్ ఎప్పుడంటే?

అక్కినేని నాగ చైతన్య తాజా మూవీ NC22పై చిత్ర బృందం కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ విడుదల చేసింది. అటు టైటిల్ అనౌన్స్, ఫస్ట్ లుక్ రిజలీ ఎప్పుడో వెల్లడించింది.

FOLLOW US: 

అక్కినేని నాగ చైతన్య తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ యంగ్ హీరో ఈ సంవత్సరం మూడు సినిమాల్లో కనిపించి, ఆడియెన్స్ ను అలరించాడు. ‘థ్యాంక్యూ’ సినిమాలో సోలో హీరోగా నటించిన నాగ చైతన్య, ఆ తర్వాత తన తండ్రి అక్కినేని నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’ సినిమాలో యాక్ట్ చేశాడు. ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. ఇందులో నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. సర్పంచ్ నాగలక్ష్మిగా ఆకట్టుకుంది. ఇక మూడో సినిమా విషయానికి వస్తే బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో కలిసి ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో నటించాడు. ఇందులో నాగ చైతన్యయ కీలక పాత్రలో కనిపించాడు. ఈ చిత్రంతోనే ఆయన బాలీవుడ్ లో అడుగు పెట్టాడు. కానీ, బాయ్ కాట్ బాలీవుడ్ ప్రచారంతో ఈ మూవీ ఘోర పరాజయం పాలైంది. థియేటర్లకు జనాలు రాక, షోలు క్యాన్సిల్ చేసిన సంఘటనలున్నాయి.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న NC22

ప్రస్తుతం నాగ చైతన్య మరో సినిమా చేస్తున్నాడు. తమిళ సినిమా పరిశ్రమలో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా కొనసాగుతున్న వెంకట్ ప్రభు దర్శకత్వం NC22 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు. వర్కింగ్ టైటిల్ మీదే షూటింగ్ కొనగుతోంది. చాలా వరకు షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. తన కెరీర్ లో 22వ సినిమా తెరెక్కుతున్న ఈ చిత్రంపై నాగ చైతన్య చాలా హోప్స్ పెట్టుకున్నాడు. బంగార్రాజు మినహా ఈ ఏడాది పెద్దిగా హిట్ అందుకోలేకపోయిన ఈ అక్కినేని యువ హీరో ఈ చిత్రంతో మంచి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నది. అరవింద స్వామి ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. దిగ్గజ సంగీత దర్శకులు ఇళయ రాజా, యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.

ఆకట్టుకుంటున్న ప్రీ లుక్, టైటిల్, ఫస్ట్ లుక్ రేపు రీలీజ్

News Reels

ఇక ఈ సినిమాకు సంబంధించి.. చిత్ర బృందం కీలక అప్ డేట్ ఇచ్చింది. ఇవాళ ఉదయం 11.30 గంటలకు చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ విడుదల చేసింది. ఇందులో‘ఏ శివ’ అనే బ్యాడ్జితో ఖాకీ డ్రెస్ వేసుకుని నాగ చైతన్య కన్ను మాత్రమే కనిపిస్తోంది. ఆయన చుట్టూ చేతులు వలయంలా కనిపిస్తున్నాయి. పక్కనే గన్స్ తో రోమాలు నిక్కబొడిచేలా కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ రేపు ఉదయం 10: 18 గంటలకు విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ వెల్లడించింది.  

Published at : 22 Nov 2022 12:48 PM (IST) Tags: Naga Chaitanya Venkat Prabhu NC22 NC22 Title NC22 First look

సంబంధిత కథనాలు

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

బిగ్‌బాస్ వేదికపై ఆదిరెడ్డి చెల్లెలు, ఫైమా అక్క, రేవంత్ అన్న - మళ్లీ మెరిసిన కుటుంబసభ్యులు, సెలెబ్రిటీలు

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

టాప్ స్టోరీస్

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి