News
News
X

Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో నయన్ - విఘ్నేష్ లవ్ డాక్యుమెంటరీ, అవన్నీ రూమర్లే, ఇదిగో ప్రూఫ్

(Nayanatara-Vignesh) నయనతార - విఘ్నేష్ శివన్ అందమైన లవ్ డాక్యుమెంటరీ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది.

FOLLOW US: 

Nayanatara Vignesh- Netflix: లేడీ సూపర్ స్టార్ నయనతార. ఆమె సినిమాలే కాదు, ప్రేమలు కూడా హాట్ టాపిక్కే అభిమానులకు. ఎట్టకేలకు తానెంతో ప్రేమించిన విఘ్నేష్ శివన్‌ను పెళ్లాడింది నయనతార.  ఆ పెళ్లి హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీగా చెల్లించి సొంతం చేసుకుంది. అయితే విఘ్నేష్, నయనతార తమ పెళ్లి ఫోటోలను ఇన్ స్టాలో పోస్టు చేశారు. ఆ విషయంలో నెట్ ఫ్లిక్స్, కొత్త జంట మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. అంతేకాదు పెళ్లికి తాము ఖర్చుపెట్టిన సొమ్మును కూడా వెనక్కి ఇవ్వమని నెట్ ఫ్లిక్స్ అడిగిందని కూడా టాక్ నడిచింది. దాదాపు పాతిక కోట్ల రూపాయల దాకా ఈ సెలెబ్రిటీ జంట ఆ ఓటీటీ సంస్థకు చెల్లించాల్సి రావచ్చు అంటూ చాలా చర్చలు నడిచాయి. అయితే ఇదంత ఉత్త ట్రాష్ అని కొట్టిపడేసేలా నెట్ ఫ్లిక్స్  తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. త్వరలో అందమైన జంట ప్రేమకథను స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించిది. దీంతో ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టినట్టు అయింది. ఆ పోస్టులో నయనతార - విఘ్నేష్ అందమైన ఫోటోలను షేర్ చేసింది నెట్ ఫ్లిక్స్. సముద్ర తీరాన అందమైన జంట కనుల పండవలా కనిపిస్తోంది. నెట్ ఫ్లిక్స్ ప్రకారం త్వరలోనే వీరిద్దరి అందమైన ప్రేమ కథ, పెళ్లి తంతు స్ట్రీమింగ్ కానుంది. 

ఏడేళ్ల ప్రేమ
నయన తార ప్రేమలో రెండు సార్లు పెళ్లి దాకా వెళ్లి వెనక్కి వచ్చింది. ఆమె లవ్ ఫెయిల్యూర్ స్టోరీలు కూడా ఆసక్తికరమే. చివరికి విఘ్నేష్ తో ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉంది. వారిద్దరూ సహజీవనం కూడా చేశారని చెబుతారు. ఇరువురి కుటుంబీకుల సమ్మతితో ఈ ఏడాది జూన్ 9న తమిళనాడులోని మహాబలేశ్వరంలోని ఓ పెద్ద రిసార్టులో పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి స్ట్రీమింగ్ హక్కులను పాతికకోట్ల రూపాయలకు నెట్ ఫ్లిక్స్ కొనుక్కుంది. వీరి పెళ్లికి బాలీవుడ్ నుంచి షారూఖ్ ఖాన్ హాజరయ్యారు. ఇక తమిళ నటులు రజనీకాంత్, సూర్య, జ్యోతిక, మణిరత్నం వంటి దిగ్గజాలు పాల్గొన్నారు. తెలుగు ఇండస్ట్రీకి చెందిన వారిని ఒక్కరిని నయన తార పిలవకపోవడం ఆశ్చర్యం. పోనీ ఇక్కడ తెలుగు సెలెబ్రిటీల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేస్తుందేమో అనుకున్నారు అభిమానులు. కానీ అలాంటిదేమీ జరగలేదు.

Published at : 22 Jul 2022 10:24 AM (IST) Tags: Nayanthara and Vignesh Love Documentary On Netflix Nayanatara marriage in Netflix

సంబంధిత కథనాలు

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Urfi Javed: ఉర్ఫీ జావెద్‌కు లైంగిక వేధింపులు - అతడి ఫొటో, వాట్సాప్ చాట్ బయటపెట్టిన బ్యూటీ

Urfi Javed: ఉర్ఫీ జావెద్‌కు లైంగిక వేధింపులు - అతడి ఫొటో, వాట్సాప్ చాట్ బయటపెట్టిన బ్యూటీ

Karthika Deepam Serial Doctor Babu Re-entry : తలకు కట్టు, ఎల్లో టీషర్టు 'కార్తీకదీపం' సెట్లోకి డాక్టర్ బాబు రీఎంట్రీ

Karthika Deepam Serial Doctor Babu Re-entry : తలకు కట్టు, ఎల్లో టీషర్టు 'కార్తీకదీపం' సెట్లోకి డాక్టర్ బాబు రీఎంట్రీ

Salman Khan: అభిమానులకు సల్మాన్ ఖాన్ గుడ్ న్యూస్, ఆ సినిమాకు మరో సీక్వెల్ - రిలీజ్ డేట్ ఇదే

Salman Khan: అభిమానులకు సల్మాన్ ఖాన్ గుడ్ న్యూస్, ఆ సినిమాకు మరో సీక్వెల్ - రిలీజ్ డేట్ ఇదే

Vijay Devarakonda : దర్శకత్వ శాఖలో పనిచేసిన విజయ్ దేవరకొండ - ఎవరి దగ్గరో తెలుసా?

Vijay Devarakonda : దర్శకత్వ శాఖలో పనిచేసిన విజయ్ దేవరకొండ - ఎవరి దగ్గరో తెలుసా?

టాప్ స్టోరీస్

Governor At Home : రాజ్ భవన్ ఎట్ హోమ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు, ఆఖరి నిమిషంలో రద్దు

Governor At Home : రాజ్ భవన్ ఎట్ హోమ్ కు సీఎం కేసీఆర్ గైర్హాజరు, ఆఖరి నిమిషంలో రద్దు

Horoscope Today 16th August 2022: ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు

Horoscope Today  16th August 2022:  ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి

ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!

ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!