News
News
X

Thank You Movie Review: ‘థాంక్యూ’ రివ్యూ - నాగ చైతన్య వన్ మ్యాన్ షో, ప్రేక్షకులు థాంక్స్ చెబుతారా?

‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ సినిమాలతో వరుస హిట్లతో ఊపు మీదున్న నాగ చైతన్య ‘థాంక్ యూ’తో హ్యాట్రిక్ కొడతాడా? సినిమా ఎలా ఉంది?

FOLLOW US: 

సినిమా రివ్యూ: Thank You
రేటింగ్: 3/5
నటీనటులు : నాగ చైతన్య ,రాశి ఖన్నా ,మాళవిక నాయర్ ,అవికా గోర్ ,సాయి సుశాంత్ రెడ్డి ,ప్రకాష్ రాజ్ ,తదితరులు 
సమర్పణ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 
కథ: బి. వి. యస్ .రవి 
సినిమాటోగ్రఫీ : పీ. సీ . శ్రీరామ్ 
సంగీతం : థమన్ యస్ . 
ఎడిటింగ్ : నవీన్ నూలి 
నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్ 
స్క్రీన్ ప్లే -దర్శకత్వం : విక్రమ్ కె కుమార్ 
రన్ టైం : 129 నిముషాలు 

విడుదల తేదీ: 22 జూలై  2022 

క్కినేని కుటుంబానికి ‘మనం’ సినిమా రూపంలో మరిచిపోలేని బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కె కుమార్.. ఆ తరువాత అఖిల్‌తో తీసిన ‘హలో’ సినిమా కూడా తీశారు. కానీ, అది ఏవరేజ్ మూవీగా నిలిచింది. సున్నిత మైన కథాంశాలతో సినిమాలను హృద్యంగా తెరెకెక్కిస్తాడనే పేరున్న విక్రమ్.. వరుస హిట్లతో జోరు మీదున్న అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో తెరకెక్కించిన తాజా ఎమోషనల్ డ్రామా నే ‘థాంక్ యూ’ (Thank You The Movie).  ఈ సినిమాని  పెద్దగా ప్రచారం చెయ్యక పోయినా గానీ మొదటి నుండీ దీనిపై పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి. పైగా అక్కినేని కుటుంబానికి చెందిన నాగచైతన్య .. మరో స్టార్ హీరో మహేష్ బాబుకు అభిమానిగా నటించడంతో ఈ సినిమాపై హైప్ పెరిగింది . మరి ఈ సినిమా ఎలా ఉంది? 

కథ: ఈ సినిమా ప్రధానంగా ఒక వ్యక్తి జీవిత ప్రయాణం. అతడు టీనేజ్ దశ నుంచి ఒక సక్సెస్ ఫుల్ బిలియనీర్‌గా ఎలా ఎదిగాడనేదే కథ. ఎక్కడో నారాయణ పురం అనే చిన్న పల్లెటూరికి చెందిన అభిరాం అలియాస్ అభి(నాగ చైతన్య ).. తాను ఎదుర్కొన్న అనుభవాల కారణంగా ఒంటరిగానే జీవితంలో ముందుకు వెళుతున్నాననే భావనలో ఉంటాడు. అయితే తనకు తెలియకుండానే తన ఎదుగుదల వెనుక ఎంతోమంది సాయం ఉందని ఆ తర్వాత గ్రహించి.. వారికి తిరిగి ఎలా థాంక్యూ చెబుతాడనేది ఈ కథలో ప్రధాన అంశం. ఈ సందర్భంగా అభి ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి? అతడిలో మార్పుకు కారణాలేమిటి? ఎలా తనకు సాయపడిన వారికి థాంక్ యూ  చెప్పాడు? అతని జీవితంలోకి వచ్చిన స్త్రీలు ఎవరు? వారి ప్రభావం అతని జీవితంపై ఎలా పడింది? ఇవన్నీ తెరపై చూడాలి. 

విశ్లేషణ: ఈ సినిమాలో నాగచైతన్య మహేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు (SSMB ) ఫ్యాన్‌గా కనిపించడం ఆయన అభిమానులతో విజిల్స్ వేయిస్తుంది. అలాగే నాగ చైతన్య పోషించిన అభి పాత్ర లోని వివిధ దశలను.. మహేష్ బాబు నటించిన వివిధ సినిమాలు రిలీజ్ అయిన టైం గ్యాప్స్‌లో చూపడం ఆశక్తికరంగా ఉంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ మరో ఇంట్రెస్టింగ్ పాత్రలో కనిపించారు. ఆ క్యారెక్టర్ సినిమా గమనాన్నే మారుస్తుంది. ఇటీవల కాలంలో ప్రకాష్ రాజ్ చేసిన సినిమాల్లో థాంక్ యూ బాగా గుర్తుండి పోయే పాత్ర. 

ఇక మెయిన్ లీడ్ నాగ చైతన్య  విషయానికి వస్తే సినిమా సినిమా కీ తన నటనలో పరిణితి పెరుగుతూ వస్తుంది. ఈ సినిమా మొత్తాన్ని తన ఒంటి చేతిమీద నడిపారాయన. రాశి ఖన్నాకు చాలా కాలం తర్వాత తెలుగులో మంచి హిట్ పడినట్టే. మాళవిక నాయర్, అవికా గోర్ పాత్రలు చిన్నవే. కానీ, కనిపించిన ఆ కాసేపు ఆకట్టుకుంటారు.  

సినిమా మధ్యలో ఫ్లాష్ బ్యాక్‌లు వస్తూ.. హీరో జీవితాన్ని వివిధ దశల్లో చూపుతారు. దీనివల్ల నాగచైతన్య నటించిన ‘ప్రేమమ్’, ప్రభాస్ నటించిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’, రవితేజ ‘నా ఆటోగ్రాఫ్’ సినిమాలు గుర్తుకొస్తాయి. కానీ, కథనం మాత్రం పూర్తిగా ఫ్రెష్‌గా ఉండేలా విక్రమ్ కుమార్ చూసుకున్నారు. ముఖ్యంగా అవికాగోర్‌తో నాగ చైతన్య సన్నివేశాలు, హాకీ గేమ్ నేపథ్యం ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తాయి. సినిమా క్లైమాక్స్‌ను సింపుల్‌గా ముగించేస్తూ ఉంటారన్న విమర్శకు చెక్ పెడుతూ ఎమోషనల్ నోట్‌‌తో సినిమాను ముగించారు విక్రమ్ కుమార్. అయితే, ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు ఎక్కుతుందా లేదా అనేది మాత్రం సందేహమే. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఈ సినిమా మెప్పించవచ్చు. 

దిల్ రాజు ప్రొడక్షన్ కావడంతో నిర్మాణ విలువలు బాగున్నాయి. BVS రవి అందించిన కథ,  వెంకట్ డి పతి, మిథున్ చైతన్య రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా విక్రమ్ కుమార్ రాసుకున్న స్క్రీన్ ప్లే ఈ సినిమాను నిలబెట్టిందనే చెప్పాలి. థమన్ మ్యూజిక్ కథనంతో పాటే సాగుతూ వెళుతుంది. ఇది సున్నితమైన ఎమోషనల్ మూవీ కావడంతో లౌడ్ మ్యూజిక్‌ను ఎక్సపెక్ట్ చెయ్యలేం. పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం గురించి క్రొత్తగా చెప్పేదేముంది? చాలా సీన్స్‌లో ఆయన ముద్ర కనిపిస్తుంది. మరి ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చి.. చైతూకు ‘థ్యాంక్యూ’ చెబుతారో లేదో చూడాలి. 

మైనస్: విక్రమ్ కుమార్ సినిమాలకు ఎప్పుడూ ఉండే విమర్శ.. స్లో నేరేషన్. ఈ సినిమాలోనూ అది కనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో కొన్ని నిముషాల పాటు సినిమా స్లోగా వెళుతుందన్న ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుంది. 

ప్లస్: ఎమోషనల్‌గా సాగే కథనం, నాగచైతన్య. 

Review By: Vijaya Saradhi, ABP Desam, Visakhapatnam

Also Read: దర్జా రివ్యూ: లేడీ డాన్‌గా అనసూయ, ఏసీపీగా సునీల్ - 'దర్జా'గా చూడొచ్చా? 

Also Read : 'పరంపర 2' రివ్యూ: ఫస్ట్ సీజన్ కంటే లెంగ్త్ తక్కువ - జగపతి బాబు, నవీన్ చంద్ర, శరత్ కుమార్ నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

Published at : 22 Jul 2022 08:38 AM (IST) Tags: Naga Chaitanya Rashi Khanna Akkineni Naga Chaitanya Thank You Movie Review Thank You Movie Review in Telugu

సంబంధిత కథనాలు

Tollywood: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి - ఓటీటీలోకి 'షంషేరా'!

Tollywood: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి - ఓటీటీలోకి 'షంషేరా'!

Chandoo Mondeti: ఆ సినిమా పోతుందని నాకు ముందే తెలుసు - 'కార్తికేయ2' డైరెక్టర్ కామెంట్స్!

Chandoo Mondeti: ఆ సినిమా పోతుందని నాకు ముందే తెలుసు - 'కార్తికేయ2' డైరెక్టర్ కామెంట్స్!

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Dobaaraa: తాప్సీ సినిమాకి షాక్ - ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్!

Dobaaraa: తాప్సీ సినిమాకి షాక్ - ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్!

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

టాప్ స్టోరీస్

TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

TS Inter Board : హైదరాబాద్ లో  విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?