News
News
X

Sravana Bhargavi: ఆ వీడియోలో అశ్లీలత ఏం కనిపించింది? అన్నమయ్య కీర్తన వివాదంపై స్పందించిన శ్రావణ భార్గవి

(Sravana Bhargavi) శ్రావణ భార్గవి తాజాగా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆమె ఆ వివాదంపై స్పందించింది.

FOLLOW US: 

Sravana Bhargavi: తెలుగు గాయని శ్రావణ భార్గవి మొన్నటి విడాకులు తీసుకుంటోందన్న పుకార్లతో వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు అన్నమయ్య కీర్తనతో వివాదాస్పదంగా మారింది. ఆమె ‘ఒకపరి ఒకపరి వయ్యారమే’ అనే అన్నమయ్య కీర్తనను పాడి వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. శ్రీ వేంకటేశ్వర స్వామికి అభిషేకం చేసేటప్పుడు పాడే ఈ కీర్తనను తన అందాన్ని చూపించుకోవడం కోసం ఉపయోగించిందంటూ కొంతమంది భక్తులు విమర్శించారు. ఈ విషయాన్ని అన్నమయ్య వంశస్థులకు తెలియజేశారు. అన్నమయ్య కుటుంబీకులు కూడా ఈ విషయంపై మాట్లాడుతూ ‘అన్నమయ్య పెద్దకుమారుడు పెదతిరుమలాచార్యులు స్వామివారికి అభిషేకం చేస్తూ స్వయానా పాడిన కీర్తన ఇది. దానికి కాళ్లు ఊపుతూ ఆమె అందాల భంగిమలు చూపించేట్టు చిత్రీకరించడం తప్పు. ఇది కీర్తనకు అవమానం చేయడమే’ అని అన్నారు. తాము శ్రావణ భార్గవికి ఫోన్ చేసి అడిగితే చాలా బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చిందని తెలిపారు. 

స్పందించని శ్రావణ భార్గవి...
ఎట్టకేలకు శ్రావణ భార్గవి స్పందించింది. ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గట్టిగానే సమాధానం ఇచ్చింది. ఆ వీడియోలో అశ్లీలతా ఎక్కడుంది? అని ప్రశ్నించింది. ఆ పాటను తాను చాలా భక్తితో పాడనని, ఆ వీడియోల తెలుగుదనాన్ని చూపించానని చెప్పుకొచ్చింది. తెలుగుదనం తప్ప అశ్లీలత కనిపిస్తే అది మీ చూపులో ఉన్న లోపమే తప్ప, తన సమస్య కాదని అంది. మీ చూపులో లోపం ఉంటే దుప్పటి కప్పుకుని కూర్చున్నా అశ్లీలతే కనిపిస్తుందని అంది. తాను లిరిక్స్ మార్చి పాడలేదని, ఉన్నది ఉన్నట్టే పాడానని చెప్పుకొచ్చింది. మగ గాయకులు ఇలాంటి పాటలు పాడితే ఎలాంటి వివాదాలు రావు, అదే మహిళలు చేస్తే మాత్రం ఇలాంటి వివాదాలు వస్తాయి అని అభిప్రాయపడింది. 

శ్రావణ భార్గవి తన హస్కీ గొంతుతో అన్నమయ్య కీర్తన ‘ఒకపరి ఒకపరి వయ్యారమే’ పాటను పాడి వీడియోను పోస్టు చేసింది. అందులో చీరకట్టులో తెలుగందాన్ని ప్రతిబింబించేలా నటించింది. స్లోమోషన్లో వీడియో మొత్తాన్ని చిత్రీకరించింది. ఆ పాట మొత్తం ఆమెనే హైలైట్ చేసేలా ఉంది. కేవలం వేంకటేశ్వరస్వామికి మాత్రమే అంకితమైన పాటను, తనను హైలైట్ చేసుకునేందుకు శ్రావణ భార్గవి వాడుకోవడం బాగోలేదంటూ ఎంతో మంది నెటిజన్లు కామెంట్లు పెట్టారు. దీంతో ఆమె కామెంట్ సెక్షన్ ను క్లోజ్ చేసింది. ఈ వీడియోను వ్యూష్ మాత్రం భారీగా వస్తున్నాయి. వివాదాస్పదం కావడతో అందరూ చూస్తున్నారు. 

Also read: ఆ కీర్తనతో వివాదంలో చిక్కుకున్న శ్రావణ భార్గవి, అవమానం జరిగిందంటున్న అన్నమయ్య వంశస్థులు

Also read: సమంతను ఎత్తుకున్న అక్షయ్, ‘ఊ అంటావా.. ఉఊ అంటావా’ పాటకు చిందులు!

Published at : 21 Jul 2022 12:45 PM (IST) Tags: Shravana Bhargavi Shravana Bhargavi Annamayya Keerthana Annamayya Keerthana controversy Okapari Okapari Vayyareme

సంబంధిత కథనాలు

Meena Organ Donation: మీనా గొప్ప నిర్ణయం - మరణించిన తర్వాత మరొకరికి ప్రాణం పోసేలా

Meena Organ Donation: మీనా గొప్ప నిర్ణయం - మరణించిన తర్వాత మరొకరికి ప్రాణం పోసేలా

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Bimbisara Movie Box Office Phenomena : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!

Bimbisara Movie Box Office Phenomena : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!

Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం

Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం

Google Surprises To RRR Team : 'ఆర్ఆర్ఆర్' టీమ్‌కు గూగుల్ స‌ర్‌ప్రైజ్

Google Surprises To RRR Team : 'ఆర్ఆర్ఆర్' టీమ్‌కు గూగుల్ స‌ర్‌ప్రైజ్

టాప్ స్టోరీస్

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

64 మెగాపిక్సెల్ కెమెరాతో 5జీ ఫోన్ - లాంచ్ చేసిన టెక్నో!

64 మెగాపిక్సెల్ కెమెరాతో 5జీ ఫోన్ - లాంచ్ చేసిన టెక్నో!

IND vs ZIM: జింబాబ్వే బయల్దేరిన టీమ్‌ఇండియా! కుర్రాళ్ల జోష్‌ చూడండి!

IND vs ZIM: జింబాబ్వే బయల్దేరిన టీమ్‌ఇండియా! కుర్రాళ్ల జోష్‌ చూడండి!

Minister Harish Rao : మహిళలకు కొత్తగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, వచ్చే నెల నుంచి ప్రారంభం- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : మహిళలకు కొత్తగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, వచ్చే నెల నుంచి ప్రారంభం- మంత్రి హరీశ్ రావు