Samantha: సమంతను ఎత్తుకున్న అక్షయ్, ‘ఊ అంటావా.. ఉఊ అంటావా’ పాటకు చిందులు!
సమంత అతి త్వరలో బాలీవుడ్లో అడుగుపెట్టబోతోంది. ఈలోపు కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతోంది సమంత. ఇంకా బాలీవుడ్లో ఒక్క సినిమా చేయకముందే ‘కాఫీ విత్ కరణ్’ షోకు అతిథిగా పాల్గొంది. ఆమెతో పాటూ అక్షయ్ కుమార్ కూడా వచ్చారు.ఆ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలు విడుదలయ్యాయి. సమంత తనను అక్షయ్ ఎత్తుకుని తీసుకువస్తున్న ఫోటోలను తన స్టేటస్‌లో పోస్టు చేసింది. ఈ ఎపిసోడ్ ట్రైలర్ చూస్తే వీరిద్దరూ కలిసి ఒక్క సినిమాలో కలిసి నటించకపోయినా మంచి కెమిస్ట్రీతో కామెడీని పండించారని అనిపిస్తుంది. కరణ్ వారిద్దరినీ కెమెరా ముందుకు ఆహ్వానించగానే అక్షయ్ రెండు చేతులతో సమంతను ఎత్తుకుని తీసుకొచ్చారు. కరణ్ అడిగిన ప్రశ్నలకు ఇద్దరూ సరదాగా సమాధానాలు చెప్పారు. బ్యాచిలరేట్ పార్టీకి ఏ ఇద్దరు బాలీవుడ్ హీరోలను తీసుకెళ్తారని ప్రశ్నించగా, సమంత ‘రణ్ వీర్ సింగ్’ పేరునే రెండు సార్లు చెప్పింది. దానికి అక్షయ్ ‘ఓకే’ అంటూ కూల్ గా రియాక్ట్ అయ్యారు.
Behold! The superstars are here to raise the temperature of the gram! 🔥#HotstarSpecials #KoffeeWithKaranS7 episode 3 streaming on Thursday only on Disney+ Hotstar.
— Dharmatic (@Dharmatic_) July 20, 2022
____@DisneyPlusHS @karanjohar @akshaykumar @Samanthaprabhu2 @apoorvamehta18 @jahnvio @aneeshabaig pic.twitter.com/zm6qXHja6k
వారితో కొన్ని ఆటలు కూడా ఆడించారు కరణ్. మధ్యలో అక్షయ్, సమంత కలిసి ‘ఊ అంటావా... ఉఊ అంటావా’ మ్యూజిక్‌కు స్టెప్పులేశారు. డ్యాన్సులో కూడా ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. సమంత-అక్షయ్ ఎపిసోడ్ ఈ గురువారం డిస్నీ హార్ట్ స్టార్ ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు సమంత ఫ్యాన్స్. ఈ కార్యక్రమంలో ఆమె తన పెళ్లి, విడాకుల గురించి ఏమైనా చెబుతుందేమోనని ఎదురుచూస్తున్నవారూ ఉన్నారు. ప్రోమోలో ‘అన్ హ్యాపీ మ్యారేజ్’ గురించి మాట్లాడింది. కాబట్టి పూర్తి ఎపిసోడ్ లో నాగ చైతన్యతో విడాకుల గురించి మాట్లాడి ఉంటుందని, కరణ్ వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడించగల దిట్ట అని భావిస్తున్నారు ప్రేక్షకులు.
Also Read : డైరెక్టుగా ఓటీటీలోకి 'బబ్లీ బౌన్సర్' - తమన్నా ఫస్ట్ లుక్ చూశారా?
View this post on Instagram