అన్వేషించండి

Naveen Polishetty: సిద్ధుగా వస్తున్న నవీన్ పోలిశెట్టి - బర్త్‌డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన యూవీ క్రియేషన్స్!

నవీన్ పోలిశెట్టి, అనుష్కల కొత్త సినిమా పోస్టర్ ఆన్‌లైన్‌లో విడుదల అయింది.

టాలీవుడ్‌లో మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరోల్లో నవీన్ పోలిశెట్టి ఒకరు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’ సినిమాలతో వరుసగా రెండు హిట్లు అందుకున్న నవీన్ తన మూడో సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో చేస్తున్నారు. ఇందులో ప్రముఖ హీరోయిన్ అనుష్క హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఇప్పుడు ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ చిత్రానికి ఇంకా పేరును నిర్ణయించలేదు. అయితే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే పేరు ఎప్పట్నుంచో రూమర్స్‌లో ఉంది. దీనికి తగ్గట్లే ఈ సినిమాలో సిద్ధు పోలిశెట్టి అనే పాత్రలో నవీన్ కనిపించనున్నాడని ఈ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. ఇందులో స్టాండప్ కమెడియన్ పాత్రను నవీన్ పోలిశెట్టి పోషిస్తున్నారు. అనుష్క ఇందులో అన్విత రవళి శెట్టి అనే పాత్రలో కనిపిస్తుంది. తాను చెఫ్ పాత్రను పోషిస్తుంది.

‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఇదే. అలాగే జాతిరత్నాలు బ్లాక్‌బస్టర్ తర్వాత నవీన్ నటిస్తున్న సినిమా కూడా ఇదే కాబట్టి దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్త దర్శకుడు పి.మహేష్ బాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. రథన్ దీనికి సంగీతం అందిస్తున్నారు.

అనుష్కకు 48వ చిత్రమిది. 'మిర్చి', 'భాగమతి' విజయాల తర్వాత యూవీ క్రియేషన్స్ సంస్థలో ఆమె నటిస్తున్న హ్యాట్రిక్ సినిమా. ఇందులో ఆమె సరికొత్త లుక్ లో కనిపించనున్నారు.  తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం మొత్తం నాలుగు దక్షిణాది భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ అని సమాచారం. వయసులో దాదాపు ఇరవై ఏళ్లు గ్యాప్ ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ పుట్టడం, ఆ తర్వాత వాళ్లు ఎదుర్కొనే పరిమాణాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి కెరీర్ ఆరంభంలోనే అనుష్క లాంటి హీరోయిన్ తో కలిసి నటించే ఛాన్స్ రావడమంటే విశేషమనే చెప్పాలి. పైగా సినిమాలో ఇద్దరి రోల్స్ చాలా కొత్తగా ఉంటాయట. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by UV Creations (@uvcreationsofficial)

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Health Condition: పవన్ కళ్యాణ్‌కు భుజాల్లో తీవ్ర గాయం.. వెంటనే సర్జరీ చేయించుకోవాలని ముంబై డాక్టర్ల సూచన!
పవన్ కళ్యాణ్‌కు భుజాల్లో తీవ్ర గాయం.. వెంటనే సర్జరీ చేయించుకోవాలని ముంబై డాక్టర్ల సూచన!
Raksha Gowda: గుప్పెడంత మనసు సీరియల్ వసుధార.. రక్షా గౌడ రియల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
గుప్పెడంత మనసు సీరియల్ వసుధార.. రక్షా గౌడ రియల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Jagadhatri Serial Today June 29th:దివ్యాంక చెంప పగులగొట్టిన నిషిక....కోడలిలో వచ్చిన మార్పు చూసి షాక్‌ తిన్న వైజయంతి
జగద్ధాత్రి సీరియల్: దివ్యాంక చెంప పగులగొట్టిన నిషిక....కోడలిలో వచ్చిన మార్పు చూసి షాక్‌ తిన్న వైజయంతి
NTR Trivikram Movie Story : షణ్ముఖుడిగా ఎన్టీఆర్ - త్రిశూలంలో DNA... త్రివిక్రమ్ విజనరీ పోస్టర్ స్టోరీ ఏంటంటే?
షణ్ముఖుడిగా ఎన్టీఆర్ - త్రిశూలంలో DNA... త్రివిక్రమ్ విజనరీ పోస్టర్ స్టోరీ ఏంటంటే?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
Nerve Weakness : నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Embed widget