Natyam Movie Song: 'టీజర్' యంగ్ టైగర్,' ఫస్ట్ సాంగ్' నటసింహం..ఇప్పుడు విక్టరీ హీరో.. 'నాట్యం' ప్రమోషన్ మామూలుగా లేదు...
సంధ్యారాజు, కమల్ కామరాజు నటిస్తోన్న 'నాట్యం' మూవీలో ఫస్ట్ సాంగ్ బాలయ్య రిలీజ్ చేయగా...తాజాగా రెండో పాట విడుదల చేసిన విక్టరీ వెంకటేష్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు..
ఓ కథను డాన్స్ ద్వారా అందమైన రూపంలో చెప్పే ప్రయత్నమే 'నాట్యం ' సినిమా. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా పరిచయమవుతోంది. రేవంత్ కోరుకొండ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే నందమూరి నటసింహం బాలకృష్ణ చేతులమీదుగా ఫస్ట్ సాంగ్ ‘నమః శివాయ’ను విడుదల చేయగా...తాజాగా విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా చిత్ర బృందం రెండో పాట విడుదల చేయించింది.
నాట్యం అంటే ఒక కథని అందంగా చెప్పడం..This recalled those days of SwarnaKamalam..
— Venkatesh Daggubati (@VenkyMama) September 29, 2021
Happy to launch this emotional song #PoniPoni from #NATYAM 😊
▶️ https://t.co/uD5y03tEb2
A film by @RevanthOfficial🎬
🌟Ing @srisandhyaraju
@NatyamTheMovie#NatyamMovieOnOct22nd
’నాట్యం’ సినిమా నుంచి ‘పోనీ పోనీ’ పాట విడుదల చేయడం సంతోషంగా ఉందన్నార విక్టరీ హీరో. విలక్షణ కథకు ఎమోషన్స్ కలగలిపి రూపొందించారు... చూస్తుంటే‘స్వర్ణ కమలం’ గుర్తొస్తోంది అన్నారు. అందమైన లొకేషన్స్‌లో ఎంతో అందంగా చిత్రీకరించారు. డాన్స్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా వచ్చి చాలా రోజులైంది. చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్” చెప్పారు వెంకీ.
ఈ సాంగ్ తనకు చాలా స్పెషల్ అంది సంధ్యారాజు. ఈ సినిమాలో భాగమవడం ఓ ఆశీర్వాదంలా ఫీల్ అవుతున్నా అన్న సంధ్యారాజు ఈ సినిమాలో భానుప్రియ తనకు తల్లిగా నటించడం..ముఖ్యమైన పాటని వెంకటేష్ లాంచ్ చేయడం తన జీవితంలో మరవలేని క్షణాలు” అంది. వాస్తవానికి ఈ సినిమా తెరకెక్కించడానికి తనకు స్వర్ణకమలమే ఇన్సిపిరేషన్ అన్నారు డైరెక్టర్ రేవంత్. ఈ సినిమాకి శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చారు. అక్టోబర్ 22న ‘నాట్యం’ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
గతంలో నందమూరి బాలకృష్ణ లాంచ్ చేసిన సాంగ్
'నాట్యం' అఫీషియల్ టీజర్ ఇక్కడ చూడొచ్చు
Also Read: పట్టుచీర, మల్లెపూలు...పుష్పలో రష్మిక ఫస్ట్ లుక్ అదిరిపోలా..!
Also Read: నా శ్వాస ఉన్నంత వరకూ మీరే నా దైవం..బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
Also Read: సామాజిక సేవలో సోనూ మరో అడుగు..శబ్దం, వాసన, రుచిని ఇకపై చక్కగా ఆస్వాదిద్దాం అన్న రియల్ హీరో