News
News
X

Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?

నాని తన లేటెస్ట్ సినిమా ‘దసరా’టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడారు.

FOLLOW US: 
Share:

నేచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమా మీద మంచి కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. అది టీజర్ లాంచ్‌లో కొట్టొచ్చినట్లు కనిపించింది. ‘2022లో తెలుగు సినిమా నుంచి ‘ఆర్ఆర్ఆర్’, కన్నడ సినిమా నుంచి ‘కేజీయఫ్’, ‘కాంతార’ వచ్చాయి. గర్వంగా, కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను 2023లో తెలుగు సినిమా నుంచి దసరా వస్తుంది.’ అన్నారు. ఏకంగా ఆర్ఆర్ఆర్, కేజీయఫ్‌లతో పోల్చడం అంటే అంచనాలను ఆకాశానికి పెంచడమే, మరి వాటిని అందుకుంటారో లేదో చూడాలి.

హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, ‘సాధారణంగా ఇలాంటి ఫంక్షన్లకు వస్తే అందరికీ నమస్కారం అని మొదలు పెట్టాలి. కానీ ఇది దసరా. ఎట్లున్నరు మామా, ఎట్లున్నరు కాకా అని అడగాలి. నాకు ఇది చాలా స్పెషల్ సినిమా. దీని ప్రమోషన్ మీతో ప్రారంభం కావడం ఇంకా స్పెషల్.’

‘ఈ సందర్భంగా నాకు మీ అందరికీ ఒక ప్రామిస్ చేయాలనుంది. మార్చి 30న ఈ కాలేజీ చుట్టూ ఉన్న గట్ల మీద, చెట్ల కింద కూర్చుని మీరు దసరా గురించే మాట్లాడుకుంటారు. అది తప్ప ఇంకో టాపిక్కే ఉండదు. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి తెలుగు సినిమా కోసం నా కాంట్రిబ్యూషన్ ఏంటి? సినిమాకి నేను ఏం ఇస్తున్నాను? అని ఆలోచించే వాడ్ని ప్రతిసారీ. ఇప్పుడు చాలా గర్వంగా చెబుతున్నా. తెలుగు సినిమా, భారతీయ సినిమాకి నా బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఈ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెల. అదేంటి అన్నది మీకు మార్చి 30కి తెలిసిపోతుంది. ఇప్పటి దాకా చూపించింది చిన్న శాంపిల్ పీసులు మాత్రమే. ఎలాంటి సినిమా తీశామో మార్చి 30కి తెలిసిపోతుంది.’

‘నేను లోకల్ తర్వాత ఇలా ఈవెంట్స్‌కి కాలేజీలకి వెళ్లడం మానేశాను. మీ అందరి ప్రేమ చూశాక ఇక నుంచి రెగ్యులర్‌గా స్టూడెంట్స్‌ని కలుస్తూనే ఉంటాను. మీ అందరికీ ఆ ప్రామిస్ చేస్తున్నాను. అందరికీ చాలా థ్యాంక్స్. టీజర్ జస్ట్ శాంపిల్ మాత్రమే. సినిమా వేరే లెవల్‌లో ఉంటది.’

‘మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ వాళ్లకి, స్టాఫ్, చైర్మన్‌కి అందరికీ థ్యాంక్స్. అందరూ ఇంత కో-ఆపరేట్ చేశారు. ఇక్కడ ప్రమోట్ చేసే అవకాశం మా అందరికీ ఇచ్చారు. అంతకు మించి స్టూడెంట్స్ అందరికీ పేరు పేరునా థ్యాంక్స్. మీరు చూపించే ఎనర్జీ, ప్రేమ కోసమే ఇంత దూరం వస్తాం. నాకు కడుపు నిండిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. సినిమా రిలీజ్ తర్వాత మళ్లీ కలిసి సెలబ్రేట్ చేసుకుందాం.’ అంటూ నాని తన స్పీచ్ ముగించారు.

పూర్తిగా రా, రస్టిక్ లుక్‌లో ఉన్న నానిని ఈ టీజర్‌లో చూడవచ్చు. పుష్ఫ తరహా టేకింగ్ కనిపిస్తుంది. సుకుమార్ శిష్యుడే ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓడెల. నాని కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతుంది. సింగరేణి గనుల బ్యాక్‌డ్రాప్‌తో నడిచే కథను ఎంచుకున్నారు. ఈ సినిమా తెలుగు టీజర్‌ను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేశారు. తమిళ టీజర్‌ను విలక్షణ నటుడు ధనుష్, కన్నడ టీజర్‌ను రక్షిత్ శెట్టి, మలయాళ టీజర్‌ను దుల్కర్ సల్మాన్, హిందీ టీజర్‌ను షాహిద్ కపూర్ లాంచ్ చేయడం విశేషం.

Published at : 30 Jan 2023 08:18 PM (IST) Tags: nani Natural star Nani Dasara Dasara Teaser

సంబంధిత కథనాలు

Ajith Kumar: అజిత్ ఇంటికి నేరుగా వెళ్లి పరామర్శించిన విజయ్ - పోటీ బాక్సాఫీస్ దగ్గరే, పర్సనల్ లైఫ్‌లో కాదు!

Ajith Kumar: అజిత్ ఇంటికి నేరుగా వెళ్లి పరామర్శించిన విజయ్ - పోటీ బాక్సాఫీస్ దగ్గరే, పర్సనల్ లైఫ్‌లో కాదు!

Akshay Kumar: మూవీ షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్

Akshay Kumar: మూవీ షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్

New Music Directors in Tollywood: సరికొత్త ట్యూన్స్‌తో అదరగొడుతున్న చిన్న సంగీత దర్శకులు - ఒక్క ఛాన్స్ ఇవ్వండి గురూ!

New Music Directors in Tollywood: సరికొత్త ట్యూన్స్‌తో అదరగొడుతున్న చిన్న సంగీత దర్శకులు - ఒక్క ఛాన్స్ ఇవ్వండి గురూ!

Nikhil Wife Pallavi Varma: సాడ్ స్టోరీలు చెప్పి నన్ను పడేశాడు: నిఖిల్ భార్య పల్లవి

Nikhil Wife Pallavi Varma: సాడ్ స్టోరీలు చెప్పి నన్ను పడేశాడు: నిఖిల్ భార్య పల్లవి

Jabardasth: పానకం కోసం గొడవపడ్డ ‘జబర్దస్త్’ టీమ్, యాంకర్ సౌమ్యపై ఇంద్రజ ఆగ్రహం

Jabardasth: పానకం కోసం గొడవపడ్డ ‘జబర్దస్త్’ టీమ్, యాంకర్ సౌమ్యపై ఇంద్రజ ఆగ్రహం

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల