అన్వేషించండి

Malli Pelli in OTT: ఓటీటీలోకి ‘మళ్లీ పెళ్లి’ సినిమా - కోర్టును ఆశ్రయించిన నరేష్ భార్య రమ్య రఘుపతి!

‘మళ్లీ పెళ్లి’ సినిమా జూన్ 23 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీను నిలిపివేయాలని నరేష్ భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.

Malli Pelli Movie: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ జంటగా నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమా లొల్లి మళ్లీ మొదలైంది. ఈ సినిమాను జూన్ 23 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది. ఈ నేపథ్యం లో మూవీ స్ట్రీమింగ్ ను నిలిపి వేయాలంటూ నరేష్ భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించింది. ఈ సినిమా నిజ జీవితాలను పోలి ఉందని, ఈ మూవీతో సమాజంలో తన ప్రతిష్టను దెబ్బ తీయాలని చూస్తున్నారంటూ కోర్టు మెట్లెక్కింది రమ్య. గతంలో కూడా సినిమా విడుదల సందర్భంగా కూడా ఇలాగే సినిమాను నిలిపివేయాలంటూ డిమాండ్ చేసింది. మళ్లీ మరోసారి ఓటీటీలో కూడా మూవీను నిలిపివేయాలంటూ కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

‘మళ్లీ పెళ్లి’ ను ముందు నుంచీ వ్యతిరేకిస్తోన్న రమ్య రఘుపతి..

టాలీవుడ్ లో గత కొంత కాలంగా నరేష్, రమ్య రఘుపతి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వీరి మధ్యలోకి పవిత్ర లోకేష్ ఎంటర్ అయిన తర్వాత ఈ వ్యవహారం ఇంకా ముదిరింది. నరేష్ గత కొంత కాలంగా పవిత్రతో సన్నిహితంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నరేష్ ఆయన భార్య రమ్య రఘుపతికి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఆ విభేదాలు కాస్తా విడాకుల వరకూ వెళ్లింది. అయితే నరేష్ విడాకులు ఇచ్చినా రమ్య రఘుపతి మాత్ర ససేమీరా అంటోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో నడుస్తోంది. అయితే సేమ్ ఇదే సబ్జెక్టుతో నరేష్ ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా తీశారనే ప్రచారం జరుగుతోంది. నరేష్ భార్య కూడా ఈ సినిమా పై ఫైర్ అయింది. ముందునుంచీ కూడా ఈ సినిమాను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. సినిమా రిలీజ్ అయ్యాక కూడా దీనిపై నిరసన వ్యక్తం చేసింది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ ను తప్పుగా చూపించారని. తన ప్రతిష్టను దెబ్బ తీయడానికే ఈ సినిమా తీశారని ఆరోపించింది. అయినా సినిమా యథావిధిగా థియేటర్లలో విడుదలైంది.

నా పరువు తీయాలనే ఇలా చేస్తున్నారు, సినిమాను నిలిపివేయండి: రమ్య రఘుపతి

తాజాగా ‘మళ్లీ పెళ్లి’ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. జూన్ 23 నుంచి మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. గతంలో ఈ మూవీను అమెజాన్ ప్రైమ్ లో కూడా విడుదల చేయాలని చూశారు. కానీ రమ్య రఘుపతి అడ్డం పడటంతో అందులో స్ట్రీమింగ్ ను నిలిపివేశారు. అయితే ఆహాలో మాత్రం స్ట్రీమింగ్ కు రెడీ అయిందీ మూవీ. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో కూడా నిలిపివేయాలంటూ రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించింది. సినిమాలో తన పాత్ర పరువు తీసేలా ఉందని పేర్కొంది.

ఈ సినిమా నిజజీవితాలకు దగ్గర పోలిక ఉందని, ఇందులో తన పాత్ర విషయంలో అవాస్తవాలను ప్రచారం చేశారని, తనకు సమాజంలో చెడ్డ పేరు తేవడం కోసమే ఇలా ఈ సినిమాను తీసారని అని కోర్టుకు విన్నవించింది రమ్య. అయితే ఈ సినిమా పూర్తిగా కల్పితమని ముందు నుంచీ చెప్పుకొస్తున్నారు నరేష్. ఇప్పుడు ‘మళ్లీ పెళ్లి’ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి రమ్య పెట్టిన కేసు అడ్డంకిగా మారింది. మరి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇక ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నరేష్, పవిత్ర లోకేష్ నటించగా జయసుధ, శరత్‌బాబు, వనిత విజయకుమార్, అనన్య నాగళ్ల, మధు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. 

Also Read: బోయపాటి - రామ్ మూవీ రిలీజ్ డేట్ మారిందండోయ్ - ముందే వచ్చేస్తారట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget