అన్వేషించండి

Naresh: మహేశ్, రాజమౌళి సినిమాపై నరేశ్ వ్యాఖ్యలు - హీరో ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్టేట్‌మెంట్

SSMB29: మహేశ్, రాజమౌళి కాంబోలో సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ఇంకా సమయం ఉన్నా.. ఇప్పటినుండే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా నరేశ్ కూడా ఈ మూవీపై వ్యాఖ్యలు చేశారు.

Naresh about SSMB29: ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పలు సినిమాల్లో రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లోని సినిమా కూడా ఒకటి. కానీ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూసినా.. ఈ సినిమా కోసం కనీసం మూడేళ్లు అయినా వెయిట్ చేయక తప్పదు. ఇక ఇప్పటికీ ఈ మూవీ గురించి పెద్దగా అప్డేట్స్ ఏమీ బయటికి రాలేదు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. తాజాగా సీనియర్ యాక్టర్ నరేశ్.. మహేశ్ బాబు, రాజమౌళి సినిమా గురించి పలు వ్యాఖ్యలు చేశారు. నరేశ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఫ్యాన్స్ కూడా అంగీకరిస్తున్నారు.

మహేశ్ ఫ్యాన్ ఫాలోయింగ్‌పై వ్యాఖ్యలు..

రాజమౌళి డైరెక్షన్‌లో మహేశ్ బాబు నటిస్తే చూడాలని టాలీవుడ్ లవర్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అయ్యింది. ప్రాజెక్ట్ ఓకే అయ్యి కూడా ఏడాదిన్నర అవుతున్నా.. ఈ మూవీ గురించి రూమర్స్ తప్పా కన్ఫర్మ్‌గా పెద్దగా అప్డేట్స్ ఏమీ బయటికి రావడం లేదు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఈ మూవీకి రైటర్‌గా పనిచేస్తున్నారు. ఆయన మాత్రమే మహేశ్‌తో జరుగుతున్న ప్రాజెక్ట్ గురించి అప్పుడప్పుడు కొన్ని అప్డేట్స్ బయటపెడుతున్నారు. తాజాగా మహేశ్ సోదరుడు నరేశ్ కూడా ఈ ప్రాజెక్ట్ గురించి స్టేట్‌మెంట్ ఇచ్చారు. మహేశ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా వ్యాఖ్యలు చేశారు.

తెలుగు సినిమా స్థాయిని పెంచుతుంది..

మహేశ్ బాబుకు క్లాస్‌తో పాటు మాస్ ఆడియన్స్‌లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉందని నరేశ్ గుర్తుచేసుకున్నారు. ప్రపంచానికి ఇండియన్ సినిమాను పరిచయం చేసింది రాజమౌళినే అని ప్రశంసించారు. తెలుగు సినిమా స్థాయిను వీరి సినిమా వేరే లెవెల్‌కు తీసుకెళుతుందని ఆశిస్తున్నాను అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు నరేశ్. ఆయన చెప్పిన మాటలతో మహేశ్ ఫ్యాన్స్ అంగీకరిస్తున్నారు. నిజంగానే ఈ సినిమా.. రాజమౌళి, మహేశ్ స్థాయిని మరింత పెంచాలని కోరుకుంటున్నారు. అంతే కాకుండా ఇప్పటివరకు మహేశ్‌కు తెలుగులో మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఆయన పేరు ప్రపంచమంతా మారుమోగాలని తెలుగు అభిమానులు ఆశిస్తున్నారు.

ఇంటర్నేషనల్ నటీనటులు..

మహేశ్ బాబు కెరీర్‌లో 29వ చిత్రం రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కడానికి సిద్ధమయ్యింది. ఇక తాజాగా ఈ స్క్రిప్ట్ పని కూడా పూర్తయ్యిందని విజయేంద్ర ప్రసాద్ రివీల్ చేశారు.‘ఆర్ఆర్ఆర్’లాగానే ఈ మూవీలో కూడా ఇంటర్నేషనల్ నటీనటులు ఉండే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే బయటపెట్టారు. అందుకే కొన్నిరోజుల క్రితం మహేశ్, రాజమౌళి సినిమాలో ఒక ఇండోనేషియన్ నటి ఉంటుందని రూమర్స్ కూడా వైరల్ అయ్యాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు పక్కా పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్‌‌పైకి వెళ్లనుంది. ఒక్కసారి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయితే మహేశ్‌ను దాదాపు మూడేళ్ల వరకు స్క్రీన్‌పైన చూడలేరు అభిమానులు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ.. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు.

Also Read: బాక్సాఫీస్ దగ్గర ‘నా సామిరంగ’ దూకుడు, 6 రోజుల్లో ఎంత వసూళు చేసిందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Embed widget