అన్వేషించండి
Advertisement
Pavithra Lokesh: కావాలనే నన్ను బ్యాడ్ చేస్తున్నారు - పవిత్రా లోకేష్ ఎమోషనల్ కామెంట్స్
తాజాగా పవిత్రా లోకేష్.. నరేష్ తో రిలేషన్ గురించి మాట్లాడారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో నరేష్ విడాకులు, పవిత్రా లోకేష్ తో రిలేషన్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ విషయంపై నరేష్ కన్నడ మీడియాతో మాట్లాడారు. పవిత్రా తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పారు. ఇక తాజాగా పవిత్రా లోకేష్ కూడా ఈ విషయంపై మాట్లాడారు.
కావాలనే నన్ను బ్యాడ్ గా ప్రెజంట్ చేశారు..:
పవిత్రా లోకేష్ మాట్లాడుతూ.. 'కన్నడ ఇండస్ట్రీకి చెందిన నేను టాలీవుడ్ లో సినిమాలు చేసి తెలుగు వారికి దగ్గరయ్యాను. నరేష్ గారి గురించి, ఆయన ఫ్యామిలీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆయన భార్యనంటూ రమ్య అనే మహిళ నా గురించి మీడియాలో చెడ్డగా మాట్లాడుతూ.. వారిద్దరి విడాకులకు కారణం నేనేనంటూ కన్నడ మీడియాలో చెబుతూ నన్ను బ్యాడ్ చేసేసింది. ఈ మాటలు నన్ను చాలా బాధపెడుతున్నాయి. నాకే ఇలా ఎందుకు జరుగుతుందనిపించింది. ఆ తరువాత నరేష్ గారు బెంగుళూరు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు నాకు ఈ ఇష్యూతో ఎలాంటి సంబంధం లేదని పబ్లిక్ చెప్పాలనే సిట్యుయేషన్ వచ్చేసింది. భర్త కావాలంటే ఫ్యామిలీతోనే కూర్చొని సెటిల్ చేసుకోవాల్సిన విషయం. నరేష్ గారు తెలుగులో ఫేమస్ యాక్టర్. అలాంటప్పుడు అక్కడ మీడియాతో కదా రమ్య మాట్లాడాల్సింది. కానీ బెంగుళూరులో ఎందుకు మాట్లాడుతుంది. హైదరాబాద్ లో మాట్లాడితే అక్కడ పెద్దవాళ్లు ఉన్నారు కాబట్టి వాళ్లే సెటిల్ చేస్తారు. కానీ బెంగుళూరు వచ్చి నన్ను బ్యాడ్ గా ప్రెజంట్ చేశారు. ఈ విషయంలో ప్రేక్షకులు నన్ను, నరేష్ గారిని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను' అంటూ చెప్పుకొచ్చింది.
మా రిలేషన్షిప్, మా ఫ్రెండ్షిప్ మాది..:
అలానే నరేష్ కూడా ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. 'రమ్య రఘుపతికి ఎనిమిదేళ్లుగా దూరంగా ఉంటున్నా.. హిందూపురంలో ఆమె కొన్ని మోసాలు చేసింది. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కి పాల్పడింది. అక్కడ నుంచి ఏడెనిమిదేళ్లకు హైదరాబాద్ కి వచ్చింది. ఎక్కడపడితే అక్కడ ఫైనాన్స్ తీసుకొని,. చిన్న చిన్న వాళ్లను మోసం చేసి దొరికిపోయింది. ఈ ఇష్యూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లగా.. సెటిల్ చేసుకొని మళ్లీ బెంగుళూరు వెళ్లింది. అక్కడొక బ్లాక్ మెయిల్ ఛానెల్ తో కలిసి నా మీద వదంతులు స్ప్రెడ్ చేస్తూ.. విడాకుల గురించి మాట్లాడుతుంది. ఇన్ని క్రైమ్స్ చేసిన తరువాత నన్ను డబ్బు అడిగితే ఒక పది లక్షలు ఇచ్చాను. ఆమె చేసిన పనికి అందరూ ఇంటి మీద పడి గొడవ చేస్తుంటే.. డివోర్స్ పంపించాను. ఎప్పుడైతే విడాకుల నోటీసులు పంపించానో.. అప్పటినుంచి నాకు వేరే పెళ్లి జరగబోతుందని వార్తలు సృష్టించింది. నేను ఎనిమిదేళ్లుగా పడ్డ హింస, బ్లాక్ మెయిల్, జనాలను మోసం చేయడం నాకు చాలా అవమానంగా ఉంది. అందుకే నేను డివోర్స్ తీసుకుంటున్నాను. ఈ విషయానికి పవిత్రా లోకేష్ ని లింక్ చేసి ఆమె కోసం డివోర్స్ తీసుకుంటున్నానని కొత్త యాంగిల్ తీసుకురావడం చాలా తప్పు. మా రిలేషన్షిప్, మా ఫ్రెండ్షిప్ మాది. మేమెప్పుడూ స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉంటాం. నాకు భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తేనే భయపడాలి. దెయ్యాలకు భయపడం' అంటూ చెప్పుకొచ్చారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement