అన్వేషించండి
Jabardasth: బిగ్ బాస్ బ్యూటీకి 'జబర్దస్త్' ఛాన్స్ - అనసూయ రేంజ్ లో క్లిక్ అవుతుందా?
'జబర్దస్త్' షోకి గుడ్ బై చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది అనసూయ. ఇప్పుడు ఆమె స్థానంలో మరో కొత్త యాంకర్ ని తీసుకోవాలనుకుంటున్నారు.

బిగ్ బాస్ బ్యూటీకి 'జబర్దస్త్' ఛాన్స్ - అనసూయ రేంజ్ లో క్లిక్ అవుతుందా?
బుల్లితెరకు గ్లామర్ టచ్ ను పరిచయం చేసింది అనసూయ భరద్వాజ్. ఈమె తరువాత చాలా మంది యాంకర్లు ఎక్స్ పోజింగ్ చేయడం మొదలుపెట్టారు. ఎంతమంది అనసూయకి పోటీ వచ్చినా ఆమె స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. 'జబర్దస్త్' షోతో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. రీసెంట్ గా మూడు కొత్త సినిమాలు సైన్ చేసింది. నటిగా బిజీ అవ్వడంతో బుల్లితెరపై దూరమైంది.
'జబర్దస్త్' షోకి గుడ్ బై చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది. ఇప్పుడు ఆమె స్థానంలో మరో కొత్త యాంకర్ ని తీసుకోవాలనుకుంటున్నారు. ఆల్రెడీ రష్మీ ఉంది కానీ ఈ షోకి ఇద్దరు యాంకర్లు అవసరం. అందుకే మల్లెమాల మరో కొత్త ఆప్షన్ కోసం వెతుకుతుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపుని తమ షోకి యాంకర్ గా తీసుకోవాలనుకుంటున్నారట.
ఇప్పటికే యూట్యూబ్ లో తన ఇంటర్వ్యూలలో గుర్తింపు తెచ్చుకుంది స్రవంతి. బిగ్ బాస్ ఓటీటీలో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఈ షో ఆమెకి కాస్త పాపులారిటీ తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలతో రచ్చ చేస్తుంటుంది స్రవంతి. 'జబర్దస్త్' షోకి ఈమెని తీసుకొస్తే గ్లామర్ యాడ్ అవుతుందని భావిస్తుంది టీమ్. ఆమెకి గనుక ఛాన్స్ ఇస్తే మరో అనసూయ అవుతుందని అంటున్నారు. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!
Also Read: మాది 'పవిత్ర' బంధం, మేం మంచి స్నేహితులం - రూమర్స్‌పై నరేష్ స్పందన
Also Read : నెట్‌ఫ్లిక్స్‌లో అడివి శేష్ 'మేజర్' - మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
పాలిటిక్స్
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion