News
News
X

Sitaramam: క్లాసిక్ హిట్ మిస్ చేసుకున్న హీరోలు - ఇప్పుడు ఫీలై ఏం లాభం!

'సీతారామం' కథను నేచురల్ స్టార్ నాని(Nani)కి వినిపించారట.

FOLLOW US: 

దర్శకుడు హను రాఘవపూడి(Hanu Raghavapudi) రూపొందించిన 'సీతారామం'(Sitaramam)సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషించారు. రష్మిక కీలకపాత్రలో కనిపించింది. తొలిరోజు నుంచే ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. క్లాసిక్ లవ్ స్టోరీ అంటూ తెగ పొగిడేస్తున్నారు సినీ అభిమానులు. లాంగ్ రన్ లో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది.

Nani, Ram Missed Sitaramam: ఈ సినిమా చూసిన తరువాత సీతారాములుగా దుల్కర్, మృణాల్ లను తప్ప మరొకరిని ఊహించుకోలేం. అంతగా వారు తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమా కోసం ముందుగా చాలా మంది హీరోలను అనుకున్నారు దర్శకుడు హను రాఘవపూడి. ముందుగా ఈ కథను నేచురల్ స్టార్ నాని(Nani)కి వినిపించారట. కానీ 'పడి పడి లేచే మనసు' లాంటి సినిమా తరువాత హను రాఘవపూడితో వర్క్ చేయడం రిస్క్ అనుకున్న నాని 'నో' చెప్పారట. 

ఆ తరువాత రామ్ పోతినేని(Ram Pothineni)కి ఈ కథ వినిపించారట హను రాఘవపూడి. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో రామ్ కూడా నో చెప్పినట్లు తెలుస్తోంది. ఫైనల్ గా దుల్కర్ చేతికి ఈ సినిమా వెళ్లింది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో.. ఇలాంటి క్లాసిక్ హిట్ ను వదులుకున్నందుకు నాని, రామ్ ఫీల్ అవుతున్నట్లు సమాచారం. 

ఈ ఇద్దరు హీరోలకు ఇప్పుడు సక్సెస్ చాలా అవసరం. ఈ సినిమా గనుక ఇద్దరిలో ఎవరు చేసినా.. వారి కెరీర్ కి హెల్ప్ అయ్యేది. కానీ మిస్ చేసుకున్నారు. వీరితో పాటు విజయ్ దేవరకొండకి కూడా కథ చెప్పారు హను రాఘవపూడి. ఈ విషయాన్ని ఆయనో ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. అయితే ఈ సినిమా వదులుకున్నందుకు విజయ్ కి ఎలాంటి రిగ్రెట్స్ లేవట. తనకు రామ్ క్యారెక్టర్ సూట్ అవ్వదని.. దానికి దుల్కర్ లాంటి సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్లే సూట్ అవుతారనేది విజయ్ ఆలోచన. 

ఓటీటీలో సీతారామం:

Sita Ramam OTT - ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ద‌క్కించుకున్నట్లు తెలుస్తోంది. థియేట‌ర్ విడుద‌ల‌కు ఆరు వారాల త‌ర్వాత ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సినిమాలో దుల్క‌ర్ లెఫ్టినెంట్ రామ్ పాత్ర‌లో క‌నిపించారు. మృనాళ్ థాకూర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా కథ‌ను మ‌లుపు తిప్పే పాత్ర‌లో న‌టించింది. న‌టుడు సుమంత్, త‌రుణ్ భాస్క‌ర్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాను స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌పై స్వ‌ప్న ద‌త్ నిర్మించింది.

Also Read : రేపిస్టులను వదిలేస్తారా? గుజరాత్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వానికీ పూనమ్ కౌర్ చురకలు?

Also Read : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ

Published at : 17 Aug 2022 05:45 PM (IST) Tags: nani Dulquer Salman Ram Pothineni Hanu Raghavapudi Sitaramam Movie

సంబంధిత కథనాలు

Ponniyin Selvan: ఐశ్వర్య కూతురు ఆరాధ్యకు అరుదైన గౌరవం, ‘పొన్నియన్ సెల్వన్-1’లో ఊహించని ఘటన

Ponniyin Selvan: ఐశ్వర్య కూతురు ఆరాధ్యకు అరుదైన గౌరవం, ‘పొన్నియన్ సెల్వన్-1’లో ఊహించని ఘటన

Bigg Boss Telugu: గీతూను అంత మాట అనేసిన నాగార్జున, రేవంత్‌కు లైన్ క్లియర్!

Bigg Boss Telugu: గీతూను అంత మాట అనేసిన నాగార్జున, రేవంత్‌కు లైన్ క్లియర్!

Dhanush New Song : ఒకే ఒక ఊరిలోనా, ధనుష్ ఎక్కడా 'తగ్గేదే లే'

Dhanush New Song : ఒకే ఒక ఊరిలోనా, ధనుష్ ఎక్కడా 'తగ్గేదే లే'

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

టాప్ స్టోరీస్

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?