Dasara: నాని సినిమా సెట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా..?

నాని నటిస్తోన్న 'దసరా' సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 

FOLLOW US: 

ఇటీవల 'శ్యామ్ సింగరాయ్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న హీరో నాని వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. రీసెంట్ గా 'అంటే సుందరానికీ' సినిమాను పూర్తి చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు నాని. ప్రస్తుతం ఆయన 'దసరా' అనే మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. 

ఇందులో నాని రగ్డ్ లుక్ లో కనిపించబోతున్నారు. తొలిసారి ఈ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారు. సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ కథ మొత్తంలో గ్రామంలో జరుగుతుందట. దానికోసం హైదరాబాద్ లో ఓ విలేజ్ సెట్ వేస్తున్నారు. 

ఈ ఒక్క సెట్ కోసం రూ.12 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ ఈ సెట్ లోనే జరుగుతుందని సమాచారం. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన అవినాష్ కొల్ల ఈ సెట్ ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. కథలో అంటరానితనం కాన్సెప్ట్ కూడా ఉంటుందని టాక్. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. అలానే సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ లాంటి తారలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నారు.  

View this post on Instagram
 
A post shared by Nani (@nameisnani)

Also Read: మహేష్ మరదలిగా మలయాళ బ్యూటీ.. త్రివిక్రమ్ తెగ ప్రమోట్ చేస్తున్నారుగా..

Also Read: నన్ను సినిమా నుంచి తప్పించాలని ఇరిటేట్ చేశారు.. రాజశేఖర్, జీవితలపై దర్శకుడి వ్యాఖ్యలు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 25 Jan 2022 07:31 PM (IST) Tags: nani sudhakar cherukuri Nani dasara movie dasara movie set cost sreekanth odela

సంబంధిత కథనాలు

NTR Jayanthi: కృష్ణుడిగా 17 సినిమాల్లో - ఎన్టీ రామారావు సినీ జీవితంలో ఈ విశేషాలు మీకు తెలుసా?

NTR Jayanthi: కృష్ణుడిగా 17 సినిమాల్లో - ఎన్టీ రామారావు సినీ జీవితంలో ఈ విశేషాలు మీకు తెలుసా?

Karthika Deepam మే 28(ఈ రోజు) ఎపిసోడ్: జ్వాల, నిరుపమ్‌కు పెళ్లి చేద్దామని హిమ ప్లాన్- బ్రేకింగ్ న్యూస్ చెప్పి షాకిచ్చిన సౌందర్య

Karthika Deepam మే 28(ఈ రోజు) ఎపిసోడ్: జ్వాల, నిరుపమ్‌కు పెళ్లి చేద్దామని హిమ ప్లాన్- బ్రేకింగ్ న్యూస్ చెప్పి షాకిచ్చిన సౌందర్య

Guppedantha Manasu మే 28(ఈరోజు) ఎపిసోడ్: మనసులో ప్రేమను రిషికి చెప్పకుండా దాటవేసిన వసుధార- సాక్షి బెదిరింపులతో మాష్టార్‌ స్ట్రోక్

Guppedantha Manasu మే 28(ఈరోజు) ఎపిసోడ్: మనసులో ప్రేమను రిషికి చెప్పకుండా దాటవేసిన వసుధార- సాక్షి బెదిరింపులతో మాష్టార్‌ స్ట్రోక్

Krishna On Mahesh Babu: కృష్ణను స్టూడియో అంతా పరుగులు పెట్టించిన మహేష్ - అమ్మాయి గురించి నానా గొడవ

Krishna On Mahesh Babu: కృష్ణను స్టూడియో అంతా పరుగులు పెట్టించిన మహేష్ - అమ్మాయి గురించి నానా గొడవ

NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్

NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్

టాప్ స్టోరీస్

NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

NTR Centenary birth celebrations :   తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!

Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?