![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nandamuri Suhasini: ఘనంగా నందమూరి సుహాసిని కుమారుడి వివాహం - హాజరైన ప్రముఖులు!
హైదరాబాద్‌లో జరిగిన నందమూరి సుహాసిని, చుండ్రు శ్రీనివాస్‌ల కుమారుడి వివాహానికి ప్రముఖులు హాజరయ్యారు.
![Nandamuri Suhasini: ఘనంగా నందమూరి సుహాసిని కుమారుడి వివాహం - హాజరైన ప్రముఖులు! Nandamuri Suhasini Son Harsha Gets Married to Sai Geethika Check Details Nandamuri Suhasini: ఘనంగా నందమూరి సుహాసిని కుమారుడి వివాహం - హాజరైన ప్రముఖులు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/21/35f338ed48e7b3753fd0053cb994a7501692556796116252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని, చుండ్రు శ్రీనివాస్‌ల కుమారుడు అయిన హర్ష వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. సాయి గీతికతో హర్ష ఏడు అడుగులు వేశారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఈ వివాహ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఎంతోమంది ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
నందమూరి బాలకృష్ణ, ఆయన తనయుడు మోక్షజ్ఞ ,జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహ వేడుకలకు హాజరయ్యారు. బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకరరావు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లతో కూడా ముచ్చటించారు.
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నందమూరి సుహాసిని రాజకీయాల్లో కూడా తన అదృష్టం పరీక్షించుకున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో 41 వేలకు పైగా ఓట్ల తేడాతో సుహాసిని ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఈ కుటుంబం రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చింది.
కీ శే నందమూరి హరికృష్ణ గారి మనవడు, శ్రీమతి నందమూరి సుహాసిని & చుండ్రు శ్రీకాంత్ దంపతుల కుమారుడు, చి శ్రీ హర్ష & చి ల సౌ సాయి గీతిక ల వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించడం జరిగింది @NANDAMURIKALYAN Anna @tarak9999 Anna pic.twitter.com/HLZSU6JWOl
— Nandipati Murali (@NtrMurali9999) August 20, 2023
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)