(Source: Poll of Polls)
Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞ డెబ్యూపై క్రేజీ అప్ డేట్- ఫ్యాన్స్ కు పూనకాలే!
బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబంధించి అదరిపోయే అప్ డేట్ వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా సెప్టెంబర్ 6న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.
Muhurat Fixed For Mokshagna Debut: నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ గురించి గత కొద్ది సంవత్సరాలు ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఎప్పుడెప్పుడు ఆయన వెండితెరపై కనిపిస్తాడా? అని నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన డెబ్యూ మూవీకి సంబంధించి క్రేజీ అప్ డేట్ వచ్చింది. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించబోతున్న ఈ మూవీకి సంబంధించి ఫ్యాన్స్ కు పూనకాలు కలిగించే అప్ డేట్ వచ్చింది.
సెప్టెంబర్ 6న పూజా కార్యక్రమాలు
మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ సినిమాకు సంబంధించి పూజా వేడుక డేట్ ఖరారు అయ్యింది. మోక్షజ్ఞ బర్త్ డే సెప్టెంబర్ 6న పూజా కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు మొదలైనట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను సోషియో ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కంచబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను ప్రశాంత్ వర్మ రెడీ చేశారట. ఈ చిత్రంలో మోక్షజ్ఞ సూపర్ హీరోగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. తన పాత్రకు సంబంధించి ఇప్పటికే మోక్షజ్ఞ శిక్షణ తీసుకుంటున్నారట. ఈ సినిమాను ‘హనుమాన్’ చిత్రాన్ని తలదన్నే స్థాయిలో రూపొందించాలని భావిస్తున్నారట ప్రశాంత్ వర్మ. ఈ చిత్రంలో బాలయ్య కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అర్జునుడి పాత్రలో ఆయన దర్శనం ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తండ్రి, కొడుకులను వెండితెరపై చూస్తే అభిమానులు ఊగిపోవాల్సిందే. ఈ సినిమాలో శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ హీరోయిన్ గా తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
2026లో ప్రేక్షకుల ముందుకు!
నందమూరి యువ హీరో నటిస్తున్న ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్వినీ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలయ్య స్వయంగా చెప్పడం విశేషం. ఇక ‘హనుమాన్’ మూవీతో ప్రశాంత్ వర్మ బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజిలో సక్సెస్ అయ్యింది. ఆంజనేయుడిని స్ఫూర్తిగా తీసుకుని రాసుకున్న కథతో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. రూ. 350 కోట్లు వసూళు చేసి దుమ్మురేపింది. ‘హనుమాన్’ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ మూవీని తెరకెక్కించనున్నారు. తేజ సజ్జతో మరో సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ముందుగా మోక్షజ్ఞ సినిమాను చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా రేంజిలో సక్సెస్ అందుకోవాలని భావిస్తున్నారట ప్రశాంత్ వర్మ.
Read Also: దేవర నుంచి డావుడి - ఆడియన్స్ చేత విజిల్స్ వేయించే ఎన్టీఆర్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్
Read Also: కేశవనాథేశ్వరుడిని దర్శించుకున్న జూ.ఎన్టీఆర్.. రిషబ్ శెట్టి షేర్ చేసిన వీడియో ఎంత బాగుందో?