Devara Third Single: దేవర నుంచి డావుడి - ఆడియన్స్ చేత విజిల్స్ వేయించే ఎన్టీఆర్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్
NTR Devara Update: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ఆయన హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'దేవర' టీమ్ ఓ అప్డేట్ ఇచ్చింది. అది ఏమిటంటే?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇవాళ హైదరాబాద్ సిటీలో అడుగు పెట్టారు. ఆయన రెండు మూడు రోజులుగా కర్ణాటకలో ఉన్నారు. తల్లి షాలిని, భార్య ప్రణతితో అక్కడ పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చారు. హైదరాబాద్ వచ్చాక అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'దేవర' టీమ్ ఓ అప్డేట్ ఇచ్చారు. అది ఏమిటంటే...
దేవర మూడో సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
'దేవర' సినిమాలో మూడో సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 'డావుడి' అంటూ సాగే ఆ పాటను సెప్టెంబర్ 4వ తేదీన... అంటే ఈ బుధవారం విడుదల చేయనున్నట్టు (Daavudi Song Devara Movie) చెప్పారు. ఈసారి లిరికల్ వీడియో కాకుండా మ్యాన్ ఆఫ్ మాసెస్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే డ్యాన్స్ మూమెంట్స్‌తో కూడిన వీడియో సాంగ్ విడుదల చేయనున్నారు.
It’s going to be a sure shot 🔥
— Devara (@DevaraMovie) September 2, 2024
Whistle worthy madness in every beat. #Daavudi on Sept 4th ❤️#Devara #DevaraOnSep27th pic.twitter.com/ctH2jtXM2H
'డావుడి' సాంగ్ విజిల్ వర్తీ అని 'దేవర' టీమ్ పేర్కొంది. ప్రతి బీట్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించే విధంగా ఉంటుందని, ష్యూర్ షాట్ హిట్ అని పేర్కొంది. జాన్వీ కపూర్, ఎన్టీఆర్ స్టిల్ విడుదల చేసింది 'దేవర' టీమ్.
'దేవర' నుంచి ఇప్పటి వరకు రెండు పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఫస్ట్ సాంగ్ 'ఫియర్' ఎన్టీఆర్ క్యారెక్టర్ తాలూకా హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఉంది. ఇక రెండో పాట 'చుట్టమల్లె' హీరో హీరోయిన్ల మీద తెరకెక్కించిన మెలోడీ. ఆ రెండూ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. మూడో పాట 'డావుడి' ఆ రెండిటినీ మించి ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: దీపికా పదుకోన్ కుమారుడిగా నాని... కల్కి ఆయనేనా? సరిపోదా న్యాచురల్ స్టార్ ఇచ్చిన ఈ వివరణ
సెప్టెంబర్ 27న థియేటర్లలో దేవర పాన్ ఇండియా రిలీజ్!
భారీ అండ్ హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'దేవర' రెండు రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రమిది. ఈ నెల 27న పాన్ ఇండియా రిలీజ్ కానుంది.
Also Read: మేమంతా ఓ కుటుంబం... ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి - బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీలో చిరంజీవి కీలక వ్యాఖ్యలు
'దేవర: పార్ట్ 1' సినిమాను ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ కథానాయిక కాగా... బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్, మలయాళ స్టార్ షైన్ టామ్ చాకో, నరైన్ ఇతర ప్రధాన పాత్రధారులు.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















