News
News
X

Naresh Pavithra Lokesh: మా అత్తగారి డైమండ్ నెక్లెస్ పవిత్ర దగ్గరే ఉంది, నరేష్ మూడో భార్య రమ్య ఆరోపణలు

నరేష్ - పవిత్రా లోకేష్ వ్యవహారం రచ్చకెక్కింది. మూడో భార్య రమ్య పవిత్రపై తీవ్రమైన ఆరోపణలు చేసింది.

FOLLOW US: 

నటుడు నరేష్, సీనియర్ నటి పవిత్రా లోకేష్ మధ్య ఉన్న బంధం రచ్చకెక్కింది. భార్య ఉండగానే నరేష్, పవిత్రతో సహజీవనం చేస్తున్నట్టు వార్తలు రావడం,అది నిజమేనని పవిత్రతోనే మీడియా చెప్పించడం జరిగింది. కన్నడ మీడియా చేసిన స్టింగ్ ఆపరేషన్లో తాను నరేష్ కు తోడుగా ఉంటున్నానని ఒప్పుకుంది. ఇక నటుడు నరేష్ తన మూడో భార్య రమ్య గురించి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశాడు. ఆమె క్యారెక్టర్ మంచిది కాదని, తనను మోసం చేసిందంటూ చెప్పాడు. దీంతో మూడో భార్య రమ్య రఘుపతి కూడా తెర మీదకు వచ్చింది. తాను నరేష్ కు విడాకులు ఇవ్వనని తెగేసి చెప్పింది. అంతేకాదు ఓ హోటల్ లో నరేష్ - పవిత్రా కలిసి ఉండగా వెళ్లి చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించింది. ఈ వ్యవహారం ముదిరి పాకాన పడడంతో పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చింది. కాగా రమ్య మీడియాతో మాట్లాడుతతూ పవిత్రపై కొన్ని ఆరోపణలు చేసింది. 

ఆ నెక్లెస్ మా అత్తగారిదే...
నరేష్ మూడో భార్య రమ్య కన్నడ మీడియాతో మాట్లాడుతూ ‘మా అత్తగారు కొన్నేళ్ల క్రితం తన పుట్టినరోజు సందర్భంగా డైమండ్ నెక్లెస్ ధరించారు. ఆ అత్తగారు తన డబ్బును, నగలను ఎవరికీ ఇవ్వరు. అవసరమైతేనే డబ్బును సాయంగా ఇచ్చేవారు. మా ఇంట్లో ఏముందో నరేష్ కు తెలుసు. ఆయనే స్వయంగా ఆ నెక్లెస్ ను పవిత్రకు ఇచ్చి ఉంటారు’ అని ఆరోపించారు రమ్య రఘుపతి. ఆ నెక్లెస్ ను రెండేళ్ల క్రితమే పవిత్రా లోకేష్ ధరించిన ఫోటోలు ఉన్నాయి. అంటే ఈ నెక్లెస్‌ను  ఎప్పుడో ఆమెకు ఇచ్చేసినట్టు చెబుతున్నారు రమ్య. 

నేను కొనుక్కోగలను
రమ్య ఆరోపణలపై పవిత్ర స్పందించింది. తాను కోరుకున్నది కొనుక్కునే శక్తి తనకుందని, వేరే వ్యక్తి సంపాదనపై ఆధారపడి జీవించాల్సిన అవసరం లేదని చెప్పింది. ‘నేను బంగారం కొనగలను. నా పేరు మీద రెండు ఫ్లాట్లు ఉన్నాయి. కోరుకున్నది కొనుక్కునే శక్తి నాకుంది. నరేష్ నా కష్టాలు వింటాడు. నేను అతని కష్టాలు వింటాను అతని డబ్బుతో జీవించాల్సిన అవసరం లేదు’ అంది పవిత్ర. ప్రస్తుతం మైసూరు వేదికగా వీరి ట్రయాంగిల్ కథ నడుస్తోంది. నరేష్ తనను ఇష్టంతో పెళ్లి చేసుకోలేదని కేవలం రాజకీయ అవసరాల కోసం చేసుకున్నాడని కూడా ఆమె గతంలో తెలిపారు. 

Also read: మైసూరు హోటల్‌లో నరేష్, పవిత్ర - చెప్పుతో కొట్టబోయిన మూడో భార్య రమ్య

Also read: కావాలనే నన్ను బ్యాడ్ చేస్తున్నారు - పవిత్రా లోకేష్ ఎమోషనల్ కామెంట్స్

Published at : 03 Jul 2022 12:49 PM (IST) Tags: Ramya Raghupathi Pavithra Lokesh Naresh Third wife Naresh Pavithra Lokesh Naresh pavithra lokesh Hotel

సంబంధిత కథనాలు

Rana-Miheeka: రానా మ్యారీడ్ లైఫ్‌పై రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన అతడి భార్య!

Rana-Miheeka: రానా మ్యారీడ్ లైఫ్‌పై రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన అతడి భార్య!

Prabhas: 'సీతారామం' ఎఫెక్ట్ - ప్రభాస్ డైరెక్టర్‌ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్!

Prabhas: 'సీతారామం' ఎఫెక్ట్ - ప్రభాస్ డైరెక్టర్‌ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్!

Bimbisara: 'బింబిసార' రేర్ ఫీట్ - మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!

Bimbisara: 'బింబిసార' రేర్ ఫీట్ - మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!

Taapsee Pannu : నా శృంగార జీవితం ఆయనకు ఆసక్తికరంగా అనిపించలేదు ఏమో!? - తాప్సీ పన్ను

Taapsee Pannu : నా శృంగార జీవితం ఆయనకు ఆసక్తికరంగా అనిపించలేదు ఏమో!? - తాప్సీ పన్ను

Samantha: సమంతకి క్రేజీ ఛాన్స్ - డేట్స్ అడ్జస్ట్ చేయగలదా?

Samantha: సమంతకి క్రేజీ ఛాన్స్ - డేట్స్ అడ్జస్ట్ చేయగలదా?

టాప్ స్టోరీస్

TS Constable Exam : తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా, ఎగ్జామ్ ఎప్పుడంటే?

TS Constable Exam : తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా, ఎగ్జామ్ ఎప్పుడంటే?

Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!

Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!

Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!

Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!

Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్‌

Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్‌