By: ABP Desam | Updated at : 28 Aug 2021 12:01 PM (IST)
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’
అక్కినేని అఖిల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించినప్పటికీ ఇప్పటికీ అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. కెరీర్ ఆరంభంలో చేసిన మూడు సినిమాలు అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. అయినప్పటికి అక్కినేని కుర్రాడు ఎక్కడా కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. ఫెయిల్యూర్స్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్న అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`కి కమిటయ్యాడు. మంచి ప్రేమకథ కావడంతో మొదటి మూడు చిత్రాల ఫెయిల్యూర్స్‌ను ఈ సినిమా ఘన విజయంతో తుడిచిపెట్టేస్తా అంటున్నాడు. ఈ మేరకు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు.
Get ready to meet #MostEligibleBachelor in theatres from 𝐎𝐜𝐭 𝟖𝐭𝐡 2021 #MEBOnOct8th#alluaravind @akkineniakhil @hegdepooja #bommarillubhaskar #pradeeshvarma #BunnyVas #VasuVarma @adityamusicindia @ga2pictures pic.twitter.com/5fECKjSvuX
— BA Raju's Team (@baraju_SuperHit) August 28, 2021
షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలయ్యే సమయంలో కరోనా ప్రభావంతో వాయిదా పడక తప్పలేదు. కరోనా కారణంగా చాలా సినిమాలు షూటింగులు వాయిదా పడడంతో ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్స్ కూడా మారుతూ వచ్చాయి. అక్టోబర్ 13న రావాల్సిన రాజమౌళి మల్టీ స్టారర్ ‘ఆర్.ఆ.ర్ఆర్’ వాయిదా పడుతుందన్న సమాచారం వల్లో ఏమో కానీ మోస్ట్ ‘ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా అక్టోబర్ 8న విడుదల చేస్తున్నామని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్లో ప్రమోషన్ ప్రారంభించి దసరాకి థియేటర్లలో సందడి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. జిఎ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నఈ సినిమాలో అఖిల్ హర్ష అనే ఎన్ఆర్ఐ పాత్రలో, పూజా హెగ్డే మాత్రం విభా అనే పాత్రలో నటించబోతోంది. ఈషా రెబ్బ, మురళి శర్మ, వెన్నెల కిషోర్, జయప్రకాష్, ప్రగతి, ఆమని కీలకపాత్రలు పోషిస్తున్నారు.
సంక్రాంతికి ఇప్పటికే స్లాట్స్ ఫుల్ అయిపోయాయి. ఇదే అదనుగా చాలా సినిమాలు దసరా బరిలో దిగేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే శర్వానంద్-సిద్దార్థ్ ‘మహాసముద్రం’ అక్టోబర్ 14న విడుదలవుతోంది. అందుకు ఆరు రోజుల ముందే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ థియేటర్లలో సందడి చేస్తోందన్నమాట. మరి వరుస మూడు సినిమాలతో పెద్దగా ఫలితం దక్కించుకోలేని అఖిల్ ఈ మూవీతో అదిరిపోయే హిట్టందుకుంటాడేమో చూడాలి.
Also Read: పవర్ స్టార్‌తో బుట్టబొమ్మ.. ఆ దర్శకుడితో మూడోసారి.. పూజా హెగ్డేకు గోల్డెన్ ఛాన్స్!
Also Read: గాయకుడు-నటుడు యోయో సింగ్ పై ఢిల్లీ కోర్టులో గృహహింస కేసు
Also Read: దసరాకి థియేటర్లలో మహాసముద్రం..గన్ తో ఒకర్నొకరు బెదిరించుకుంటున్న శర్వానంద్-సిద్దార్థ్
NT Rama Rao Jayanti : ఎన్టీఆర్‌ను దేవుడిగా ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?
నా కూతురు అల్లు అర్జున్‌కు పెద్ద ఫ్యాన్, ఆయనొస్తే నాకు చెప్పండి - మలయాళం హీరో టోవినో థామస్
The India House Movie : నిఖిల్ హీరోగా రామ్ చరణ్ సమర్పించు 'ది ఇండియా హౌస్' - తగలబడిన ఇంటి మిస్టరీ ఏమిటో?
NTR 100th Birth Anniversary: తెలుగు జాతికి ఘనకీర్తి తెచ్చిన మహనీయుడు, కారణజన్ముడు- ఎన్టీఆర్ ను స్మరించుకున్న సినీ ప్రముఖులు
Sharwanand Accident : యాక్సిడెంట్ అయినప్పుడు కారులోనే శర్వానంద్ - గాయాలు ఏం కాలేదు!
Telangana Politics : అయితే కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్ - పొంగులేటి, జూపల్లి డిసైడయ్యారా ?
New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
New Parliament Opening: కొత్త పార్లమెంట్‌పై RJD వివాదాస్పద ట్వీట్, శవపేటికతో పోల్చడంపై దుమారం
CSK vs GT IPL 2023 Final: మొతేరాలో ఫైనల్ మోత! సీఎస్కే, జీటీ పాజిటివ్, నెగెటివ్స్ ఇవే!