Sattaru Pre-Look Poster: రక్తంతో తడిసిన కత్తి.. బ్లాక్ కలర్ లాంగ్ కోట్.. నాగార్జున-ప్రవీణ్ సత్తారు మూవీ ఫస్ట్ లుక్ ఓ రేంజ్‌లో ఉంది
టాలీవుడ్ కింగ్ నాగార్జున జోరు పెంచాడు. ఓ వైపు బంగార్రాజు మూవీ సెట్స్ పైకి తీసుకొచ్చాడు. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 5 హడావుడిలో ఉన్నాడు. తాజాగా ప్రవీణ్ సత్తారుతో చేస్తున్న మూవీ ప్రీలుక్ బయటకొచ్చింది.
హిట్టు-ఫ్లాప్ అనే ఆలోచన లేకుండా ప్రయోగాలు చేసేందుకు నాగార్జున ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అందుకు తగ్గట్టే ఈసారి కూడా నాగ్ ప్రయోగాల బాటలోనే వెళుతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ప్రస్తుతం భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు. ఈ మూవీ చిత్రనిర్మాత సునీల్ నారంగ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ మూవీ పోస్టర్ ని చిత్రబృందం రిలీజ్ చేసింది.
Here's the PRE LOOK of
— Praveen Sattaru (@PraveenSattaru) August 27, 2021
🗡️ #KingNagsNext 🗡️
⭐ing KING @iamnagarjuna 👑
A film by @PraveenSattaru 💥
An exciting update coming your way on 29-08-21 🔐🔥@MsKajalAggarwal #NarayanDasNarang #RamMohanRao @AsianSuniel @sharrath_marar @SVCLLP @nseplofficial#HBDSunielNarang pic.twitter.com/1TsHUrqelL
Here's the PRE LOOK of
— BA Raju's Team (@baraju_SuperHit) August 27, 2021
🗡️ #KingNagsNext 🗡️
⭐ing KING @iamnagarjuna 👑
A film by @PraveenSattaru 💥
An exciting update coming your way on 29-08-21 🔐🔥@MsKajalAggarwal #NarayanDasNarang #RamMohanRao @AsianSuniel @sharrath_marar @SVCLLP @nseplofficial#HBDSunielNarang pic.twitter.com/g3X1bDO0Co
చేతిలో కత్తితో నాగార్జున యాక్షన్ ప్యాక్డ్ అవతార్‌లో ఉన్న ప్రీ-లుక్ పోస్టర్ వైరల్ అవుతోంది. బ్లాక్ కలర్ లాంగ్ కోట్ వేసుకుని భీకరంగా కురుస్తున్న వర్షంలో వెళుతూ రక్తంతో తడిసిన కత్తి పట్టుకున్న పోస్టర్లో నాగార్జున మిస్టీరియస్ మ్యాన్‌లా కనిపిస్తున్నాడు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 29 న ఈ టీమ్ నుంచి మరో అద్భుతమైన అప్ డేట్ రానుందని కూడా పోస్టర్‌లో వెల్లడించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP - నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె నారంగ్- పుస్కూర్ రామ్ మోహన్ రావు - శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది.
Also Reaad:‘మా అమ్మ నాన్న లేచిపోయి పెళ్లి చేసుకున్నారు.. అందుకే మళ్లీ పెళ్లి చేశా: టీవీ నటి అమ్ములు
‘సోగ్గాడే చిన్నినాయన’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న బంగార్రాజు షూటింగ్ తాజాగా మొదలైంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుందట. ఇంకా ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోను నాగ్ నటిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్‌తోపాటు రణ్‌బీర్‌కపూర్, ఆలియా భట్ కూడా ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ‘మనం’ సినిమాకు సీక్వెల్ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి రెండు రోజుల ముందు నుంచే నాగార్జున బర్త్ డే సందడి మొదలైపోయిందనే చెప్పాలి.
Also Read:బుల్లెట్ బండి.. భలే దూసుకెళ్తోంది, ఇంతకీ ఎవరీ మోహన భోగరాజు?
Also Read: గ్లామర్ డోసు పెంచిన అవికా గోర్.. బోల్డ్ సీన్స్‌లో రాహుల్ రామకృష్ణ
Also Read: ‘వివాహ భోజనంబు’ మూవీ ఆన్‌లైన్‌లో లీక్.. సందీప్‌కు షాకిచ్చిన తమిళ్ రాకర్స్
Also Read: గుడ్‌న్యూస్.. RRR షూటింగ్‌కు శుభం కార్డు.. మొదలు పెట్టిన సీన్‌తోనే ముగింపు