Honey Singh Accused: గాయకుడు-నటుడు యోయో సింగ్ పై ఢిల్లీ కోర్టులో గృహహింస కేసు

బాలీవుడ్ సింగర్, నటుడు యో యో హనీసింగ్ పై ఢిల్లీ హైకోర్టులో గృహహింస పిటిషన్ దాఖలైంది. తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడని ఆరోపిస్తూ భార్య శాలిని తల్వార్ పిటిషన్ వేసింది.

FOLLOW US: 

బాలీవుడ్ సింగర్, నటుడు యో యో హనీసింగ్ తనని లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నట్టు ఆరోపిస్తూ భార్య శాలిని తల్వార్ ఢిల్లీలో తీజ్ హజారీ కోర్టులో గృహహింస నిరోధక చట్టం కింద పిటిషన్ దాఖలు చేసింది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి యో యో సింగ్ మోసం చేశాడని పిటిషన్లో పేర్కొంది. ఈ మేరకు శాలిని తరపు న్యాయవాదులు సందీప్ కౌర్, అపూర్వ పాండే, జీజీ కశ్యప్ కోర్టుకు హాజరయ్యారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి తానియా సింగ్..హనీ సింగ్ కి నోటీస్ జారీచేశారు. హనీ సింగ్ తనపై వచ్చిన ఆరోపణలకు ఈ నెల 28లోగా స్పందించాల్సిందిగా నోటీసులో పేర్కొంది.  తమ ఉమ్మడి ఆస్తులకు సంబంధించి హనీసింగ్ ఎలాంటి లావాదేవీలు జరపకూడదంటూ శాలినీ తల్వార్‌కు అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

శాలినీ ఆరోపణలపై గతంలో స్పందించిన యో యో సింగ్ అప్పట్లో ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ‘‘నా భార్య షాలిని తల్వార్‌ నాపై, నా కుటుంబంపై మోపిన అసత్య  ఆరోపణలు విని చాలా బాధపడ్డాను, ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను. ఆమె చెప్పేవి చాలా అసహ్యంగా ఉన్నాయి. గతంలో నా మ్యూజిక్‌ మీద, ఆరోగ్యం మీద ఎన్నో రూమర్లు వచ్చినప్పటికీ వాటిపై నేనెప్పుడూ స్పందించలేదు. నాపై వ్యతిరేక ప్రచారం జరిగినా ఎలాంటి ప్రెస్‌నోట్‌ జారీ చేయలేదు. కానీ ఈసారి మౌనంగా ఉండటం కరెక్ట్‌ కాదనిపిస్తోంది. ఎందుకంటే నాకు ఎంతగానో అండగా నిలబడ్డ నా వృద్ధ తల్లిదండ్రులు, చెల్లి మీద ఆమె నీచమైన ఆరోపణలు చేస్తోంది. ఇవి మా పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయి’’ అని నోట్‌లో పేర్కొన్నాడు. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్న యోయో సింగ్  త్వరలోనే నిజం బయటపడుతుందని ఆశిస్తున్నా అన్నాడు. అప్పటి వరకూ తన గురించి, తన కుటుంబం గురించి ఎలాంటి నిర్ధారణకు రావొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నా అని ట్వీట్ చేశాడు. 

2014 లో ఇండియా రా స్టార్ అనే రియాల్టీ అనే రియాల్టీ షో లో తన భార్య శాలినీ తల్వార్ ని పరిచయం చేశాడు  హనీసింగ్. సైఫ్ అలీఖాన్-దీపిక నటించిన ‘కాక్ టెయిల్’ సినిమాలోని ఓ పాట హనీసింగ్‌కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి వరుస ప్రాజెక్టుల్లో అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. 

Also Read: పవర్ స్టార్‌తో బుట్టబొమ్మ.. ఆ దర్శకుడితో మూడోసారి.. పూజా హెగ్డేకు గోల్డెన్ ఛాన్స్!

Also Read: ‘కొండపొలం’ వీడియో సాంగ్: ఓ ఓబులమ్మ అంటూ.. రకుల్‌తో వైష్ణవ్ తేజ్ రొమాన్స్

Also Read: ‘కిన్నెరసాని’ టీజర్.. థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో చిరు అల్లుడు అదరగొట్టేశాడు!

Published at : 28 Aug 2021 11:34 AM (IST) Tags: Yo Yo Honey Singh Accused Domestic Violence Act Shalini talwar

సంబంధిత కథనాలు

Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్

Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి

Hyderabad: ఏడాదిగా సహజీవనం, రెండ్రోజుల్లోనే పెళ్లి - ఇంతలో వరుడు మృతి! వధువు ఏం చేసిందంటే

Hyderabad: ఏడాదిగా సహజీవనం, రెండ్రోజుల్లోనే పెళ్లి - ఇంతలో వరుడు మృతి! వధువు ఏం చేసిందంటే

Tirupati: పీకలదాకా తాగి పోలీసులు వీరంగం, భయపడి 100కి కాల్ చేసిన స్థానికుడు - తరువాత ఏం జరిగిందంటే !

Tirupati: పీకలదాకా తాగి పోలీసులు వీరంగం, భయపడి 100కి కాల్ చేసిన స్థానికుడు - తరువాత ఏం జరిగిందంటే !

Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ

Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

GT vs RR, Qualifier 1 Highlights: మిల్లర్‌ 'కిల్లర్‌' విధ్వంసం, ఫైనల్‌కు GT - RRకు మరో ఛాన్స్‌

GT vs RR, Qualifier 1 Highlights: మిల్లర్‌ 'కిల్లర్‌' విధ్వంసం, ఫైనల్‌కు GT - RRకు మరో ఛాన్స్‌

Gold-Silver Price: నేడు మళ్లీ పసిడి ధర షాక్! ఊహించనట్లుగా పెరిగిన బంగారం, వెండి మాత్రం కిందికి

Gold-Silver Price: నేడు మళ్లీ పసిడి ధర షాక్! ఊహించనట్లుగా పెరిగిన బంగారం, వెండి మాత్రం కిందికి

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!