Kinnerasani Teaser: ‘కిన్నెరసాని’ టీజర్.. థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో చిరు అల్లుడు అదరగొట్టేశాడు!
మిస్టరీ, థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ ‘కిన్నెరసాని’ టీజర్ చూస్తే.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి.
మెగా కుటుంబం నుంచి వచ్చని మరో హీరో కళ్యాణ్ దేవ్. ‘విజేత’ సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు. లేటైనా.. లేటెస్టుగా వస్తానన్నట్లుగా.. సరికొత్త కాన్సెప్ట్‌తో ముందుకొస్తున్నాడు. ‘కిన్నెరసాని’ అనే థ్రిల్లర్ చిత్రంతో.. కొత్త లుక్‌తో కట్టిపడేస్తున్నాడు. ‘కిన్నెరసాని’ సినిమా టీజర్‌ను శుక్రవారం హీరో నితిన్ యూట్యూబ్‌లో విడుదల చేశాడు. ట్రైలర్‌లోని సన్నివేశాలు కాదు.. బీజీఎం కూడా రోమాలు నిక్కబొడుచుకొనేలా ఉన్నాయి. థ్రిల్లర్ చిత్రాల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం మాంచి హిట్ సాధించే అవకాశాలున్నట్లు అనిపిస్తోంది.
‘‘మీ పాప ఒక అద్భుతం పార్వతి గారు. కానీ అద్భుతం జరిగే ప్రతిచోట ఆపదలు కూడా ఉంటాయి’’ అనే డైలాగ్‌తో ఈ టీజర్ మొదలైంది. ఆ తర్వాత కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలు కనిపిస్తాయి. ‘కిన్నెరసాని’ అనే పుస్తకాన్ని పట్టుకున్న కళ్యాణ్ దేవ్.. ‘‘ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక లిమిట్ ఉండాలి. అది ద్వేషానికైనా.. చివరికి ప్రేమకైనా’’ అనే డైలాగ్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ టీజర్ చూస్తే.. మీకు కూడా ఈ సినిమా మీద ఆసక్తి కలుగుతుంది. వేదా అనే యువతి తన తండ్రి కోసం అన్వేషిస్తున్న సమయంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటీ? ఆమె తండ్రి ఏమయ్యాడనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలిసింది. వ
‘కిన్నెరసాని’ టీజర్:
మిస్టరీ, థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘కిన్నెరసాని’ చిత్రంలో కళ్యాణ్ దేవ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నాడు. అయితే, ఆ రెండు పాత్రల్లో ఉన్నది ఒక్కరేనా.. లేదా వేర్వేరా అనేది సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. రవీంద్ర విజయ్, అన్ శీతల్, మహతీ బిక్షు, కాశిష్ ఖాన్ తదితరులు నటిస్తున్నారు. రమన్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్ తల్లూరి నిర్మాత. మహతీ స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దేశరాజ్ ఈ చిత్రానికి కథను అందించారు.