అన్వేషించండి

Kondapolam Song: ‘కొండపొలం’ వీడియో సాంగ్: ఓ ఓబులమ్మ అంటూ.. రకుల్‌తో వైష్ణవ్ తేజ్ రొమాన్స్

వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ‘కొండపొలం’ సినిమాలోని ఈ పాటను వింటే మనసు ఎక్కడికో వెళ్లిపోతుంది.

‘ఉప్పెన’ సినిమాతో హిట్ కొట్టిన హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌.. ‘కొండపొలం’ చిత్రంతో మెగా అభిమానులను అలరించేందుకు సిద్ధమైపోతున్నాడు. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వైష్ణవ్.. కటారు రవీంద్ర యాదవ్‌గా విభిన్న పాత్రలో కనిపించనున్నాడు. ‘కొండపాలెం’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టైటిల్‌ను ‘కొండ పొలం’గా ఖరారు చేశారు. ఇటీవలే ఈ చిత్రం మోషన్ పోస్టర్‌, ఫస్ట్‌లుక్ పోస్టర్లను విడుదల చేసిన చిత్రయూనిట్.. శుక్రవారం (ఆగస్ట్ 27న) ఈ సినిమాలోని వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. 

ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓబులమ్మ పాత్రలో రకుల్ పల్లెటూరు అమ్మాయిగా కనిపించనుంది. ఇటీవల ఓబులమ్మ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది.  ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీత అందిస్తున్నారు. తాజాగా మ్యాంగో మ్యూజిక్ వీడియో సంస్థ విడుదల చేసిన ఓబులమ్మ సాంగ్‌.. సినిమాపై అంచనాలను పెంచేసింది.

‘‘ఓ.. ఓ.. ఓబులమ్మా బొమ్మ కర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ. కపర కపర వేకువ లోన.. కాలమంతా లెక్కలు గట్టి.. గుండెలోన నీ పేరు జపమాయె. ఇదివరకెపుడు తెలియని ఎరగని.. తురుపే మైమరిపిస్తూ ఉంటె.. కంటికేమో కునుకే దూరపు చుట్టమాయే’’ అంటూ వచ్చే ఈ పాటను పీవీఎన్ఎస్ రోహిత్, సత్య యామిని ఎంతో చక్కగా ఆలపించారు. వినేకొద్ది వినాలనిపించేలా ఈ పాట ఉంది. విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో సాంగ్‌ను మీరూ చూసేయండి. 

వీడియో:

ఇందులో వైష్ణవ్ తేజ్ గడ్డంతో కనిపించాడు. తలకు ఎర్రగుడ్డ కట్టుకున్న తేజ్.. ప్రతి నాయకులపై దాడికి దిగుతున్నట్లుగా ఫస్ట్‌లుక్ సీన్‌లో కనిపించింది. గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఆమె ఓబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్ర పోషిస్తోంది. కోటా శ్రీనివాసరావు, నాజర్, అన్నపూర్ణ, హేమా, ఆంటోనీ, రవి ప్రకాష్, మహేష్ విట్టా, రచ్చ రవి, ఆనంద్ విహారి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

పవన్ కళ్యాణ్ నటించిన ‘జానీ’ సినిమాలో బాలనటుడిగా పరిచయమైన వైష్ణవ్ తేజ్.. ఆ తర్వాత చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.’, ‘అందరివాడు’ సినిమాల్లో నటించాడు. 2020లో ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తాజాగా ‘కొండపొలం’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాదిలోనే మరో రెండు సినిమాల్లో నటించేందుకు అంగీకరించాడు. మూడో చిత్రం కూడా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేతిక శర్మ, బాలీవుడ్ బ్యూటీ శోభితా రానాలను హీరోయిన్లుగా ఫిక్స్ చేసినట్లు తెలిసింది. మరో చిత్రం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Also Read: ‘వివాహ భోజనంబు’ రివ్యూ.. కరోనాకు కామెడీ ట్రీట్మెంట్

టాప్ హెడ్ లైన్స్

Lokesh Kanagaraj DC : హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Poonam Pandey : హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
Ragini 3 : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో మిల్కీ బ్యూటీ - ఫస్ట్ డే షూటింగ్... 12 ఏళ్ల తర్వాత...
బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో మిల్కీ బ్యూటీ - ఫస్ట్ డే షూటింగ్... 12 ఏళ్ల తర్వాత...
Fauzi Release Date: ఫౌజీ రిలీజ్ డేట్... డిసెంబర్‌లో థియేటర్లలోకి ప్రభాస్ సినిమా
ఫౌజీ రిలీజ్ డేట్... డిసెంబర్‌లో థియేటర్లలోకి ప్రభాస్ సినిమా

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Embed widget