Malaikottai Vaaliban Trailer: నిన్ను నువ్వు మర్చిపోతే నమ్మకద్రోహం తప్పదు, గూస్ బంప్స్ తెప్పిస్తున్న మోహన్ లాల్ ‘మలైకోట్టై వాలిబన్’ ట్రైలర్
Malaikottai Vaaliban Trailer: మోహన్ లాల్ తాజా చిత్రం ‘మలైకోట్టై వాలిబన్’ రిపబ్లిక్ డే కానుకగా ఈ నెల 25న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అదిరిపోయే ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
Mohanlals Malaikottai Vaaliban movie Trailer Out: సరికొత్త కథాంశాలు, వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తారు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్. తాజాగా ఆయన ‘మలైకోట్టై వాలిబన్’ అనే పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు. లిజో జోస్ పెలిసెరీ ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రైలర్ ను విడుదల చేశారు. విజువల్ వండర్ గా రూపొందిన ఈ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తుంది.
పవర్ ఫుల్ మల్లయోధుడిగా మోహన్ లాల్
ఇప్పటికే విడుదలైన టీజర్ లో ఓటమెరుగని మల్లయోధుడిగా మోహన్ లాల్ కనిపించాడు. తాజాగా వచ్చిన ట్రైలర్ లో ఆయనను మరింత పవర్ ఫుల్ గా చూపించారు. బ్రిటీష్ పాలకుల నుంచి స్వాతంత్ర్యం కోసం ఓ ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటాన్ని ఇందులో చూపించారు మేకర్స్. ఇందులో మోహన్ లాల్ అత్యంత బలశాలిగా కనిపించనున్నాడు. "విజయాన్ని మించిన ఆనందం మరొకటి లేదు. నేను ప్రస్తుతం ఆనందంలోనే మునిగిపోయాను. కానీ, ఆ ఆనందంలో నమ్మకద్రోహం ఉందని తెలుసుకోలేకపోయాను. నిన్ను నువ్వు మర్చిపోయినప్పుడు ద్రోహానికి గురికావడం కామన్. ఇప్పుడు మంగోడు బరిలో మోసం తప్ప క్రీడాస్ఫూర్తి లేదు. అక్కడంతా రక్తం, కన్నీళ్లే. ఆ కన్నీళ్ల నుంచి సముద్రం పుట్టుకొస్తుంది. ఆ సముద్రంలోతుల నుంచే మండే సూర్యుడు బయటకు వస్తాడు” అనే డైలాగులతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతోంది. ట్రైలర్ చివరలో ఎంట్రీ ఇచ్చే మోహన్ లాల్ పవర్ ఫుల్ లుక్ తో ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచేలా చేస్తున్నారు.
యూకేలో రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల
ఇక ‘మలైకోట్టై వాలిబన్’ చిత్రం కోలీవుడ్ లో భారీ స్థాయలో విడుదల కాబోతోంది. లండన్ లో నూ పెద్ద సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఓపెనింగ్ వీక్ ఏకంగా 175కు పైగా థియేటర్లలో ప్రదర్శనకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పనులు సైతం పూర్తి చేసుకుంది. ఈ మూవీకి U/A సర్టిఫికేట్ లభించింది. మూవీ రన్ టైమ్ 2 గంటల 35 నిమిషాలుగా ఫిక్స్ అయ్యింది. ఈ చిత్రంలో హరీష్ పేరడి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్ సేత్, మనికంద రాజన్, ఆండ్రియా రావెరా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని మ్యాక్స్ ల్యాబ్స్ సెంచురీ ఫిలిమ్స్ బ్యానర్లపై జాన్ మేరీ క్రియేటివ్ తెరకెక్కిస్తున్నారు. మోహన్ లాల్ ‘వృషభ’, ‘ఎంపురాన్’, ‘రామ్ బాన్’, ‘బారోజ్’, ‘రామ్: పార్ట్ 1’ చిత్రాల్లో నటిస్తున్నారు. అటు ‘మలైకోట్టై వాలిబన్’ రెండు భాగాలుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండో భాగం పనులు కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Read Also: విజువల్ ట్రీట్ ఇచ్చిన 'హనుమాన్' విగ్రహం నిజంగా ఉందా? మూవీ షూటింగ్ లొకేషన్స్ ఎక్కడంటే..